పవన్ సభ ఆంతర్యం ఇదా?

2009లో ప్రజారాజ్యం తరపున ప్రజల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఆవేశపరుడేమో కానీ 2014 నుంచి మాత్రం పవన్ కళ్యాణ్ కూడా రెగ్యులర్ రాజకీయ నాయకుడే. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, నరేంద్రమోడీలను కూడా ప్రశ్నించడానికి నేను రెడీగా ఉంటానన్నాడు. పోరాటాలకి సిద్ధమన్నాడు. 2014ఎన్నికలలో తను కానీ, తన పార్టీ తరపున కానీ ఎవ్వరూ కూడా ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పవన్‌కి తెలుసు. ఆ విషయం తెలిసే ప్రశ్నిస్తానన్నాడు. అదే పవన్ ఇప్పుడు ఏమంటున్నాడు? నేనేమైనా పదవిలో ఉన్నానా? నా దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారా…. ప్రశ్నించడానికి, పోరాటం చేయడానికి అని అమాయకంగా ఎదురు ప్రశ్నిస్తున్నాడు. 2014లో ప్రశ్నిస్తానన్నప్పుడు మీకు ఆ విషయం తెలియదా? అని ప్రశ్నించే అవకాశమివ్వడు పవన్. ఈ ఒక్క ఉదాహరణ చాలు పవన్ కళ్యాణ్ కూడా రెగ్యులర్ రాజకీయ నాయకుడయిపోయాడు అని చెప్పడానికి.

అందరూ రాజకీయాలే చేస్తున్నారు కాబట్టి పవన్ చేస్తే తప్పేంటి? అని అనుకుందాం. కానీ చాలా వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తున్నాననుకుంటున్న పవన్ కళ్యాణ్ ఓ విషయంలో మాత్రం చాలా పెద్ద తప్పు చేస్తున్నాడేమోననిపిస్తోంది. అదే సినిమా అభిమానులను రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నించడం. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా సీరియస్‌గానే వర్క్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాను కూడా తన రాజకీయ అవసరాల కోసం వాడేసుకున్నాడన్నది వాస్తవం. అందులో చాలా డైలాగులు పవన్ కళ్యాణ్ రాజకీయావసరాలను దృష్టిలో పెట్టుకుని రాయించుకున్నవే. అలాగే అ..ఆ..ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన పాండిత్యాన్నంతా ప్రదర్శిస్తూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి చివరగా పవన్‌కు తోడు నిలుస్తారా? అని అభిమానులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. త్రివిక్రమ్ లాంటి గొప్ప రచయిత ఏదో ఆవేశపడి అప్పటికప్పుడు చెప్పిన మాటల్లాగా అయితే అవి అస్సలు కనిపించలేదు. సో…పవన్ ఉద్ధేశ్యాలయితే క్లియర్‌గా అర్థమవుతున్నాయి.

రాజకీయాల్లోకి వచ్చిన సినిమా వాళ్ళందరూ ఇలాగే చేశారు కదా అనుకున్నా… ఒక విషయంలో మాత్రం చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నాడు పవన్. ఆ మధ్య గోదావరి జిల్లాలలో పవన్ ఫ్యాన్స్‌తో, ఇంకో హీరో ఫ్యాన్స్ గొడవపడినప్పుడు పవన్ రియాక్టయిన విధానం మాత్రం ఫ్యాన్స్‌ని ఇంకా రెచ్చగొట్టేలా ఉంది. పోలీసులు అరెస్ట్ చేసిన ప్యాన్స్‌కి బెయిల్ ఇప్పించడానికి, దెబ్బలు తగిలిన ఫ్యాన్స్‌కి హాస్పిటల్ ఖర్చులకు స్వయంగా డబ్బులు పంపించాడు పవన్.

