మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో ఎవరిది తప్పు?

జీవో:123పై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే మంజూరు చేయడంతో తెరాస మంత్రులలో మళ్ళీ ఉత్సాహం వచ్చినట్లుంది. ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయడం మొదలుపెట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, “ఆ జీవో ని హైకోర్టు సింగిల్ జడ్జ్ కోర్టు కొట్టివేసినప్పుడు ప్రతిపక్షాలు స్వీట్లు పంచుకొని పండగ చేసుకొన్నాయి. ఇప్పుడు ఆ జీవోపై హైకోర్టు స్టే విదించింది. ప్రతిపక్షాల నేతలు ఇప్పుడేమి చెప్తారు? ప్రతీ అంశంపై రాజకీయాలు చేయాలని చూస్తే ఇలాగే అవుతుంది. ఇప్పటికైనా అవి తమ తీరు మార్చుకోవాలి,” అని అన్నారు.

మంత్రి హరీష్ రావు కూడా అదేవిధంగా మాట్లాడినప్పటికీ, ప్రతిపక్షాలని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే విధంగా మాట్లాడారు. “అక్కడ ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణా ప్రాజెక్టులకి అడ్డుపడుతుంటాడు. ట్రిబ్యునల్స్ కి లేఖలు వ్రాస్తుంటాడు. సుప్రీంకోర్టులో కేసులు వేయిస్తుంటాడు. మనం ప్రాజెక్టులు కట్టుకోకుండా ఏదో విధంగా అడ్డుకోవాలని చూస్తుంటాడు. ఇక్కడ మన వాళ్ళే మన ప్రాజెక్టులకి అడ్డుపడుతుంటారు. ధర్నాలు, ర్యాలీలు చేస్తుంటారు. హైకోర్టులో కేసులు వేస్తుంటారు. 60 ఏళ్లుగా సాగునీరు లేక బీడుబారిన మన తెలంగాణా భూములకి నీళ్ళు పారించి రైతులకి మేలు చేద్దామని మేము ప్రయత్నిస్తుంటే తెలంగాణా వాళ్ళయి ఉండి మనోళ్ళే ప్రాజెక్టులకి అడ్డుపడుతున్నారు. ఈ ప్రాజెక్టులు కట్టి పంటలకి నీళ్ళు అందించి రైతులకి మేలు చేయాలని మేము ప్రయత్నిస్తుంటే వాటిని అడ్డుకోవడం కాంగ్రెస్, తెదేపా నేతలకి భావ్యమేనా ఆలోచించుకోమని కోరుతున్నాను. దీని వలన మా ప్రభుత్వానికి ఏదో మంచి పేరు వచ్చేస్తుందనే భయంతో వారు ప్రాజెక్టులని అడ్డుకోవడం సరికాదు. మీకు కోపం ఉంటే మమల్ని తిట్టండి కానీ తెలంగాణాకి మేలు చేసే మా ప్రయత్నాలకి అడ్డుపడకండి. ఆవిధంగా చేస్తే ప్రజలు కూడా మిమ్మల్ని క్షమించరు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ వైఖరి మార్చుకొని ప్రభుత్వానికి సహకరించండి. అందరం కలిసి బంగారి తెలంగాణా నిర్మించుకొందాము,” అని హరీష్ రావు అన్నారు.

నిజానికి మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూసేకరణ మొదలుపెట్టినప్పుడు మొదట ముంపు ప్రాంతాల గ్రామాల ప్రజలే తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పుడే ప్రతిపక్షాలు రంగంలోకి దిగి జీవో:123ని వ్యతిరేకిస్తూ భూసేకరణ చట్టం ప్రకారమే భూమిని సేకరించాలని పట్టుబట్టాయి. అంటే ప్రతిపక్షాలు భూసేకరణ చేసే విధానం మార్చుకోమని కోరాయి తప్ప అసలు వద్దని చెప్పలేదు. రిజర్వాయర్ నిర్మించకుండానే హర్యానా ఎత్తిపోతల పద్దతిలో పంటలకి ఏవిధంగా నీళ్ళు అందించవచ్చో కాంగ్రెస్ నేతలు ప్రభుత్వానికి సూచించారు. కానీ వారి అభిప్రాయలు, సూచనలు ఏవీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్ళింది. నిర్వాసితులని కలవడానికి బయలుదేరిన ప్రతిపక్ష నేతలని పోలీసులని పెట్టి అడ్డుకొంది. దానితో అక్కడ ఏదో గూడుపుఠాని జరుగుతోందనే అభిప్రాయం ప్రభుత్వమే కల్పించింది. చివరికి హైకోర్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేయడంతో ముంపు గ్రామాలలో రైతు కూలీలకి, ఇతరులకి న్యాయం చేసే విధంగా మరో జీవో జారీ చేయడానికి అంగీకరించింది. అంటే హైకోర్టు జోక్యం చేసుకొన్న తరువాతే తెలంగాణా ప్రభుత్వం తన లోపాన్ని సవరించుకొందని స్పష్టం అవుతోంది. కానీ ఆవిషయాన్ని దాచిపెట్టి హైకోర్టు తమకి అనుకూలంగా ఇచ్చిన తీర్పు గురించి మాత్రమే తెరాస నేతలు గట్టిగా చెప్పుకొంటూ, ప్రతిపక్షాలని ప్రజల ముందు దోషులుగా నిలబట్టే ప్రయత్నాలు చేయడం వారి రాజకీయ చతురతకి మంచి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ అంశంపై ప్రతిపక్షాలు రాజకీయ మైలేజ్ కోసం ప్రయత్నిస్తే, ప్రభుత్వం పంతానికి పోయింది. చివరికి ఇరు పక్షాలు తప్పు చేశాయని హైకోర్టు తీర్పులు తేల్చి చెప్పాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close