మోత్కుప‌ల్లి మొర వినేది ఎవ‌రు..?

మోత్కుప‌ల్లి న‌ర్సింహులు… తెలంగాణలో టీడీపీ నేత‌. రాష్ట్రంలో ఉన్న కొద్దిమంది పార్టీ నేత‌ల్లో ఈయ‌నే సీనియ‌ర్‌. కానీ, ఆయ‌న మాట చెల్ల‌డం లేద‌న్న‌ది మోత్కుప‌ల్లి ఆవేద‌న‌గా తెలుస్తోంది. ఎన్నాళ్లుగానో పార్టీలో ఉంటున్నా ఇంకా గుర్తింపు కోసం వెయిట్ చేస్తున్న నేత‌గానే మిగిలిపోతూ వ‌స్తున్నారు. తాజాగా తెలంగాణ‌లో తొలి మ‌హానాడు జ‌రిగింది. దీంతో ఇన్నాళ్లూ వార్త‌ల్లో లేని మోత్కుప‌ల్లి మ‌ళ్లీ తెర‌మీదికి వ‌చ్చారు. ఈ కార్య‌క్ర‌మం అంతా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు సెంట్రిక్ గా జ‌ర‌గ‌డం స‌హ‌జం. కానీ, ఇదే కార్య‌క్ర‌మంలో రేవంత్ రెడ్డికి అధిక ప్రాధాన్య‌త ద‌క్కింద‌నే అభిప్రాయం కొంత‌మందిలో నెల‌కొంది. మ‌రి, మ‌న‌సులో ఇదే అభిప్రాయంతో ఉన్నారేమో తెలీదుగానీ… మోత్కుప‌ల్లి కొన్ని ప్ర‌శ్న‌లు వేశారేమో తెలీదుగానీ, వాటికి జ‌వాబు రాక‌పోవ‌డంతో ఆయ‌న ఆవేద‌న చెందుతున్న‌ట్టు స‌మాచారం!

ఇంత‌కీ తెలంగాణ‌లో పార్టీ అధ్య‌క్షుడు ఎవ‌రు అని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ట‌! అంతేకాదు, తెలుగుదేశం పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రితో పొత్తు పెట్టుకుంటుంద‌నే క్లారిటీ కావాల‌ని అంటున్నార‌ట‌! ఒక ప‌క్క రేవంత్ రెడ్డి పొత్తుల విష‌యంలో త‌న సొంత అజెండా అమ‌లుకు సిద్ధ‌మైపోతున్న సంగ‌తి తెలిసిందే. కేసీఆర్ ఓట‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్ పార్టీతో అయినా పొత్తుకు సిద్ధ‌మ‌ని చెప్తున్నారు. ఇదే విష‌య‌మై చంద్ర‌బాబు ద‌గ్గ‌ర ప్ర‌స్థావిస్తే.. నిర్ద్వంద్వంగా కొట్టిపారేయ‌కుండా… వేచి చూడ‌మంటూ చెప్పారు. ఈ ప‌రిణామాల‌పై మోత్కుపల్లి ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్టు స‌మాచారం. టీ టీడీపీ ఎటువైపు వెళ్తోందో అనీ, కాంగ్రెస్ తో పొత్తు ఎలా సాధ్య‌మ‌నీ, ఇంత కీల‌క‌మైన విష‌య‌మై చంద్ర‌బాబు ఎటూ తేల్చ‌కుండా ఎందుకు తాత్సారం చేస్తున్నార‌నీ, మ‌హానాడులో తాను అడిగిన ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు ఎందుకివ్వ‌డం లేదంటూ స‌న్నిహితుల వ‌ద్ద వాపోతున్న‌ట్టు చెప్పుకుంటున్నారు.

అయితే, మోత్కుప‌ల్లి ఆవేద‌న‌ను మ‌రోలా కూడా అర్థం చేసుకోవ‌చ్చు! ఆయ‌న 1983లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎన్టీఆర్ క్యాబినెట్ లో ప‌నిచేశారు. 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ట్రాక్ రికార్డ్ ఆయ‌న‌ది. ఇక‌, రేవంత్ విష‌యానికొస్తే 2009లో ఎమ్మెల్యే అయ్యారు. ఆయ‌న కంటే చాలా జూనియ‌ర్‌. కానీ, ఈ మ‌ధ్య రేవంత్ ప్ర‌ద‌ర్శిస్తున్న దూకుడుతో ఇత‌ర టీడీపీ నేత‌లు వెన‌క‌బ‌డిపోతున్నారు అన‌డంలో సందేహం లేదు. టీ టీడీపీ అంటే రేవంత్ రెడ్డి అన్న‌ట్టుగా ప‌రిస్థితిని మార్చుకున్నారు. దీంతో ఇత‌ర నేత‌లకు గుర్తింపు ఉండ‌టం లేదు! సో.. ఇప్పుడు మోత్కుప‌ల్లి కూడా ప్ర‌త్యేకంగా చేసేదంటూ ఏమీ లేదు క‌దా! ఆయ‌న పాలిట్ బ్యూరో స‌భ్యుడిగా ఉన్న‌ప్ప‌టికీ, పార్టీలో మోత్కుప‌ల్లి ప్రాధాన్య‌త ఏ స్థాయిలో ఉందో ప్ర‌త్యేకంగా చెప్పుకోన‌వ‌స‌రం లేదు. కాబ‌ట్టి, ఆయ‌న అడుగుతున్న ప్ర‌శ్న‌ల‌కు చంద్ర‌బాబు నుంచి సమాధానం వస్తుంద‌ని ఆశించ‌లేం. కానీ, కాంగ్రెస్ తో తెలుగుదేశం పొత్తు ఆలోచ‌న‌పై ఆయ‌న ఆవేద‌న‌లో మాత్రం అర్థ‌ముందన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close