అలాగే నిన్న వినోద్ ఫ్యామిలీని పరామర్శించడం వరకూ తప్పు పట్టడానికి లేదు. కానీ శనివారం రోజు బహిరంగా సభ నిర్వహించాలనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఇంతకుముందు కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ వచ్చినప్పుడు …నేను ఇప్పుడు అక్కడికి వెళితే అనవసరమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అందుకే వెళ్ళడం లేదు అని పవన్ చాలా సార్లు చెప్పాడు. కానీ రేపు వేలాదిమంది అభిమానులతో పవన్ కళ్యాణ్ నిర్వహించబోయే బహిరంగ సభతో తన అభిమానులందరికీ ఏం సందేశమిస్తున్నట్టు? స్టైజ్‌పైన మాట్లాడే మాటలు ఏమైనా ఉండొచ్చుగాక. అంతర్లీనంగా మాత్రం అభిమానులందరికీ ఓ సందేశం వెళుతుంది. మీ కోసం నేను ఉన్నాను అని. ఆలోమేటిక్‌గా పవన్ కోసం మేముంటాం అని అభిమానులు కూడా నినాదాలు చేస్తారు. వేరే హీరో అభిమానుల చేతిలో పవన్ అభిమాని చనిపోయాడన్న ఆవేదనలో ఉన్న పవన్ అభిమానులు రేపు ఎలాంటి నినాదాలు చేస్తారు? ఏ స్థాయిలో రెచ్చిపోతారు? ఎంత మందిని రెచ్చగొట్టేలా మాట్లాడతారు? ఇవన్నీ స్టేజ్ పైన ఉండే స్పీకర్లలో నుంచి వినిపించకపోవచ్చు. కానీ రేపటి సభతో అభిమానుల ఆవేదన ఆవేశంగా మారుతుందనడంలో సందేహం లేదు. అలాగే మనకు ఏమైనా కూడా చూసుకోవడానికి పవన్ ఉన్నాడన్న ఓ గట్టి నమ్మకం కూడా అభిమానుల్లో బలపడుతుంది. పవన్ కోసం ఏం చేయడానికైనా వాళ్ళు రెడీ అయిపోతారు.

మొదటి నుంచీ రాజకీయ పార్టీల అభిమానులైతే మరీ అంత ఎమోషనల్‌గా ఉండరు. విమర్శలు, ప్రతి విమర్శలు కామన్ అని అనుకుంటారు. ఎందుకంటే రాజకీయ నాయకులెవ్వరైనా సరే విమర్శలకు అతీతులు కారు కాబట్టి. కానీ సినిమా హీరోల విషయం అలా కాదు. సినిమా స్టార్స్‌గా ఉన్నంత కాలం… వాళ్ళు విమర్శలకు అతీతులే. సినిమా వాళ్ళెవ్వరూ కూడా అంతర్గతంగా ఎన్ని విభేదాలున్నా, ఎన్ని గొడవలున్నా బహిరంగంగా స్టార్ హీరోస్‌ని, అది కూడా టాప్ రేంజ్‌లో ఉన్నవాళ్ళను విమర్శించే ధైర్యం చేయరు. సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న యాడ్స్ రెవిన్యూ అయితేనేమి, సినిమా వాళ్ళను పొగిడితేనే సర్క్యులేషన్, వ్యూయర్స్ పెరుగుతారన్న ఉద్ధేశ్యం అయితేనేమి మీడియా కూడా స్టార్ హీరోస్‌ని విమర్శించే సాహసం పెద్దగా చేయదు. పవన్ కళ్యాణ్ పైన ఎంత కోపం ఉన్నప్పటికీ సాక్షి సినిమా పేజీలో మాత్రం ఆయనను విమర్శిస్తూ వార్తలు రాయరు. పైగా సినిమా స్టార్స్‌ని చుట్టూ ఉన్న వాళ్ళు, మీడియా కూడా మామూలుగా పొగడదు. పరోక్షంగా దేవుడు అనే అర్థం వచ్చేలాగే పొగుడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే రాజకీయ నాయకుడిగా ఎంట్రీ ఇస్తారో అప్పటి నుంచి విమర్శల డోస్ మామూలుగా ఉండదు. ఇక్కడే హార్డ్ కోర్ అభిమానులు అస్సలు తట్టుకోలేరు. ప్రతి విమర్శలకు రెడీ అయిపోతారు. విమర్శించిన వాళ్ళందరితోనూ గొడవలకు దిగుతారు. ప్రస్తుతం తెలుగులో ఉన్న హీరోలందరికంటే కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనబడేవాళ్ళు పవన్‌కే ఎక్కువ మంది ఉంటారని సినిమా విశ్లేషకులు చెప్తూ ఉంటారు. పవన్ ఇస్తున్న సపోర్ట్‌తో లక్షలాది మంది ఉన్న అలాంటి అభిమానులు పవన్‌ని విమర్శించినవాళ్ళందరిపైనా హార్ష్‌గా రియాక్టవుతూ ఉంటే ఆ తర్వాత పరిణామాలకు బాధ్యులెవరు? ఈ విషయం గురించి అయితే పవన్ కళ్యాణ్ చాలా సీరియస్‌గా ఆలోచించాలి. లేకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలకు పవనే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close