ప‌వ‌న్ పై ఆధారాల కోసం ఓ ‘వీఐపీ’ ఆరా..!

ఎక్క‌డో స్విచ్ నొక్కితే… మ‌రెక్క‌డో బ‌ల్బ్ వెలుగుతుంది..! జనసేన నాయకుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యంలో అలాంటి ఒక స్విచ్ కోస‌మే ఒక ‘వీఐపీ’ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఎదిగిన వాడు మనకు ఒదిగి వుండాలంటే, అతగాడి వీక్ నెస్ ఏదో ఒకటి మనకు తెలియాలి కదా? ధుర్యోధనుడి వీక్ నెస్ తెలియబట్టే భీముడి చేత తొడల మీద కొట్టించాడు కృష్ణుడు. వాలి బలం తెలియబట్టే, రాముడు చెట్టుచాటుకు వెళ్లాడు. లేటెస్ట్ గా తెలుగు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బలమైన కుల నేతగా అవతరించే సీన్ కనిపిస్తోంది. సో, మనవాడి బలహీనత తెలుసుకుంటే మనకు ఏదైనా ప్రయోజనం వుండొచ్చు. ఇదీ సదరు విఐపి స్ట్రాటజీ. పైగా ఈ విఐపి బిజినెస్ మెన్ గా ఎదిగి, రాజకీయంగా ఎదగాలని 2014 నుంచి విఫలయత్నం చేస్తున్నాడు. అప్పట్లో ఎంపీ టికెట్ అరచేతిలో పడినట్లే పడి, జారిపోయింది. ఈసారి అలా కాకూడదని గట్టి పట్టుదలగా వున్నాడు. అలాంటి వ్యవహారానికి ఇలాంటి వీక్ నెస్ లు బాగా పనికి వస్తాయి.

ఇంతకీ పవన్ కళ్యాణ్ వీక్ నెస్ ఏమిటి? సదరు వ్యాపారవేత్త వెదుకుతున్నది ఏమిటి? జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఆ మ‌ధ్య ఓ భారీ వివాదం రేగిన సంగతి తెలిసిందే. మీడియా వేదిక‌గా ప‌వ‌న్ అభిమానులు వెర్సెస్ వ్యతిరేకుల మధ్య వాదనలు చాలా న‌డిచాయి. ఆ సంద‌ర్భంగా ప‌వ‌న్ కు సంబంధించిన కొన్ని వ్య‌క్తిగ‌త విష‌యాల‌పై కూడా తీవ్ర చ‌ర్చే జ‌రిగిందే.

ప‌వ‌న్ క‌ల్యాణ్ ర‌హ‌స్య సంబంధాల‌పై ఆ మ‌ధ్య ఓ టాపిక్ తెర మీదికి వ‌చ్చింది. త‌న సినిమాలో అవ‌కాశం ఇద్దామ‌నుకున్నా, కొన్ని కారణాల వల్ల కుద‌ర‌క‌పోవ‌డంతో, తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన ఒక‌రిని ప‌వ‌న్ ‘దగ్గరకు తీసుకుని’ ఓదార్చార‌నీ, అక్క‌డే అనుబంధం చిగురించి, రహస్య సంబంధాలు బలపడ్డాయని గ్యాసిప్ క‌థ‌నాలు వినిపించాయి. దాన్లో భాగంగానే త‌న‌కున్న రాజ‌కీయ ప‌లుకుబ‌డిని ఉప‌యోగించి ప్ర‌భుత్వం ద్వారా ఆ ‘వ్య‌క్తి’కి ల‌బ్ధి చేకూర్చే ఒక ప‌నిచేయించార‌నీ విమ‌ర్శ‌లు వినిపించాయి..!

స‌రే, ఆ వివాదం కొన్నాళ్ల‌పాటు మీడియా వేదిక‌గా ర‌చ్చ అయింది. తరువాత, ప‌వ‌న్ అభిమానులు కూడా శాంతించ‌డంతో ఇత‌ర వివాదాస్పద అంశాల‌తోపాటూ ఆ టాపిక్ కూడా మెల్ల‌గా ప‌క్క‌కు వెళ్లిపోయింది. అయితే, ఆ సంబంధాల విష‌య‌మై ఇప్పుడు ఆ ‘ప్ర‌ముఖుడు’ తాజాగా ఆధారాలు సేక‌రించే ప‌నిలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. పవన్ తో బంధాలున్న వ్యక్తి దగ్గర కొన్ని ఆధారాలు వున్నాయని, వాటిని తనకు ఇస్తే, మాంచి సినిమా చాన్స్ ఇస్తానని ఆశ చూపిస్తున్నాడట. కాదూ అంటే కాస్త గట్టి మొత్తమే ముట్ట చెబుతానని బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు వదంతులు వినిపిస్తున్నాయి.

అంటే పవన్ పై వచ్చిన గ్యాసిప్ కథానాలకు ఆధారం వెదుకుతున్నాడు ఆ ప్రముఖుడు అన్న గ్యాసిప్ ఇప్పుడు లేటెస్ట్ అన్నమాట. మరి దీనికి ఎప్పుడు ఆధారం లభిస్తుందో? ఆ గ్యాసిప్ నిజమని బయటకు పొక్కితే, ఇదీ నిజమని ఫిక్సయిపోతుంది. అయినా పవన్ దీనికి ఏమీ జంకక్కరలేదు. ఆధారాలు దొరికినా బయటకు రావు. మహా అయితే ఓ ఎంపీ టికెట్ ఫ్రీగా ఇచ్చేయాల్సి వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.