గో.పి అంటే విష్ణుకుమార్ రాజేనా..?

బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హఠాత్తుగా తన విధానాన్ని మార్చుకున్నారు. భారతీయ జనతా పార్టీలోని చిన్నాచితకా నేతల దగ్గర్నుంచి… ఢిల్లీలోని జీవీఎల్ నరసింహారావు వరకూ.. అందరూ…చంద్రబాబుపై కత్తులు నూరుతూంటే… విష్ణుకుమార్ రాజు మాత్రం ఆయనను సమర్థించడం ప్రారంభించారు.టీడీపీ అధినేతపై జీవీఎల్ నరసింహారావు చేస్తున్న వ్యాఖ్యలను విష్ణుకుమార్ రాజు తప్పు పట్టారు. అలా మాట్లాడటం సరికాదన్నారు. అంతేనా నీతిఆయోగ్ నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశంలో.. చంద్రబాబు ప్రధానమంత్రికి షేక్ హ్యాండ్ ఇవ్వడంపై పెద్ద దుమారం రేగింది. ఈ విషయంలో విష్ణుకుమార్ రాజు..చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. అంతే కాదు… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలపైనా ఘాటుగా స్పందించారు. ప్రధాన ప్రతిపక్షానికి పని లేక విమర్శలు చేస్తోందని విష్ణుకుమార్‌రాజు తేల్చేశారు. సీఎం ఇక్కడ పులి…ఢిల్లీలో పిల్లి అనే వ్యాఖ్యలు కూడా సరికాదని తేల్చేశారు. విపక్ష ఎమ్మెల్యేలుగా మేము కూడా సీఎం చంద్రబాబును కలుస్తున్నామని… చంద్రబాబు ప్రధానిని కలిస్తే తప్పేమిటని ఎదురు ప్రశ్నించారు.

సాక్షారభారత్ లో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించారని..వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసేందుకు విష్ణుకుమార్ రాజు.. సచివాలయానికి వచ్చారు. నిజానికి బీజేపీతో తెలుగుదేశం పార్టీ విడిపోయిన తర్వాత .. టీడీపీని, చంద్రబాబును.. విష్ణుకుమార్ రాజు తీవ్రంగా విమర్శించడం ప్రారంభించారు. పట్టిసీమ ప్రాజెక్ట్ పై సీబీఐ విచారణ కోరబోతున్నామని… అందులో అవినీతి జరిగిందని తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ తెలుగుదేశం పార్టీ గెలవబోదని గతంలో తీర్పు చెప్పేశారు కూడా. చంద్రబాబును విమర్శించడమే కాదు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌ను పొగడటానికి ఆయన ఎప్పుడూ వెనుకాడలేదు. కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత టీడీపీ నుంచి అనేక మంది నేతలు వైసీపీలో చేరతారని చెప్పుకొచ్చారు. ఓ సందర్భంలో ఆయన చేసిన ప్రకటనలు… విష్ణుకుమార్ రాజు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మారారేమో అన్నంతగా ఉండేవి.

పాదయాత్ర చేస్తూ జగన్ విశాఖకు వస్తే కలుస్తానని కూడా చెప్పారు. దాంతో విష్ణుకుమార్ రాజు వైసీపీలో చేరుతారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఆయన తన విధానాన్ని మార్చుకున్నారు. ముఖ్యమంత్రిపై సానుకూలంగా మాట్లాడుతున్నారు. విష్ణుకుమార్ రాజు వ్యవహరశైలి చూసిన వాళ్లు మాత్రం… రేపు మళ్లీ వైసీపీ అధినేతను పొగిడినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు. ప్రభుత్వంతో ఏమైనా పనులుంటే… సానుకూలంగా మాట్లాడి చేయించుకోవడం ఆ తర్వాత విమర్శించడం గత కొన్నాళ్లుగానే జరుగుతోందంటున్నారు. విష్ణుకుమార్ రాజు ట్రాక్ రికార్డు చూస్తే బీజేపీలో గో.పి. అనడం కరెక్టంటున్నారు…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close