ఎన్టీఆర్ ఐటెమ్ గాళ్ ఎవ‌రు?

ఈరోజుల్లో క‌మ‌ర్షియ‌ల్ గీతం కంపల్స‌రీ. చిన్న‌సినిమా అయినా, పెద్ద హీరో సినిమా అయినా ఏదోలా ఐటెమ్ గీతాన్ని ఇరికించాల్సిందే. అందులోనా స్టార్ హీరో ఉన్నాడంటే.. ఇక ప్ర‌త్యేక హంగామా క‌నిపించాల్సిందే. త‌న తొలి సినిమా మిర్చితోనే ఐటెమ్ ఘాటు చూపించారు కొర‌టాల శివ‌. శ్రీంతుడులో ఆ అవ‌కాశం రాలేదు. అయినా స‌రే… పూర్ణ‌ని తీసుకొచ్చి ‘రామ రామ రామ రామ‌’ పాట‌కు కాస్త స్పెష‌ల్ సాంగ్ క‌ల‌రింగు ఇచ్చారు. ఇప్పుడు జ‌న‌తా గ్యారేజీలో మాత్రం.. ఐటెమ్ సాంగ్‌కి ప‌ర్‌ఫెక్ట్ సెట్యువేష‌న్ దొరికింద‌ట‌.

ఎన్టీఆర్ సినిమా, దానికితోడు దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌… అలాంట‌ప్పుడు ప్ర‌త్యేక గీతం లేక‌పోతే బాగుంటుందా? అందుకే కొర‌టాల ఓ భారీ ఐటెమ్ సాంగ్‌కి సెట్యువేష‌న్ క్రియేట్ చేశారు. అయితే ఈ పాట‌లో ఏ క‌థానాయిక క‌నిపిస్తే బాగుంటుందా? అని చిత్ర‌బృందం త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతోంది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు తెలిసిన క‌థానాయిక ఉంటే.. ఐటెమ్ గీతం పేలుద్ద‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాడు కొర‌టాల‌. నాన్న‌కు ప్రేమ‌తో సినిమాలో ఐటెమ్ పాట‌కు అవ‌కాశం రాలేదు. ఈసారైనా త‌న అభిమానుల్ని ప్ర‌త్యేక గీతంతో అల‌రిద్దామ‌ని ఎన్టీఆర్ కూడా ఫిక్స‌య్యాడ‌ట‌. ఐటెమ్ భామ కోసం ప్ర‌స్తుతం కొంత‌మంది పేర్లు ప‌రిశీలిస్తున్నాడు ఎన్టీఆర్‌. ఆ జాబితాలో త‌మ‌న్నా పేరు ముందు వ‌రుస‌లో ఉంద‌ట‌. ఒక‌వేళ త‌మ‌న్నా సెట్ కాక‌పోతే… అంజ‌లి అయినా ట్రై చేద్దామ‌న్న ఆలోచ‌న‌లో ఉంది చిత్ర‌బృందం. స‌రైనోడు సినిమాలో అంజ‌లి ఓ ప్ర‌త్యేక గీతంలో క‌నిపించ‌నుంది. ఆ పాట గ‌నుక క్లిక్క‌యితే.. ఎన్టీఆర్‌తో అంజ‌లి చిందేయ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close