బాహుబ‌లికి ప్ర‌భుత్వం వారి హెచ్చ‌రిక‌

బాహుబ‌లి ఇప్పుడు `బ్లాక్‌` బ‌లి అయ్యింది. స్పెష‌ల్ షోల పేరుతో డ‌బ్బులు దండుకొంటున్నారు. టికెట్ ధ‌ర రూ.2 వేల నుంచి రూ.3 వేల వ‌ర‌కూ ఉంది. సింగిల్ స్క్రీన్‌ల‌లోనూ ఒక్కో టికెట్ నీ రూ.200ల‌కు అమ్మాల‌ని థియేట‌ర్ యాజ‌మాన్యాలు నిర్ణ‌యించుకొన్నాయి. ఈ విష‌యాల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం సీరియ‌స్ అయ్యింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ర్ట సినిమాటోగ్ర‌పీ మంత్రి విష‌యాన్ని సీరియ‌స్ గా తీసు కుని థియేట‌ర్ యాజ‌మాన్యాన్ని, బాహుబ‌లి టీమ్ ను హెచ్చరించారు.

`తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్ర‌పంచానికి తెలిసింది. బాహుబ‌లి చూసిన త‌ర్వాత చరిత్ర ఊహించ‌ని విధంగా ఓ క్రేజ్ వ‌చ్చింది. క‌మ‌ర్శియ‌ల్ గాను సినిమా పెద్ద స‌క్సెస్ అయింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎలక్ష‌న్ టైమ్ లో…అసెంబ్లీలో కూడా క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడ‌న్న దానిపై చ‌ర్చ సాగింది. హిస్టారిక‌ల్ సినిమా కావ‌డంతో బాహుబ‌లికి 5 షోలు అడిగారు. మేము కూడా అంగీక‌రించాం. బాహుబ‌లి లాంటి సినిమాకు ప్ర‌మోష‌న్ అవ‌స‌రం లేదు కానీ, ఇష్టాను సారంగా టిక్కెట్ ధ‌ర‌లు ఉన్నాయ‌ని టీవీల్లో వార్త‌లు వ‌స్తున్నాయి. అలాగే థియేట‌ర్ లో స్నాక్స్ ను ప్యాకేజ్ అంటూ 200, 300 దండేట‌ట్లు ప్లాన్ చేసిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఈ విష‌యంపై ప్రభుత్వం సీరియ‌స్ గా ఉంది. దీనిపై ఓ స‌మావేశం కూడా ఏర్పాటు చేశాం. గ‌వ‌ర్న‌మెంట్ ఫిక్స్ చేసిన రేట్ల‌కు టిక్కెట్లు అమ్మాలి లేక‌పోతే త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటాం. బాహుబ‌లి టీమ్ ప్ర‌మేయం లేకుండా థియేట‌ర్ల యాజ‌మాన్యం ఇష్టాను సారంగా వ్వ‌వ‌హ‌రిస్తున్నారు. దానికి మాత్రం బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. బెనిఫిట్ షోలు ఎక్క‌డా ఇవ్వ‌లేదు. బాహుబ‌లి సినిమా కోసం అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌ధ్య త‌గ‌ర‌తి కుటుంబాల‌కు టిక్కెట్ అందుబాటులో లేక‌పోతే మీరంతా చాలా స‌మ‌స్య‌లు ఫేస్ చేయాల్సి ఉంటుంద‌ని` హెచ్చ‌రించారు. సో.. బాహుబ‌లి 2 టికెట్ రేట్లు దిగిరాక త‌ప్ప‌వేమో ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close