ఆ “పరిటాల రవి” పాత్రధారి పరువు తీసుకున్నాడు..! మహిళలు క్షమిస్తారా..?

వ్యక్తిగత జీవితం ప్రతి ఒక్కరికి ఉంటుది. సెలబ్రిటీల విషయంలో అది హైలెట్ అవుతుంది. ప్రపంచ అందగత్తెగా ఉన్న ఐశ్వర్యారాయ్‌కి కూడా ఆ పర్సనల్ లైఫ్ ఉంది. సల్మాన్‌, వివేక్ ఓబెరాయ్‌లను మొదట ఆమె ప్రేమించింది. తర్వాత వారిద్దరూ సరిపడరని దూరం జరిగింది. సల్మాన్ … వ్యక్తిగతంగా ఎలా ఉన్నా.. బయట మాత్రం.. చాలా హుందాగా ఉంటారు. కానీ వివేక్ ఓబెరాయ్ మాత్రం.. ఐశ్వర్యను అత్యంత దారుణంగా కించపరుస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్‌తో ఐశ్వర్యరాయ్ వ్యక్తిగత జీవితాన్ని పోలుస్తూ…పెట్టిన ఓ పోస్ట్‌ను షేర్ చేసి.. తనది చాలా దిగువ మైండ్ సెట్ అని నిరూపించుకున్నారు.

మాజీ ప్రేయసిపై అభ్యంతరకమైన ట్వీట్..!

ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఐశ్వర్య, సల్మాన్ ఫొటోలపై ఒపీనియన్ పోల్ అని, ఐశ్వర్య-ఒబెరాయ్ లను ఉద్దేశించి ఎగ్జిట్ పోల్ అని, ఐశ్వర్య-అభిషేక్ వారి అమ్మాయి ఆరాధ్యను ఉద్దేశించి రిజల్ట్ అని రాశారు. ఐష్ ని అవమానించేలా ఉన్న ఈ పోస్ట్ ని ఫన్నీ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు వివేక్ ఒబెరాయ్. దాంతో మాజీ ప్రియురాలిపై ఇంత అక్కసు వెళ్లగక్కడం.. ఆమె వ్యక్తిగత జీవితాన్ని దారుణంగా అవమానింంచడంపై.. గగ్గోలు రేగింది. బాలీవుడ్‌లోని పలువురు సెలబ్రిటీలు… వివేక్ ఓబెరాయ్‌ చర్యను ఖండించారు. సిగ్గులేని చర్యగా అభివర్ణించారు. తక్షణం… ఆ పోస్ట్ ను డిలీట్ చేసి సారీ చెప్పాలని.. డిమాండ్ చేశారు. కానీ వివేక్ ఓబెరాయ్ మాత్రం.. తప్పేముందని సమర్థించుకున్నారు.

మోడీగా సినిమాలో నటించిన వివేక్..!

ప్రధాని మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన… పీఎం నరేంద్ర మోదీ సినిమాలో వివేక్‌ ఒబెరాయ్‌ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. మోదీ రాజకీయ జీవితం ఆరంభమైనప్పటి నుంచి 2014లో ఆయన ప్రధాని అయ్యే వరకూ.. అనేక అంశాలు, విశేషాలు సినిమాలో ఉంటాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందే సినిమా విడుదల కావాల్సి ఉన్నా… ఓటర్లను ప్రభావితం చేస్తుందన్న ప్రతిపక్షాలు ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్‌ సినిమా విడుదల వాయిదా వేసింది. 23న ఫలితాలు వచ్చిన తర్వాత…24న సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో వివేక్ ఓబెరాయ్ రాజకీయ పరమైన ప్రకటనలు చేస్తున్నారు. అందులో భాగంగా కమల్ పైనా కామెంట్లు చేశారు. ఇప్పుడు… ఐశ్వర్యారాయ్‌ని ఇందులోకి లాగారు.

వివేక్‌పై బాలీవుడ్ ఆగ్రహం..! ఆయినా సిగ్గుపడని నటుడు..!

వివేక్ ఓబెరాయ్ ట్వీట్ పై స్పందించిన మహారాష్ట్ర మహిళా కమిషన్…వివేక్ పై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేసింది. కొందరు నెటిజన్లు కూడా వివేక్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. మహిళలకు గౌరవం ఇవ్వాలని సూచించారు. పాత విషయాలను ఇలాంటి హీట్ టైంలో బయటకు తీసుకురావటం వెనక ఒబెరాయ్ కుట్ర ఉంది అని మండిపడుతున్నారు. ఇప్పుడు ఒబెరాయ్ ఒక్కరే చేశారు.. ఇది చూసి మిగిలిన వాళ్లు కూడా ఇతరుల ప్రేమ కథలు, పెళ్లి వార్తలను ఎగ్జిట్ పోల్స్ పోల్చుతూ ఫొటోలు పెడతారని.. ఇది మంచిది కాదని మండిపడ్డారు. మోదీపై, బీజేపీపై అభిమానం ఉంటే మరోలా చాటుకోవాలి కానీ… ఇలా చేస్తారా అంటూ మండిపడుతున్నారు. కానీ వివేక్ మాత్రం… తనకు మోడీ అండ ఉందని.. వివేకం లేకుండా వ్యవహరిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com