జనసేన దూకుడు.. బీజేపీ సణుగుడు..! ఇంతకీ తిరుపతి అభ్యర్థెవరు..?

ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో ఏ పార్టీ బలం ఎంత అనేది తేలిపోయింది. నాలుగు విడుతల పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. అధికార, ప్రతిపక్షాలను పక్కన పెడితే… బీజేపీ, జనసేనల్లో ఎవరి బలం ఏమిటో క్లారిటీ వచ్చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న తాము .. ఏపీలో అధికారం చేపట్టడానికి ఒక్క ఓటు దూరంలో ఉన్నామని బీజేపీ నేతలు చెబుతూ ఉంటారు. అయితే ఆ ఒక్క ఓటు వారికి అందడం లేదు. చాలా దూరంలో ఉండిపోతోంది. కానీ జనసేనకు మాత్రం చాలా దగ్గరగా కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కడా పెద్దగా ప్రభావం చూపించలేదు. పట్టుమని పది పంచాయతీల్లో తమ మద్దతుదారులు గెలిచారని చెప్పుకోలేని పరిస్థితి.

ఏపీ బీజేపీలో తాము పెద్ద తోపు, తురుం ఖాన్ లీడర్లమని చెప్పుకునేవారికి కొదవ ఉండదు. కానీ వారికి స్వగ్రామాల్లోనే పట్టు లేదని తాజాగా తేలిపోయింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా తమ స్వగ్రామంలో ఇలా బీజేపీ పంట పండించామని ప్రకటించలేదు. అదే సమయంలో బీజేపీకి వలస నేతల బలం కొన్ని చోట్ల కలిసి వచ్చింది. గత ఎన్నికల తర్వాత భద్రత భయంతో టీడీపీని వీడి బీజేపీలో కొంత మంది నేతలు చేరారు. వారి గ్రామాల్లో బీజేపీకి మెరుగైన ఫలితాలొచ్చాయి. సీఎం రమేష్ స్వగ్రామం పొట్లదుర్తిలో బీజేపీ అభ్యర్థి మంచి ఆధిక్యంతో గెలిచారు. ఇవి మినహా.. పెద్దగా సాధించిందేమీ లేదు.

అయితే జనసేన అలా కాదు. కింది స్థాయి లో తనకు బేస్ ఉందని నిరూపించుకోగలిగింది. బీజేపీతో పోలిస్తే.. జనసేన బలం పదిరెట్లు ఎక్కువని తేలింది. అందుకే ఇప్పుడు అందరూ తిరుపతి ఉపఎన్నికలో జనసేన పోటీ చేస్తుందా.. బీజేపీ పోటీ చేస్తుందా అన్న చర్చకు వెళ్తున్నారు. బలంపై క్లారిటీ వచ్చింది కాబట్టి.. బీజేపీ కూడా రియలైజ్ అవుతుందని జనసేన నమ్ముతోంది. తమ అభ్యర్థికే పోటీ చేసే చాన్స్ ఇస్తారని ఆశిస్తోంది. కానీ బీజేపీ అంత సామాన్యంగా ఎందుకు ఒప్పుకుంటుంది..?. ఈ విషయంలో పవన్ కల్యాణ్ తన మార్క్ రాజకీయాలు చేయకపోతే ఇబ్బంది పడటం ఖాయమని చెప్పుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close