విజ‌య్ పాడిన‌ పాట అలానే ఉంది…

గీత గోవిందం కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ గాయ‌కుడిగా అవ‌తారం ఎత్తాడు. విజ‌య్ పాట పాడ‌డం.. ఈ సినిమాకి ఓ కొత్త క్రేజ్ తీసుకొస్తుంద‌నుకున్నారు. కానీ ఆ ప్ర‌య‌త్నం అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. దీనిపై చాలా సెటైర్లు మొద‌ల‌య్యాయి. సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ జ‌రిగింది. దీన్ని విజ‌య్ కూడా గుర్తించాడు. ఆడియో వేడుక‌లో…తన త‌ప్పు ఒప్పుకున్నాడు. `మీలో ఎవ‌రైనా ఈ పాట పాడించి పంపండి. బాగుంటే.. గాయ‌కుడిగా ఛాన్స్ ఇస్తాం. నా పాట బదులుగా ఆ ఆపాటే సినిమాలో వినిపిస్తాం` అన్నాడు. మ‌రి ఇప్పుడు విజ‌య్ పాట ఉంచారా, తీసేశారా? అనేది అస‌లు ప్ర‌శ్న‌. ఎందుకంటే రేపే (బుధ‌వారం) గీతా గోవిందం సినిమా విడుద‌ల అవుతుంది. మ‌రి ఆ పాట మాటేంటి?

దీనిపై క్లారిటీ దొరికేసింది. విజ‌య్ కి బ‌దులుగా ఓ ప్రొఫెష‌న‌ల్ గాయ‌కుడితో ఈ పాట పాడించారు. అయితే విజ‌య్ పాట కూడా అలానే ఉంది. ఓవ‌ర్సీస్ ప్రింట్స్‌లో మాత్రం విజ‌య్ పాట వినిపిస్తుంది. ఇండియాలో ఆ పాట మ‌రొక గొంతులో వినిపిస్తుంది. విజ‌య్ ఫ్యాన్స్ చాలామంది వాట్ ద ఎఫ్ పాట‌ని పాడి పంపారట‌. వాటిలో విజ‌య్‌కి రెండు గొంతులు బాగా న‌చ్చాయ‌ట‌. కానీ… సినిమా స్థాయికి త‌గ్గట్టుగా ఆ పాట‌లు లేక‌పోవ‌డంతో.. ప్రొఫెష‌న‌ల్ గాయ‌కుడితోనే ఆ పాట పాడించేశారు. ఓవ‌ర్సీస్ ప్రింట్లు త్వ‌ర‌గా వెళ్లిపోతాయి కాబ‌ట్టి.. విజ‌య్ పాడిన పాట‌ని మార్చే ఛాన్స్ రాలేద‌ని తెలుస్తోంది. సో.. ఓవ‌ర్సీస్‌లో విజ‌య్ గొంతుతో వినిపించిన పాట‌, ఇక్క‌డ మ‌రొక‌రి గొంతు నుంచి వినిపిస్తుంద‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close