వీళ్లంతా కొసరు.. అసలు వాళ్లు ఇంకా రాలేదు!

Telakapalli-Raviశ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైసీపీ శాసనసభ్యుడు కలమట వెంకట రమణమూర్తి తెలుగుదేశంలో చేరిపోవడం ఆ పార్టీ నాయకుడు జగన్మోహన రెడ్డికి ఎదురుదెబ్బే. తన వాళ్లను ఫిరాయించకుండా ఆపలేకపోతున్నారని దీంతో స్పష్టమై పోయింది. పకడ్బందీగా టిడిపి వీరిని తీసుకుపోతుంటే నివారించలేకపోతున్న జగన్‌ అవిశ్వాస తీర్మానం పెడతామని సంకేతాలు ఇవ్వడం ద్వారా వ్యూహాత్మక గందరగోళాన్ని వెల్లడించుకున్నారు. గతంలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం సంగతి తేలకుండానే ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై అవిశ్వాసం తేవాలని ఆయన భావించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనిపై స్పీకర్‌ ఎలాటి వైఖరి తీసుకుంటారో చూడాలన్నది ఒకటైతే దీనిద్వారా జగన్‌పై ఆయన పార్టీ వారి విశ్వాసం పరీక్షించుకోదల్చుకున్నారని ఒకరు వ్యాఖ్యానించారు.

“నిజానికి ఇప్పటి వరకూ చేరినట్టు ప్రకటించిన వారంతా కొత్తగా మాకు టచ్‌లోకి వచ్చారు. మొదటే మాట్లాడుకున్నవారు ఇంకా అక్కడే వున్నారు,” అని వివరించారో తెలుగు దేశం నేత. మొత్తం సంఖ్య కనీసం 15 దాటొచ్చని కొన్ని పేర్లు నియోజకవర్గాలతో సహా వెల్లడించారు.

వీరంతా వూరికే రావడం లేదు.. ఏవో అవగాహనలు వుంటాయి కదా.. అని ఆయన అన్నప్పుడు “నేను పేమెంట్‌+ అగ్రిమెంటు” అంటే అవునంటూ బలపర్చారు. “స్వాభావికంగా జగన్‌ పైసా బయిటకు తీయరు. వీరంతా ఆయన గొప్పతనాన్ని నమ్ముకుని వుండాలంటే కుదిరేపనేనా? ఈ రోజు రాజకీయాల్లో బతకాలంటే ఎన్నెన్ని ఖర్చులుంటాయి?” అని ఆయన ప్రశ్నించారు. వాటిపై గతంలోనే అవగాహన కుదిరినవారు తర్వాత వస్తారని కొత్తగా ఆసక్తి చూపిన వారిని ముందు చేర్చుకుంటున్నామని వివరించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close