టీఆర్ఎస్‌ను పల్లెత్తు మాట అనలేదు..! సొంత నేతలపై ఫైరవడానికే అమిత్ షా హైదరాబాద్ వచ్చారా..?

అమిత్ వస్తారు.. తెలంగాణలో బీజేపీ రాత మార్చేస్తారని.. బీజేపీ నేతలు కొద్ది రోజులుగా చాలా గొప్పగా ప్రచారం చేశారు. చాలా రోజుల తర్వాత అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తూండటంతో.. టీఆర్ఎస్ సర్కార్‌పై విరుచుకుపడి.. పార్టీ కార్యకర్తలకు ఊపు తెస్తారని భావించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు చేపట్టిన… .. జన చైతన్య యాత్రల్లో పాల్గొన్న బీజేపీ జాతీయ నేతలు.. కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. రామ్ మాధవ్ ఓ అడుగు ముందుకు వేసి… మగతనం గురించీ ప్రస్తావించడంతో… రెండు పార్టీల మధ్య ఉప్పు-నిప్పు లాంటి పరిస్థితి ఏర్పడింది. ఈ టెంపోను అమిత్ షా మరింత ముందుకు తీసుకెళ్తారనుకుంటే… పూర్తిగా వాతావరణాన్ని చల్లబరిచిపోయారు. తెలంగాణ పర్యటనలో బహిరంగంగా ఒక్క మాట మాట్లాడటానికి కూడా అమిత్ షా సిద్ధపడలేదు. నోరు విప్పకుండానే పర్యటన ముగించారు…

ఐదు వేల మందితో బైక్ ర్యాలీ.. బేగంపేటలో కార్యకర్తలనుద్దేశఇంచి ప్రసంగించేందుకు వేదిక కూడా ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు కానీ అమిత్ షా బేగం పేట ఎయిర్ పోర్టు నుంచి నేరుగా హోటల్ కు వెళ్లిపోయారు. అక్కడ ఆరెస్సెస్, వీహెచ్ పీ లాంటి హిందూ అనుబంధ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. తమను బీజేపీ నేతలు కలుపుకోవడం లేదని వారు ఫిర్యాదు చేశారు. దాంతో తెలంగాణ బీజేపీ నేతలపై.. అమిత్ షా క్లాస్‌ తీసుకున్నారు. పరిపూర్ణాంద వ్యవహారంలో టీ బీజేపీ నేతలు … రాజకీయ లబ్ది కలిగేలా చురుగ్గా వ్యవహరించలేకపోయారన్న అభిప్రాయాన్ని అమిత్ షా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత బీజేపీ కార్యాలయంలో నాలుగు గంటలసేపు అమిత్‌ షా సమీక్ష చేశారు. ప్రధానంగా బూత్ స్థాయిలో పార్టీ పరిస్థితిని, సభ్యత్వ నమోదు, మోర్చా కమిటీల ఏర్పాటును అడిగి తెలుసుకున్నారు.ఇక్కడ కూడా తెలంగాణ బీజేపీ నేతలపై.. అమిత్ షా ఓ రేంజ్ లో ఫైరయ్యారు. బూత్ కమిటీల నియామకం విషయంలో శ్రద్ధ తీసుకోకపోవడాన్ని ప్రశ్నిచారు. ఈ విషయంలో జాతీయ పార్టీ మార్గదర్శకాలను లెక్కలోకి తీసుకోకుండా..సొంత ఎజెండాతో ముందుకు వెళ్లడమేమిటని మండిపడ్డారు. ప్రతి బూత్ స్థాయి కమిటీలో ఐదుగురు స్మార్ట్ ఫోన్లు, బైకులు ఉన్నవారిని గుర్తించాలని..వారితో కేంద్ర సంక్షేమ పథకాల వివరాలను..ఓటర్లకు చేరేలా చేయాలని ఆదేశించారు. .

ఆ తర్వాత సంపర్క్ ఫర్ సమర్థన్ కార్యక్రమంలో భాగంగా.. రామోజీరావు, సైనా నెహ్వాల్, శ్రీనిరాజులను కలిసేందుకు వెళ్లారు. గతంలో నల్లగొండ జిల్లాలో అమిత్ షా మూడు రోజులు పర్యటించారు. అప్పుడు టీఆర్ఎస్ పై దూకుడుగానే వ్యవహరించారు. కానీ ఇప్పుడు మాత్రం అసలు నోరు తెరవలేదు. అయితే అమిత్‌ షా ఇలా మౌనంగా వెళ్ళిపోవడానికి జాతీయ రాజకీయాలే కారణమంటున్నారు. కేంద్రానికి టీఆర్‌ఎస్‌ కూడా పలు అంశాలపై మద్దతుగా నిలుస్తోంది. దీనితో టీఆర్‌ఎస్‌ను దూరం చేసుకోకూడదనే భావనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అమిత్ షా… తెలంగాణకు వచ్చి టీఆర్ఎస్ పై మండి పడి..తమలో జోష్ నింపుతారనుకుంటే.. తమపైనే ఫైరయి… గాలి తీసేశారని.. తెలంగాణ బీజేపీ నేతలు ఫీలవుతున్నారు. ..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close