వెల్‌డ‌న్ ఉపాస‌న‌

లెక్చ‌ర్లు దంచికొట్ట‌డం వేరు. చెప్పిన మాట‌ల్ని తు.చ త‌ప్ప‌కుండా ఆచ‌రించి, ఆద‌ర్శంగా నిల‌వ‌డం వేరు. ఈ విష‌యంలో ఉపాస‌న మాట‌ల మ‌నిషి కాదు, చేత‌ల మ‌నిషే అని నిరూపిత‌మైంది. ఉపాస‌న సేవా మార్గంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ‘మిస్ట‌ర్ సి – ఫ‌ర్ ఛేంజ్‌’ పేరుతో ఓ సంస్థ‌ని స్థాపించి కొన్ని సేవాకార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హిస్తోంది. అందులో భాగంగా ఓ వ్యాపారికి మ‌ట్టికుండ‌లు బ‌హుమ‌తిగా పంపి `ప్లాస్టిక్ వ‌స్తువుల్ని వాడొద్దు` అనే సందేశాన్ని ఇచ్చింది.

హైద‌రాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో ఉపాస‌న మార్నింగ్ వాక్ చేస్తుంటుంది. ఓ సంద‌ర్భంలో కేబీఆర్ పార్క్ స‌మీపంలో ఉన్న తోపుడు బండి ద‌గ్గ‌ర పుదీనా ర‌సం తాగి, ఆ ఫొటో ట్విట్ట‌ర్‌లో పెట్టింది. ఆ ఫొటో చూసి ‘బండి నిండా ప్లాస్టిక్ వ‌స్తువులే ఉన్నాయి’ అంటూ కొంత‌మంది అభిమానులు కామెంట్ చేశారు. అది గ‌మ‌నించిన ఉపాస‌న‌… ఆ తోపుడు బండి నిర్వాహ‌కుడికి కొన్ని మ‌ట్టి కుండ‌లు పంపించి – వాటితో పాటు ‘ప్లాస్టిక్ వ‌స్తువుల్ని వాడొద్దు’ అనే సందేశం అందించింది. ఈ రెండు ఫొటోలూ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఏదేమైనా ప్లాస్టిక్ వాడ‌కం త‌గ్గించ‌డానికి సెల‌బ్రెటీలు ఈ రూపంలో ముందుకు రావ‌డం సంతోషించ‌ద‌గిన ప‌రిణామ‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close