చిరు అంటే అంత భ‌య‌మెందుకు??

చిరంజీవి 150వ సినిమాకి అంతా ఓకే అయిపోయింది. శ్రీ‌జ పెళ్లి అవ్వ‌గానే సినిమా ప‌ట్టాలెక్కేయ‌డం ఖాయం. ఈ సినిమా కోస‌మే చిరు గెడ్డం కూడా పెంచి ర‌ఫ్‌లుక్ కోసం ట్రై చేస్తున్నాడు. అంతా బాగానే ఉంది. అయితే అస‌లు స‌మ‌స్య ఇప్పుడే మొద‌లైంది. చిరంజీవికి త‌గిన క‌థానాయిక ఎవ‌ర‌న్న‌ది ఇంకా తేల‌డం లేదు. న‌య‌న తార ఓకే అనుకొన్నా.. పారితోషికం విష‌యంలో బాగా పేచీ పెట్ట‌డంతో ఆమెను ప‌క్క‌న పెట్టారు. అనుష్క సంగతీ దాదాపుగా అలానే త‌యారైంద‌ని టాక్‌. అనుష్క ఈ సినిమాలో నటించాలో, వ‌ద్దో ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ట‌. `కాస్త ఆలోచించి చెప్తా..` అంటూ వినాయ‌క్‌కి సర్దిచెప్పుకొస్తోంద‌ట‌.

న‌య‌న‌, అనుష్క అనే కాదు. దాదాపుగా టాప్ హీరోయిన్లంతా చిరంజీవి అంటే భ‌య‌ప‌డుతున్నారు. చిరు ఏజ్ ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. చిరుప‌క్క‌న నిల‌బ‌డితే.. మ‌న ఏజ్ ఎక్క‌డ పెరిగిపోతుందో.. అని క‌థానాయిక‌ల భ‌యం. పైగా చిరు సినిమాలో త‌మ‌కెంత స్కోప్ ఉంటుందో వాళ్ల‌కూ తెలిసిందే. చిరు 150వ సినిమా అనగానే అంద‌రి క‌ళ్లూ అటువైపే ఉంటాయి. క‌థానాయిక పాత్ర‌కు ఏమాత్రం ప్రాధాన్యం ఉండ‌దు. ఎంత చేసినా.. గుర్తింపు రాదు. పైగా చిరు సినిమా అంటే ఇంకాస్త కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకొచ్చిన రిస్కూ… అని క‌థానాయిక‌లంతా చిరుని లైట్ తీసుకొంటున్నార్ట‌. చిరు చివ‌రి సినిమా శంక‌ర్ దాదా జిందాబాద్ కీ ఇదే స‌మ‌స్య ఎదురైంది. అప్పుడు న‌య‌న‌తార‌ని సంప్ర‌దించి, స్టార్ హీరోయిన్లంద‌రితోనూ కాద‌నిపించుకొని ఓ కొత్త‌మ్మాయిని తెచ్చిపెట్టుకొన్నారు. ఇప్పుడూ అదే సీన్ రిపీట్ అవుద్దా??? డౌటే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close