బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్లతో భేటీలు..! చంద్రబాబువి టైం వేస్ట్ పనులా..?

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు బెంగళూరు వెళ్లనున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ, సీఎం కుమారస్వామితో భేటీ అవుతారు. బెంగళూరులోని పద్మనాభనగర్‌లో దేవెగౌడ నివాసంలో వీరి భేటీ జరగనుంది. ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పక్షాలతో వరుసగా భేటీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో.. ఆ పార్టీని వ్యతిరేకిస్తున్న జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా పార్టీల నేతలతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే జేడీఎస్‌తోనూ చర్చించనున్నారు. ఈ వారంలోనే డీఎంకే అధినేత స్టాలిన్‌తోనూ చంద్రబాబు భేటీ కానున్నారు.

అయితే చంద్రబాబునాయుడు.. బీజేపీ వ్యతిరేక పార్టీలనే కలుస్తూండటంతో.. కొత్తగా… సంపాదించే మద్దతేమిటన్న విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ ఇప్పటికే కూటమిగా ఉన్నాయి. కొత్తగా కూటమిలోకి ఆహ్వానించాల్సిన అవసరం లేదు. అలాగే డీఎంకే కూడా.. ఇప్పటికే కాంగ్రెస్ కూటమిలో ఉంది. కాబట్టి ప్రత్యేకంగా.. సమావేశమైన కూటమిలోకి ఆహ్వానించాల్సిన అవసరం లేదు. కానీ.. చంద్రబాబు పని గట్టుకుని ఆయన రాష్ట్రాలకు వెళ్తున్నారు. దీన్ని టీడీపీ నేతలు సమర్థిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకమైనప్పటికీ.. విడివిడిగా ఉంటున్న పార్టీలను చంద్రబాబు ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. పైగా అందరూ.. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కావడం లేదు. కొత్తగా సేవ్ నేషన్ కూటమిని పెట్టుకోబోతున్నారు. దీనిలో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీనే కానీ… అదే పెద్ద దిక్కు కాదంటున్నారు.

ముందుగా.. బీజేపీ వ్యతిరేక పార్టీలను.. ఓ దారికి తీసుకు వచ్చి.. కూటమిగా ఏర్పడేలా ఒప్పంచగలిగితే.. ఆ తర్వాత బీజేపీకి పరోక్షంగా.. మద్దతు ఇస్తున్న.. తటస్థంగా ఉన్నట్లు కనిపిస్తున్న పార్టీల సంగతి ఆలోచించాలని.. చంద్రబాబు భావిస్తున్నారు. నవీన్ పట్నాయక్.. ఈ విషయంలో… చంద్రబాబు హిట్ లిస్ట్‌లో మొదటగా ఉన్నారు. నవీన్ పట్నాయక్ జాతీయ రాజకీయాలకు దూరంగా ఉంటారు. జాతీయ పార్టీలతో అంటీముట్టనట్లు ఉంటారు. కానీ ఒడిషాలో బీజేపీ ఇప్పుడు కొంత బలంగా ఎదిగింది. కాంగ్రెస్ పతనం అవడంతో.. అ స్థానాన్ని బీజేపీ అందుకుంటోంది. అందుకే అక్కడ బీజేపీని ఎదగకుండా చేయాలంటే.. కాంగ్రెస్ తో కలసి నడవక తప్పని పరిస్థితి పట్నాయక్‌కు ఏర్పడుతోందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. త్వరలో ఆయనతో భేటీ కానున్నారు. అంతేనా… ఇప్పటికి ఎన్డీఏలో ఉన్న ఉత్తరాది మిత్రపక్షాలను కూడా డిసెంబర్ 11వ తేదీ తర్వాత లాగేయాలని.. చంద్రబాబు వ్యూహం పన్నుతున్నారని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close