హరీష్ రావును ఇరికిస్తున్న జగ్గారెడ్డి..! వెనక ఎవరున్నారు..?

హరీష్ రావు టార్గెట్ గా తెలంగాణలో రాజకీయం ఊపందుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచి.. టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి.. కాంగ్రెస్ కు దూరంగా… ఉంటూ… కేసీఆర్ ను అదే పనిగా పొగుడుతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హరీష్ రావును టార్గెట్ చేశారు. ప్రతీ విషయంలో.. ఆయననే నిందిస్తూ వస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యవహారాలు మొత్తం.. హరీష్ రావే..నిన్నామొన్నటి దాకా చూసుకున్నారు. ఆ పరిణామంతో… హరీష్ ను కార్నర్ చేయడానికి జగ్గారెడ్డి చేయాల్సినదంతా చేస్తున్నారు. ప్రస్తుతం.. సంగారెడ్డిలో తీవ్ర కటకట ఏర్పడింది. సింగూరు జలాశయం నుంచి… నీటిని ఎస్సారెస్పీకి తరలించడం.. ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో.. ఈ పరిస్థితి ఏర్పడింది. సింగూరు నుంచి ఎస్సారెస్పీకి తరలించడానికి.. ఎలాంటి.. కేటాయింపులు లేవు. అయినప్పటికీ… తెలంగాణ ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలతో తరలించేశారు.

ఇప్పుడు… ఈ పరిస్థితి.. అక్కడి ప్రజలు, రైతుల్లో ఆగ్రహానికి కారణం అవుతోంది. ఈ మొత్తానికి కారణం… హరీష్ రావేనంటూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి… కొత్త వాదన ప్రారంభించారు. సింగూరు నీటిని దోపిడీ చేసి సంగారెడ్డి ప్రజల గొంతులు ఎండబెట్టారని… కేటాయింపులు లేకున్నా శ్రీరాంసాగర్‌కు నీటిని తరలించారని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుడనే అధికారులు కూడా అడ్డు చెప్పలేదన్నారు. నీటి తరలింపు విషయం కేసీఆర్‌కు తెలిస్తే ఆయన ఒప్పుకునే వారు కాదని.. జగ్గారెడ్డి కేసీఆర్ ను వెనకేసుకు వచ్చారు. కేసీఆర్‌కు చెడ్డపేరు తెచ్చే ఈ నిర్ణయం వెనుక.. హరీష్ రాజకీయ కోణం ఉందనే అనుమానం ఉందని.. చెప్పి … హరీష్ పై పెద్ద బాంబు వేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ అడుగుతాననే హరీష్ నన్ను ఓడించాలని చూశారని జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. హరీష్‌రావు సంగారెడ్డి జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్ లో ఇప్పుడు హరీష్ టార్గెట్ గా రాజకీయం నడుస్తోందనే విషయం దాదాపుగా అందరికీ తెలుసు. జగ్గారెడ్డి.. కొంత కాలం నుంచి కేసీఆర్ కు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో తన అరెస్ట్ వెనుక కూడా హరీష్ ఉన్నారనే చెబుతున్నారు. కానీ.. ఎన్నికల సమయంలో.. బెయిల్ పై విడుదలైన తర్వాత.. ఆయన కేసీఆర్ పైనే తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు అంతా హరీషే చేశారంటున్నారు. మొత్తంగా జగ్గారెడ్డి.. టీఆర్ఎస్ లో జరుగుతున్న రాజకీయాలను తనకు అనుకూలంగా మలుచుకుని… కేసీఆర్ ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు. లేకపోతే.. ఆయన మాటల వెనుక టీఆర్ఎస్ వ్యూహం ఉన్నా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. మొత్తానికి ఏదైనా కానీ.. అంతిమంగా టార్గెట్ హరీష్ రావే అన్నట్లుగా ఉంది పరిస్ధితి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close