ఇక మీడియా, సోషల్ మీడియాపై “వైరస్” ఎమర్జెన్సీ..!?

చేయడం చేత కానప్పుడు.. మన చేత కాని తనాన్ని నలుగురికి తెలియకుండా చేసుకోవడం.. రాజకీయ నేత లక్షణం. ప్రజాస్వామ్యంలో అది కొంచెం కష్టమే. కాకపోతే.. కాస్త నియంత లక్షణాలను పుణికిపుచ్చుకుంటే సాధ్యమే. ఇండియాలో కొన్నాళ్లుగా అదే సాగుతోంది. ప్రజలకు సమాచారం.. ఓ పద్దతిలో వెళ్లేలా చేసుకున్న వ్యవస్థను దారిలో తెచ్చుకున్నారు. ఫలితంగా.. జరుగుతోంది వేరు.. ప్రజలకు తెలుస్తోంది వేరు. కానీ.. దేశాన్ని కుదిపేస్తున్న కరోనా లాంటి మహమ్మారి విజృంభణ సమయాల్లో కళ్ల ముందే విషాదాలు కనిపిస్తున్న సమయంలో… అలాంటి డైవర్షన్ న్యూస్‌కు చాన్స్ లేకుండా పోయింది. ప్రతి ఒక్కరూ… తమ కళ్ల ముందు కనిపిస్తున్న దాన్ని … సోషల్ మీడియా ద్వారా ప్రపంచం ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పరిస్థితి మారిపోతోంది.

దేశంలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో.. ఇప్పుడు మరుమూల ఉన్న సగటు భారతీయుడికి కూడా అర్థం అవుతోంది. ముందు ముందు ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోంది. అదే జరిగితే.. దేశంలో పాలకుల వైఫల్యం మరింత బలంగా యాభై ఆరు అంగుళాల చాతితో ఉన్న కటౌట్ మాదిరిగి స్థిరంగా ఉంటుంది. అలా జరగకూడదంటే… పానడమిక్ ఆలోచనలు చేయాలి. అలా చేసి.. ఎవరూ నోరెత్తకుండా చేయాలి. ఎమీ ప్రచారం చేయకుండా ఉండాలి. నిజాలు బయటకు రాకూడదు. అందే ఆలోచన ఇప్పుడు కేంద్రం చేస్తోంది. తమ చేతకాని తనాన్ని వెల్లడించే ఏ వార్త అయినా ఫేక్ గా ప్రకటించేసి చర్యలు తీసుకోవాలన్న ఆలోచన చేస్తోంది. ఇందు కోసం ఎమర్జెన్సీ ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

కొద్ది రోజులుగా మోడీకి అనుకూలంగా ఉండని మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ…. కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై కథనాలు వస్తున్నాయి. ఇవి ప్రజలపై ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే హెల్త్ ఎమర్జెన్సీ విధించాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా చెబబుతున్నారు. హెల్త్ ఎమర్జెన్సీ విధిస్ే… ఆక్సిజన్‌ నుంచి ఔషధాల వరకు అన్నింటి ఉత్పత్తి, సరఫరా, వినియోగంపై పూర్తిస్థాయి నియంత్రణ సాధించే అవకాశముంది. అయితే అంతకు మించిన ప్రయోజనం.. కేంద్రం పొందే అవకాశం ఉంది. అదే మీడియాపై నియంత్రణ. కేంద్ర వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టగలిగేలా.. ఈ చట్టం వెసులుబాటు కల్పిస్తుంది.

ఫేక్ న్యూస్ ముద్ర వేసి వ్యతిరేకులైన వారిపై కేసులు పెట్టడం ప్రారంభిస్తే.. వ్యతిరేక ప్రచారం ఆగిపోతుదంని పాలకుల నిశ్చితాభిప్రాయం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రల్ని అమలు చేస్తున్నారు. ప్రజా గొంతుకల్ని అణిచివేయాలని చూస్తున్నారు. విపత్తు సమయంలో.. వైఫల్యాలు ఎంత ఎక్కువగా వెలుగులోకి తెస్తే.. ప్రజలకు అంత మేలు జరుగుతుంది. లేకపోతే పాలకులు.. ప్రజల్ని వారి పాపాన వారిని వదిలేస్తారు. తాము మాత్రం.. సింహాసనంపై దర్జాగా మహారాజుల్లా కూర్చుంటారు. దాని వల్ల ప్రజాస్వామ్యం అర్థం మారిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close