విరాట‌ప‌ర్వం.. విముక్తి ఎప్పుడు?

రానా క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం `విరాట ప‌ర్వం`. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. 2021లో ఈ సినిమా విడుద‌ల కావ‌డం దాదాపుగా అసాధ్యం. మ‌రి ఈ సినిమా విడుద‌ల ఎప్పుడు? నిజంగానే థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందా? లేదంటే ఓటీటీకి ప‌రిమిత‌మ‌వుతుందా? ఇలా అనేక సందేహాలు ఉన్నాయి.

ఈ సినిమాని ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటీటీలో విడుద‌ల చేయ‌మ‌ని చిత్ర‌బృందం ప‌దే ప‌దే చెబుతోంది. కానీ నిర్మాత సురేష్ బాబు ని న‌మ్మ‌డానికి వీల్లేదు. ఆయ‌న నార‌ప్ప‌, దృశ్యం 2ల‌ను ఓటీటీకే ఇచ్చేశారు. థియేట‌ర్లో కంటే, ఓటీటీకి ఇవ్వ‌డంలోనే లాభ‌సాటి బేరం ఉంద‌నుకుంటే, ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఓటీటీలోనే విడుద‌ల చేస్తారు. కానీ ఇప్పటికైతే… విరాట‌ప‌ర్వం థియేట‌ర్ల‌లోనే వ‌స్తుంది. కానీ ఇప్పుడు కాదు. భీమ్లా నాయ‌క్ విడుద‌లైన త‌ర‌వాత‌.

భీమ్లా నాయ‌క్‌లో రానా ఓ కీల‌క‌మైన పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. ఓర‌కంగా ఇది మ‌ల్టీస్టార‌రే అయినా, కేవ‌లం ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ల్ల‌.. ఇది ప‌వ‌న్ సినిమాగా చ‌లామ‌ణీ అవుతోంది.కానీ తెర‌పై రానా పాత్ర కూడా ప‌వ‌ర్ ఫుల్ గా నే ఉండ‌బోతోంది. భీమ్లా నాయక్ గ‌నుక భారీ విజ‌యాన్ని సాధిస్తే ఆ ఇంపాక్ట్ విరాట ప‌ర్వంపై ప‌డుతుంది. భీమ్లాతో… విరాట‌ప‌ర్వం మ‌రింత లాభ‌ప‌డుతుంది. అందుకే భీమ్లా నాయ‌క్ విడుద‌లైన త‌ర‌వాతే విరాట‌ప‌ర్వం ప‌నులు మొద‌లెట్టాల‌ని సురేష్ బాబు భావిస్తున్నార్ట‌. ఈ లోగా క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్ గ‌నుక వ‌స్తే.. ఓటీటీ కోసం అప్పుడు ఆలోచిద్దాం అనే ఫీలింగ్ లోఉన్నారు సురేష్ బాబు. అంటే.. జ‌న‌వ‌రి 12 త‌ర‌వాతే.. విరాట ప‌ర్వం గురించి ఆలోచించాలన్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close