న్యాయం కోసం మరో దారి వెదుక్కుంటున్న వివేకా కుమార్తె..!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అంతా బహిరంగరహస్యమే కానీ.. ఎవరికీ తెలియనట్లుగా పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వాలు ప్రత్యేక దర్యాప్తు బృందాలు వేశాయి.. కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది..కానీ పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. అయితే.. తన తండ్రిని హత్య చేసిన వారిని ఎలాగైనా చట్టానికి పట్టించాలన్న లక్ష్యంతో ఉన్న ఆయన కుమార్తె వివేకా మాత్రం పట్టు వదలకుండా పోరాడుతున్నారు. సీబీఐ విచారణ కోసం కోర్టుకెళ్లి తీవ్రంగా పోరాటం చేసిన ఆమె చివరికి అనుకున్న ఫలితం సాధించారు. అయితే… సీబీఐ విచారణలోనూ న్యాయం జరుగుతుందో లేదో క్లారిటీ లేకుండా పోయింది. దీంతో ఆమె ఈ విషయంలో న్యాయం కోసం హక్కుల కార్యకర్తలను కలుస్తున్నారు.

కొద్ది రోజుల కిందట… సిస్టర్ అభయ పై రేప్, హత్య కేసులో తీర్పు వచ్చింది. దాదాపుగా పాతికేళ్ల తర్వాత నిందితులికి శిక్ష పడింది. ఈ కేసు విషయంలో మొదటి నుంచి పోరాడింది.. కేరళకు చెందిన జోమున్ అనే హక్కుల కార్యకర్త. సిస్టర్ అభయ కేసులో తీర్పు వచ్చిన తర్వాత ఈమె పేరు హైలెట్ అయింది. దీంతో ఆమె అయినా తనకు న్యాయం చేస్తుందేమోనన్న ఉద్దేశంతో..  ఆమె ఎక్కడ ఉంటుందో కనుక్కుని మరీ వైఎస్ సునీతా.. వెళ్లి కలిశారు. మూడు రోజుల కిందట.. ఢిల్లీలో జోమున్‌ను… వైఎస్ వివేకా కుమార్తె కలిసి.. తన తండ్రి హత్య …  న్యాయం జరగకపోవడం గురించి పూర్తిగా వివరించినట్లుగా చెబుతున్నారు.

ఈ అంశంపై పోరాడేందుకు జోమున్ కూడా సంసిద్ధత వ్యక్తం చేసిననట్లుగా తెలుస్తోంది. త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి…  వైఎస్ వివేకా హత్య అంశంపై స్పందిస్తానని జోమున్.. ఢిల్లీలోని తెలుగు మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. ఇలాంటి అంశాల్లో జోమున్ పట్టు విడవకుండా పోరాటం చేస్తారు. హైగా చనిపోయిన వివేకా కుమార్తెనే.. తన తండ్రిని చంపిన వారిని పట్టుకోవాలన్న లక్ష్యంతో పట్టు వదలకుండా ప్రయత్నిస్తూండటంతో  జోమున్ కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ అంశంలో ముందు ముందు ముందు కీలక పరిణామాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close