వినాయ‌క చ‌వితికి లుక్కుల హంగామా!

పండ‌గొస్తే… సినిమా వాళ్ల‌కూ మూడ్ వ‌స్తుంటుంది. మంచి ముహూర్తం చూసుకుని లుక్కులు, టీజ‌ర్లు, ట్రైల‌ర్లూ వ‌ద‌లాల‌నుకున్న‌వాళ్ల‌కు పండ‌గ‌కి మించిన త‌రుణం ఏముంటుంది? అందుకే ప‌ర్వ‌దినాల‌కు కొత్త సినిమా క‌బుర్లు ఎక్కువ‌గా వినిపిస్తుంటాయి. ఈ వినాయ‌క చ‌వితికి లుక్స్‌, ట్రైల‌ర్లు, టీజ‌ర్లూ ఎక్కువ‌గానే దిగ‌బోతున్నాయి. ర‌వితేజ `డిస్కోరాజా` ఫ‌స్ట్ లుక్ వినాయ‌క చ‌వితికే వ‌స్తోంది. ర‌వితేజ లుక్ ఈ సినిమాలో కొత్త‌ర‌కంగా ఉండ‌బోతోంద‌ని చిత్ర‌బృందం ముందు నుంచీ చెబుతూనే ఉంది. మ‌రి ఆ లుక్ ఎలా ఉంటుందో చూడాలి. వెంకీమామ టీజ‌ర్ పండ‌క్కి విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయి. వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న చిత్ర‌మిది. షూటింగ్ దాదాపుగా పూర్తికావొచ్చింది. అందుకే టీజ‌ర్‌నీ రెడీ చేసేస్తున్నారు. క‌ల్యాణ్ రామ్ సినిమా `ఎంత మంచి వాడ‌వురా` నుంచి కూడా ఓ లుక్ రాబోతోంద‌ని తెలుస్తోంది. బాల‌కృష్ణ – కె.ఎస్‌.ర‌వికుమార్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రెడీ అవుతోంది. ఈ సినిమా టైటిల్ ఏమిట‌న్న‌ది వినాయ‌క చ‌వితికి తెలిసే అవ‌కాశం ఉంది. దాదాపుగా `రూల‌ర్‌` అనే టైటిల్ ఖాయం చేస్తార‌ని స‌మాచారం. స‌రిలేరు ఎవ్వ‌రు, సైరాల నుంచి కూడా వినాయ‌క‌చ‌వితి స్పెష‌ల్స్ రాబోతున్నాయ‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com