గౌరు కుటుంబానికే అన్యాయం..! జగన్‌లో ఇక వైఎస్‌ను చూసేదెవరు..?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ పేరు చెప్పి.. ఆయన ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్‌కు ఓటు ఎందుకు వేయాలంటే.. వైఎస్ ను కారణంగా చూపిస్తున్నారు ఆ పార్టీ నేతలు. చివరికి..జగన్మోహన్ రెడ్డి కూడా.. తనకు ఓటు ఎందుకు వేయాలంటే..వైఎస్ పేరే చెబుతున్నారు. మరి నిజంగానే.. వైఎస్‌కు ఉన్నంత నాయకత్వ లక్షణాలు… తన వాళ్లను కాపాడుకునే లక్షణాలు.. జగన్ వద్ద ఉన్నాయా..?

నమ్ముకున్న వాళ్లకు ఎంతకైనా తెగించి అండగా నిలబడిన వైఎస్..!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన వాళ్ల కోసం… ఎంతకైనా తెగిస్తారు..! తన మనుషులు అనుకున్న వారి కోసం తను నష్టపోవడానికి కూడా సిద్ధపడతారు..! ఆ లక్షణమే ఆయనను… ఓ గొప్ప రాజకీయ నేతగా నిలబెట్టింది. ఆయనను ఎంత మంది అభిమానిస్తారో.. అంత కంటే.. ఎక్కువ మందే వ్యతిరేకించవచ్చు. కానీ వ్యతిరేకత రాజకీయపరంగా ఉంటుంది. ఆయనపై అభిమానం మాత్రం వ్యక్తిగతంగా ఉంటుంది. ఈ వ్యక్తిగత అభిమానం.. ఆయన తన వారు అన్న వారిపై చూపే ఆదరణే కారణం. అందులో ఎలాంటి సందేహం లేదు. అప్పట్లో కాంగ్రెస్‌లో వైఎస్ మనుషులుగా చెలామణి అయిన 23 జిల్లాల కాంగ్రెస్ నేతలకు.. ఆయనపై అభిమానం ఉంది.. ఇప్పటికీ.. ఉంది. తెలంగాణలో కూడా మల్లు భట్టివిక్రమార్క, కోమటిరెడ్డి. జీవన్ రెడ్డి, కొండా సురేఖ లాంటి వాళ్లు… తమ అభిమానాన్ని దాచుకోవడానికి ఎలాంటి రాజకీయ పరిస్థితుల్లోనూ సంకోచించరు కూడా…! అంతటి అభిమాన్ని వైఎస్ సాధించుకున్నారు. మరి ఈ విషయంలో జగన్ ఎక్కడ ఉన్నారు..?

నమ్మిన వాళ్లను నట్టేట ముంచుతున్న జగన్..! గౌరు కుటుంబమే సాక్ష్యం..!

గౌరు వెంకటరెడ్డి… వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అనుచరుడు. ఫ్యాక్షన్ గొడవల్లో జైలుకు వెళ్తే.. ప్రతిపక్ష నేతగా ఉండి.. విమర్శలు వస్తాయని తెలిసి కూడా.. జైలుకు వెళ్లి పరామర్శించి వచ్చారు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత… శరవేగంగా క్షమాభిక్ష పెట్టి విడుదల చేయించారు. ఇటీవల వచ్చిన “యాత్ర” సినిమాలో అనసూయ క్యారెక్టర్ గౌరు చరితదే. ఆమె వైఎస్ సాయం కోసం వచ్చిన సందర్భం… ఆయన చూపిన ఆదరణ… ఆ సినిమాలోనే హైలెట్‌గా నిలిచింది. దానికి తగ్గట్లుగానే వైఎస్ ఆ కుటుంబానికి రాజకీయ ప్రాధాన్యం ఇచ్చారు. ఆ కుటుంబం… వైఎస్ చనిపోయిన తర్వాత తమ బాధ్యతగా… వైఎస్ జగన్ వెంట నడిచింది. వారేమీ పదవుల కోసం జగన్ వెంట నడవలేదు. వారికి వర్గం.. బలం ఉన్నాయి. కానీ జగన్ మాత్రం.. వారిని తన మనుషులుగా చూడలేదు. పదవుల కోసం.. తన వెంట వచ్చిన వారిగానే ట్రీట్ చేశారు. చివరికి వారికి పోటీగా.. మరో నేతను.. పార్టీలోకి తీసుకుని… ప్రొత్సహించారు. ఇప్పుడు.. గౌరు కుటుంబానికి టిక్కెట్టే లేదని.. తేల్చిచెప్పారు. ఇప్పుడు వారు తమను.. తమ వర్గాన్ని కాపాడుకోవాలంటే.. వేరే పార్టీలో చేరక తప్పని పరిస్థితి. భూమా కుటుంబం విషయంలోనూ అంతే జరిగింది. భూమా కూతురు అఖిలప్రియను వైఎస్ కుటుంబంలోని వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తే… వారి సంసారంలో కలతలు వస్తే.. కనీసం సర్ది చెప్పడానికి కూడా ప్రయత్నించని నేత జగన్.

వైఎస్ ఆత్మీయులంతా జగన్‌కు ఎందుకు దూరమయ్యారు..?

ఒక్క గౌరు వెంకటరెడ్డి విషయంలోనేనా … వైఎస్‌కు అత్యంత ఆత్మీయులైన ఏ ఒక్కరి అభిమానాన్ని పొందలేకపోయారు. కొండా సురేఖలాంటి వాళ్లయితే.. జగన్ వెంట నడిచి.. ఆయన ప్రవర్తనతో విసిగిపోయి… అన్న మాటలు.. ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. వైఎస్‌కు అత్యంత ఆత్మీయుడైన కేవీపీ దగ్గర్నుంచి చివరికి.. దగ్గరి బంధువు అయిన భూమన కరుణాకర్ రెడ్డి వరకూ..ఎవర్నీ.. జగన్ నమ్మడం లేదు. చాలా మంది దూరమయ్యారు. మిగిలిన వాళ్లనూ దూరం చేసుకుంటున్నారు. వైఎస్ ఆప్తమిత్రుడు.. సాయిప్రతాప్ దగ్గర్నుంచి కృష్ణా జిల్లాలోని పార్థసారధి వరకూ.. అందరూ ఇందులో ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది… అంతా.. వైఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్లే. ధర్మాన, బొత్స లాంటి కొంత మంది వైఎస్ సన్నిహితులు ఉన్నా.. వారెవరూ.. జగన్‌తో వచ్చిన వాళ్లు కాదు. మధ్యలో రాజకీయ భవిష్యత్ కోసం వచ్చిన వాళ్లే.

రాజకీయ లక్షణాల్లో జగన్‌ది వైఎస్ బ్రీడ్ కాదు..!

ఇప్పుడు వైసీపీలో ఉన్న వారందరికీ.. ఒక క్లారిటీ ఉంది. వైఎస్‌పై అభిమానంతో జగన్‌తో నడిచిన వారికీ ఓ క్లారిటీ ఉంది. ఫిజికల్‌గా.. వైఎస్ బ్రీడ్ జగన్ కావొచ్చు కానీ.. రాజకీయంగా మాత్రం.. వైఎస్ బ్రీడ్ కాదని… కనీసం ఒక్క లక్షణం కూడా రాలేదన్న క్లారిటీతో మాత్రం ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close