ఈడీ చార్జిషీట్‌కు ఐదేళ్లు ఎందుకు పట్టింది..? గూడుపుఠాణి ఉందా..?

రఘురామ్ సిమెంట్స్ అలియాస్ భారతి సిమెంట్స్ క్విడ్ ప్రో కో వ్యవహారంలో.. సీబీఐ 2013లోనే చార్జిషీట్ దాఖలు చేసింది. ఇతర సీబీఐ చార్జిషీట్లను ఆధారంగా చేసుకుని … ఈడీ అప్పటికప్పుడు చార్జిషీట్లు దాఖలు చేసింది. కానీ భారతి సిమెంట్స్ విషయంలో మాత్రం ఆలస్యం చేసింది. ఆ కంపెనీ వ్యవహారంలో ఈడీకి సాక్ష్యాలు ఏమీ దొరకలేదని అనుకున్నారు అందరూ. కానీ హఠాత్తుగా.. నెల రోల కిందట… ఈ వ్యవహారానికి సంబంధించి చార్జిషీటు దాఖలు చేసింది. అది రెండు రోజుల కిందట మీడియాకు తెలిసింది. ఈ గ్యాప్‌నే చూపించి జగన్మోహన్ రెడ్డి.. కుట్ర జరిగిందనే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈడీ అధికారులు అంత కంటే ప్లానింగ్‌తోనే ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కడప జిల్లాలో ఉన్న భారతి సిమెంట్స్ సంస్థ ..మొదట రఘురాం సిమెంట్స్ గా ఉండేది. కొన్ని మైనింగ్ లీజులు తీసుకుని పేపర్లపైనే ఉన్న ఆ సంస్థను… వైఎస్ ముఖ్యమంత్రి అయిన కొన్నాళ్లకే జగన్ కొనుగోలు చేశారు. ఆ సంస్థ పేరును తన భార్య భారతి పేరుపైకి మార్చారు. ఆమెను కీలక వాటాదారుగా చేశారు. ఆ తర్వాత ఆ సంస్థలోకి పెట్టుబడుల వరద వచ్చి పడింది. ఈ కంపెనీ కోసం జగన్ పెట్టిన పెట్టుబడి.. లక్షల్లోనే ఉంది. వచ్చిన పెట్టుబడులు మాత్రం వందల కోట్లకు చేరాయి. ఉత్పత్తి ప్రారంభం అవగానే.. ఈ కంపెనీలో 51 శాతం వాటాను ఫ్రాన్స్ కు చెందిన వికాట్ కు దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలకు అమ్మేశారు. అప్పుడప్పుడే ఉత్పత్తి ప్రారంభించిన కంపెనీని .. అంత పెద్ద మొత్తం పెట్టి కొనుగోలు చేయడం అనుమానాలకు తావిచ్చింది. మెజార్టీ షేర్ ఫ్రాన్స్ కు చెందిన వికాట్ కంపెనీ చేతుల్లో ఉన్నప్పటికీ.. ఆ కంపెనీ తరపున భారతి సిమెంట్స్ బోర్డులో నామమాత్రపు ప్రతినిధులే ఉన్నారు. జగన్ కుటుంబంలోని వ్యక్తులే.. ప్రస్తుతం భారతీ సిమెంట్స్ మొత్తాన్ని నడిపిస్తున్నారు.

రఘురామ్ సిమెంట్ ఎదుగుదలపై లోతుగా దర్యాప్తు చేసిన ఈడీ.. మొత్తం గుట్టు బయటకు లాగినట్లు ప్రచారం జరుగుతోంది. విదేశాల నుంచి రావాల్సిన సమాచారం కోసం . ఈడీ గతంలోనే.. ఆయా దేశాలకు లేఖలు రాసింది. వాటికి సంబంధించిన సమాచారం అందడం వల్లే .. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు చార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. వికాట్ కంపెనీ పెట్టుబడులు… వాటిని భారత్ కు తీసుకురావడం.. అలాగే భారతి సిమెంట్స్ లో ఇండియా సిమెంట్స్ తో పాటు.. ఇతర క్విడ్ ప్రో కో పెట్టుబడులు గురించిన మొత్తం సమాచారం సేకరించిన తర్వాతే ఈడీ చార్జిషీట్ దాఖలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నెల రోజులుగా కోర్టు పరిశీలనలో కేసు ఉంది. మరో రెండు, మూడు వారాల్లో సీబీఐ కోర్టు ఈ చార్జిషీటును పరిగణనలోకి తీసుకుని… సమన్లు జారీ చేసే అవకాశం ఉందని… న్యాయవాద వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close