చైతన్య : లోక్‌సభలో ఓ వర్గం ఎంపీల ర్యాగింగ్ దేశానికి ఏ సందేశం ఇస్తోంది..?

” నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో నిర్వహిస్తానని.. భయంగానీ, పక్షపాతంగానీ, రాగద్వేషాలుగానీ లేకుండా.. రాజ్యాంగాన్నీ, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను..” ఇదీ రాజ్యాంగం ప్రకారం.. ఏ ప్రజాప్రతినిధి అయినా చేస్ ప్రమాణంలో ఓ భాగం. దేశ ప్రజల పట్ల కానీ.. సాటి సభ్యుల పట్ల కాని … కులం, మతం… పేరుతో వివక్ష చూపితే.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే. సాక్షాత్తూ లోక్‌సభలో అదే జరిగితే.. అదీ కూడా ఓ ర్యాగింగ్‌లా జరిగితే.. ఇక రాజ్యాంగానికి రక్షణ ఎక్కడుంది.

ముస్లిం ఎంపీలు ప్రమాణం చేసేటప్పుడు ఆ నినాదాలేంటి..?

ఓ వ్యక్తి మతాన్ని బట్టి కించపరచడాన్ని ఎవరూ హర్షించరు. నేరుగా పార్లమెంట్‌లోనే అది జరిగింది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మంగళవారం పార్లమెంట్‌ సభ్యుడిగా ప్రమాణం చేయడానికి వెళుతుంటే బీజేపీ ఎంపీలు జై శ్రీరామ్” ” భారత్‌ మాతా కీ జై” ” వందేమాతరం” అంటూ నినాదాలు చేశారు. అది ఆయన మతాన్ని గుర్తు చేయడమే. ఒవైసీ ఒక్కరి పట్లనే బీజేపీ ఎంపీలు అనుచితంగా ప్రవర్తించలేదు. ప్రతిపక్ష సభ్యుల అందరి విషయంలో వారు అలాగే వ్యవహరించారు. సమాజ్‌వాది పార్టీకి చెందిన ఎంపీ షఫీకర్‌ రహమాన్‌ బార్క్‌ ప్రమాణ స్వీకారానికి వెళుతున్నప్పుడు కూడా బీజేపీ ఎంపీలు “జై శ్రీరామ్‌” అంటూ నినాదాలు చేశారు. అందుకు ఆయన ప్రతిగా “కానిస్టిట్యూషన్‌ జిందాబాద్‌” అంటూ నినదించారు. అదే పార్టీకి చెందిన హెచ్‌టీ హాసన్‌కు అదే అనుభవం ఎదురయింది. ఆయన “హిందుస్థాన్‌ జిందాబాద్‌” అనే ప్రతి నినాదాలు చేశారు.

మతం మాత్రమే కాదు ప్రాంతాలనూ కించపరిచారు..!

పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్‌ ఎంపీలు, తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీలు ప్రమాణం చేసినప్పుడు బీజేపీ ఎంపీలు అనుచితంగా వ్యవహరించారు. కాంగ్రెస్‌ ఎంపీ సోనియా గాంధీ ప్రమాణం చేసిన తర్వాత హిందీలో ప్రమాణం చేసినందుకు ఆమెకు కతజ్ఞతలు తెలిపారు. ఆమెది ఇటలీ అని… హేళన చేయడమే ఆ కృతజ్ఞతల లక్ష్యం. తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే ఎంపీలు… ప్రమాణం చేస్తున్న వారిని ఎగతాళి చేయాల్సిన అవసరం ఏముంది..?., మతం ప్రాతిపదికగా.. ఇప్పుడు ఓ వర్గాన్ని.. ద్వితీయశ్రేణి పౌరులుగా చూసే పరిస్థితి వస్తోంది. దాని వల్ల భవిష్యత్ లో జరగబోయే దుష్పరిణామాలను మనం అంచనా వేయలేం.

దేశం అంటే మట్టి కాదు.. దేశం అంటే మనుషులు..!

భారతీయ జనతా పార్టీ నేతలు.. జాతీయత గురించి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. మైనార్టీల మీదకు మెజార్టీని ఉసిగొల్పి విజయం సాధించారు. ఆ విజయం వల్ల.. వారికి.. విజయం దక్కిందేమో కానీ… దేశానికి మాత్రమే అపజయం ఎదురవుతోంది. భారతీయుడుగా పట్టి.. భారతీయుడగా చనిపోయేవాడు.. ఓ ముస్లిం అయినంత మాత్రాన.. అతను దేశభక్తులు కాదన్నట్లుగా.. ఈ దేశ పౌరుడు కాదన్నట్లుగా వ్యవహారించడం.. దేశానికి మంచిది కాదు. దేశం అంటే మట్టి కాదు.. దేశం అంటే మనుషులని తెలుసుకోలేని స్థితికి బీజేపీ సభ్యులు వెళ్లిపోవడం.. భవిష్యత్ ఎంత భయానకంగా ఉండబోతోందో అర్థమవుతోంది. 543 లోక్‌సభ స్థానాలకు 303 స్థానాలు గెలుచుకోవడంతో ఏం చేసినా చెల్లుబాటవుతుందని బీజేపీ నేతలు అనుకుంటున్నారు. పార్లమెంట్ గౌరవించకపోతే.. దేశ ప్రజలను గౌరవించకపోతే.. ఆ గెలుపు.. గెలుపు కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...
video

ట్రైల‌ర్ టాక్‌: ఫ్యామిలీమెన్ టూ మెంట‌ల్ మెన్‌

https://www.youtube.com/watch?v=xB7b3RzicUU విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే ఎగ్రెసివ్‌నెస్ గుర్తొస్తుంది. అర్జున్ రెడ్డి నుంచి అది అల‌వాటైపోయింది. అయితే... త‌న‌లో కూల్ & కామ్ పెర్‌ఫార్మ‌ర్ ఉన్నాడు. దాన్ని బ‌య‌ట‌కు లాగే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ప‌ర‌శురామ్. 'ఫ్యామిలీస్టార్‌'...

HOT NEWS

css.php
[X] Close
[X] Close