న‌య‌న‌తార ఇంట్లో ఏం జ‌రిగింది?

ఆమ‌ధ్య శ్రుతిహాస‌న్ ఇంట్లో ఓ అగంత‌కుడు దూరి.. హ‌ల్ చ‌ల్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌య‌మై.. శ్రుతి పోలీస్ స్టేష‌న్‌లో పిర్యాదు చేయ‌డం, పోలీసులు ఆ అగంత‌కుడ్ని ప‌ట్టుకోవ‌డం.. ఇవన్నీ గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు న‌య‌న‌తార‌కూ సేమ్ టూ సేమ్ అలాంటి అనుభ‌వ‌మే ఎదురైన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం న‌య‌న‌తార చెన్నైలోని కోయంబేడు అనే ప్రాంతంలో ఓ ఆపార్ట్‌మెంట్‌లో నివ‌సిస్తోంది. మొన్నోరోజు రాత్రి… న‌య‌న తార ఇంట్లో ఓ అగంత‌కుడు ప్ర‌వేశించి హ‌ల్ చ‌ల్ చేశాడ‌ని, ఈ ఘ‌ట‌న‌లో న‌య‌న‌తార కూడా స్వ‌ల్పంగా గాయ‌ప‌డిందని, ఇంత‌లో న‌య‌న స‌హాయ‌కులు ప్ర‌తిఘ‌టించ‌డంతో.. ఆ ఆగంత‌కుడు పారిపోయాడ‌ని తెలుస్తోంది.

అయితే ఈ విష‌య‌మై న‌య‌న ఇంత వ‌ర‌కూ ఎలాంటి ఫిర్యాదూ చేయ‌క‌పోవ‌డం విశేషం. ‘ఆ ఇంటికి వ‌చ్చింది న‌య‌న స్నేహితుడే. వాళ్లిద్ద‌రి మ‌ధ్య చిన్న‌పాటి ఘ‌ర్ష‌ణ జ‌రిగి ఉండొచ్చు’ అనే టాక్ వినిపిస్తోంది. అయితే న‌య‌న స‌న్నిహిత వ‌ర్గాలు మాత్రం ‘అలాంటిదేం లేదు.. ఇదంతా ఓ పుకారు’ అని కొట్టిపారేస్తున్నాయి. మ‌రి.. న‌య‌న ఇంట్లో ఏం జ‌రిగింది? ఆ ర‌హ‌స్యం ఏమిటి? అనే స‌స్పెన్స్ ఎప్పుడు వీడుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close