సుభాష్ : ఇదో “దృశ్యం” టైప్ మిస్టరీ..! “ప్రజారాజ్యాన్ని” ఎవరు హత్య చేశారు..?

“ప్రజారాజ్యం పార్టీని కొంత మంది కుట్ర పూరితంగా కాంగ్రెస్‌లో విలీనం చేశారు. వారినెవర్నీ మర్చిపోను. దెబ్బకు దెబ్బతీస్తా..” .. ఇదీ కొన్నాళ్ల కిందట పవన్ కల్యాణ్ చెప్పినమాట. అఫ్‌కోర్స్.. ఇప్పుడూ అదే చెబుతారనుకోండి..!

“ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం వెనుక చిరంజీవి పాత్ర లేదు. కొంత మంది కుట్ర ఉంది..” ఇది మరో మెగా బ్రదర్ నాగేంద్రబాబు తాజాగా.. యూట్యూబ్ చానళ్లకు ఇస్తున్న ఇంటర్యూల్లో చెబుతున్నమాట.

ఇద్దరూ ఒకటే చెబుతున్నారు. రేపు చిరంజీవి కూడా.. మీడియా ముందుకు వచ్చి.. రాజకీయంగా అవసరం అయితే అదే చెప్పొచ్చు.

అంటే.. ప్రజారాజ్యాన్ని హత్య చేశారు.. అంటే కాంగ్రెస్ లో విలీనం చేయడం అన్నది నిజం. దాన్ని ఎవరు చేశారో.. అలా చేయడం వల్ల ఎవరు ప్రయోజనం పొందారో.. అంతా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అయినా.. ఇప్పుడెందుకు కొత్త వాదన తెరపైకి వస్తోంది..?

“దృశ్యం” ఫార్ములాతో సరికొత్త రాజకీయమా..?

“ఎవరూ మన ఇంటికి రాలేదు. మనం ఎవర్నీ చూడలేదు. మనం ఎవర్నీ చంపలేదు. మనం అంతా మర్చిపోయాం..” అని దృశ్యం సినిమాలో వెంకటేష్.. తన ఫ్యామలీని మొత్తం కూర్చోబెట్టి చెబుతారు. అచ్చంగా వెంకటేష్ చెప్పినట్లే.. ఆ కుటుంబం మొత్తం .. ఎన్ని కష్టాలు.. ఎదురైనా.. ఎన్ని అనుమానాలు ఎదురైనా… అదే మాటకు కట్టుబడి ఉంటారు. కేసును ఎలాగోలా తప్పించారు. ఇప్పుడు ప్రజారాజ్యం విషయంలోనూ మెగా బ్రదర్స్ అనే వ్యూహం అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అసలు ప్రజారాజ్యం విలీనంలో తమ పాత్రేమీ లేదని.. చెప్పుకోవడానికి .. వారంతా.. కూడ బలుక్కుని… వరుసగా ప్రకటలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రేపో మాపో.. ఈ వాదన మరింత గట్టిగా వినిపించే అవకాశం తాజా పరిస్థితుల్ని బట్టి అర్థమవుతూనే ఉంది.

“పీఆర్పీ” వైఫల్యం.. జనసేనపై పడకుండా వ్యూహమా..?

పీఆర్పీ కచ్చితంగా రాజకీయాల్లో ఓ సంచలనం. ఓ పార్టీ గెలుపుని తీవ్రంగా ప్రభావితం చేసింది. మరో పార్టీని … అధికారంపై కూర్చోబెట్టింది. 70 లక్షల ఓట్లను సాధించింది. ఆ వేడి.. పోరాటం కొనసాగించి ఉంటే.. కచ్చితంగా ఓ ప్రత్యామ్నాయ పార్టీగా నిలబడి ఉండేది. కానీ ఓ రాజ్యసభ పదవి.. ఓ సహాయ కేంద్రమంత్రి పదవికి.. 70 లక్షల మంది ఓటర్ల నమ్మకాన్ని అమ్మేశారు. అదే ఇప్పుడు.. పెద్ద మరకలా మెగా బ్రదర్స్ పై ఉంది. ఇప్పుడు పవన్ కల్యాణ్‌ను ఏ ఒక్క పార్టీ నాయకుడు.. నమ్మలేకపోతున్నారు. పీఆర్పీ పెట్టినప్పుడు వెల్లువలా వచ్చిన కాపు నేతలు.. ఇప్పుడు.. ఎవరూ ఆయన వైపు చూడటం లేదు.ఓ వైపు పీఆర్పీ అనుభవం..మరో వైపు .. ఆయన రాజకీయం తేడాగా సాగడం కారణంగా అనుకోవచ్చు. రేపు ఓటర్లపై కూడా.. ఈ ప్రభావం ఉంటుంది. జనసేనకు ఓటేస్తే.. పీఆర్పీలా జరగదన్న అనుమానం వారిలో ఉంది. అందుకే.. పీఆర్పీ అలా అంతర్థామనవడానికి చిరంజీవి కారణం కానే కాదని చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఇతర నేతల మీద తోసేస్తారా..? చిరంజీవికేమీ బాధ్యత లేదా..?

అటు పవన్ కల్యాణ్ కానీ.. ఇటు నాగబాబు కానీ.. మొత్తం.. పీఆర్పీ విలీనం పాపం అంతా.. ఆనాడు పార్టీలో ఉన్న సీనియర్ల మీదనే తోసేశారు. వాళ్లంతా స్వార్థం కోసం.. చిరంజీవి తప్పుదోవ పట్టించారని చెప్పుకొస్తున్నారు. అదే నిజం అయితే.. చిరంజీవి అంత బలహీనమైన నాయకుడా..? ఏకంపా పార్టీని విలీనం చేద్దామని.. ఇతర నేతలు ఒత్తిడి చేస్తే.. తల ఊపేస్తారా..? మీ ఇష్టం అనేస్తారా..? ఆయన ప్రమేయం లేకుండా అంతా జరిగిపోతుందా..? అదే జరిగితే.. ఆయన కేంద్రమంత్రి పదవి ఎందుకు తీసుకున్నారు..? కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఎందుకు పని చేశారు…? ప్రజారాజ్యం పార్టీ … ప్రజలకు చేసిన ద్రోహంలో చిరంజీకి వాటా లేనే లేదని.. అంతా అప్పుడు పార్టీలో ఉన్న గంటా లాంటి వాళ్లదేనని చెప్పుకుటూ.. పోతే.. ఆ నింద.. జనసేనపై తుడిచి పెట్టుకుపోతుందని.. ఆశ పడుతున్నట్లు ఉన్నారు మెగా బ్రదర్స్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close