ఆంధ్రాని కన్నా ప‌క్క రాష్ట్రాల‌తో పోలుస్తారేంటీ..!

కేంద్రాన్ని వెన‌కేసుకుని రావ‌డం అనే బృహ‌త్కార్య‌ం మాత్రమే కర్తవ్యంగా పెట్టుకున్నారు ఏపీ భాజ‌పా అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌. తాజా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. కొన్ని వేల కోట్ల రూపాయాలు ఆంధ్రాకి కేంద్రం ఇచ్చేసింద‌ని మ‌రోసారి చెప్పారు. ఏపీ మీద భాజ‌పాకి బాధ్య‌త ఉంది కాబ‌ట్టే పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు నితిన్ గ‌ట్క‌రీ వ‌చ్చార‌న్నారు. మ‌రో కేంద్ర‌మంత్రి కూడా ఆంధ్రాకు వ‌స్తున్నార‌నీ, రాష్ట్రంలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న చేస్తార‌ని క‌న్నా చెప్పారు.

విభ‌జ‌న హామీల విష‌య‌మై క‌న్నా మాట్లాడుతూ… అమ‌లు చేయ‌డానికి ప‌దేళ్ల స‌మ‌యం ఉన్నా, నాలుగేళ్ల‌లోనే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చెయ్యాల్సిన వాటిక‌న్నా ఎక్కువ చేశార‌న్నారు. ఆంధ్రా మీద కేంద్రం వివ‌క్ష చూపిస్తోందంటూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. భాజ‌పాకి దేశమంతా ఒక్క‌టేన‌నీ, అన్ని రాష్ట్రాలూ స‌మాన‌మే అన్నారు. త‌మ‌కు ఆగ‌ర్భ శ‌త్రువులైన కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల‌ను గ‌మ‌నిస్తే ప‌రిస్థితి అర్థ‌మౌతుంద‌న్నారు. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంద‌నీ, ప‌శ్చిమ బెంగాల్ లో మ‌మ‌తా బెన‌ర్జీ భాజ‌పాకి వ్య‌తిరేకంగా రాజ‌కీయాలు చేస్తార‌ని క‌న్నా చెప్పారు. అయినాస‌రే, ఆ రాష్ట్రాల విష‌యంలో భాజ‌పా ఎలా వివ‌క్షా చూప‌డం లేద‌ని, ఇత‌ర రాష్ట్రాల‌తో పోల్చితే ఆంధ్రాకి కేంద్రం ఎక్కువ చేసిందంటూ పోలిక తెచ్చారు.

ఇక్క‌డ క‌న్నా మ‌ర‌చిపోతున్న అంశాలు రెండున్నాయి! ఒక‌టీ.. రాష్ట్రాల‌కు కేంద్ర కేటాయింపులు, ప‌న్నుల వాటాలు, ప‌థ‌కాల అమ‌లు, బ‌డ్జెట్ లో వాటాలు అనేవి భాజ‌పా ద‌యాభిక్ష కాదు! రాజ్యాంగ ప్ర‌కారం ఇవ్వాల్సిన‌వి ఇవ్వాల్సిందే. ఏ పార్టీలో అధికారంలో ఉన్నా చెయ్యాల్సిన పనులే అవి. ఇక రెండోది.. ఇత‌ర రాష్ట్రాల‌తో ఆంధ్రాని ఎలా పోల్చుతారు..? ఆంధ్రా విభ‌జ‌న‌కు గురైంది. రాజ‌ధాని లేదు. ఆదాయం లేదు. విభ‌జ‌న చ‌ట్టంలో హామీల అమ‌లు లేదు. కొత్త రాష్ట్రం ఏర్ప‌డ్డ క్ర‌మంలో ఆ రాష్ట్రానికి అన్ని ర‌కాలుగా చేయూత అందించాల్సిన బాధ్య‌త కేంద్రానిది. ఈ ర‌కంగా ఏపీ ఒక ప్ర‌త్యేక ప‌రిస్థితిని ఎదుర్కొంటున్న రాష్ట్రం. అదే త‌ర‌హాలో ప్ర‌త్యేక‌మైన బాధ్య‌త కేంద్రానికి ఉండాలి. అంతేగానీ.. క‌ర్ణాట‌క‌ను చూడండీ, ప‌శ్చిమ బెంగాల్ కి చాలా ఇస్తున్నాం, భాజ‌పాయేత‌ర రాష్ట్రాల‌ను కూడా బాగానే చూసుకుంటున్నాం అని క‌న్నా వ్యాఖ్యానిస్తూ ఉండ‌టం బాధ్య‌తారాహిత్యం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close