ఎపి బిజెపి బాహుబలి ఎవరు శివాజీ?

బాహుబలి వస్తాడని కొంతకాలం కిందట టి కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ నాయకుడు జానారెడ్డి చేసిన చర్చ చాలా ఆసక్తి కలిగించింది. టిటిడిపి నేత రేవంత్‌ రెడ్డి వంటివారైతే ఆ బాహుబలి హరీష్‌రావే అన్నంత వరకూ వ్యాఖ్యానించారు. తమాషాగా ఇప్పుడు ఎపి బిజెపికి సంబంధించి అలాటి వ్యాఖ్య వినిపిస్తున్నది. కొంతకాలం బిజెపిలోవుండి ప్రత్యేక హౌదాపై పోరాడుతున్న హీరో శివాజీ ఆ పార్టీలోకి ఎవరో ప్రముఖ వ్యక్తి వస్తారనీ, అప్పుడు ప్రత్యేక హౌదా ఇస్తారని అంటున్నారు. ఒక వెబ్‌ ఛానల్‌ కోసం నేను చేసిన ఇంటర్వ్యూలో శివాజీ ఒకటికి రెండు సార్లు ఈ మాటన్నారు. ఆ వచ్చేది ఎవరంటే మాత్రం పేరు చెప్పడానికి సిద్ధపడలేదు. తనకు తెలియదంటున్నారు. . ఎవరో రావడం మాత్రం వస్తారు, బిజెపి వ్యూహం మారుతుంది అన్నది శివాజీ మాట. ఆ వ్యక్తి పవన్‌కళ్యాణ్‌ వల్లనే ప్రత్యేక హౌదా వస్తుందని మరో మాట అన్నారు. కాని ఆయన పాత్ర గురించి తనకు కొంత గందరగోళం వుందని కూడా స్పష్టం చేశారు. ఇది తన గందరగోళమే గాని ఆయనది కాకపోవచ్చని కూడా వివరించారు. ఏది ఏమైనా బిజెపి ప్రత్యేక హౌదాకు సంబంధించి అలాటి ఒక కసరత్తు ఒక ప్రముఖ వ్యక్తితో కలసి చేస్తున్నదని తనకు తెలిసిందని మాత్రం చెబుతున్నారు. మొత్తంపైన బిజెపి టిడిపి జనసేనల మధ్య త్రికోణ రాజకీయాన్ని శివాజీ వ్యాఖ్యలు మరింత రక్తికట్టిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close