చంద్రబాబుకు లేని టెన్షన్ కేసీఆర్‌కు ఎందుకు..?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. గత రెండు నెలల నుంచి.. టెన్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ముందస్తుకు వెళ్లాలా వద్దా.. అన్న మీమాంసలో.. పడి… శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తను తీసుకుంటున్న నిర్ణయాలపై తనకే క్లారిటీ ఉండటం లేదు. కానీ.. కేసీఆర్ అంటే రాజకీయ ధురంధురుడు కాబట్టి.. ఆయన ఏం చేసినా.. చాలా మందికి వ్యూహంగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రస్తుతం తెలంగాణలో ముందస్తు కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలను పరిశీలిస్తే.. అసలు కేసీఆరే.. ఏమీ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని.. రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరో వైపు.. కేసీఆర్‌తో పాటే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పార్టీని ప్లాన్డ్‌గా ఎన్నికలకు సమాయత్తం చేసుకుంటున్నారు కానీ..ఎక్కడా టెన్షన్ పడటం లేదు. అటు పాలనపై..ఇటు ఎన్నికలపై సమానంగా సమయం కేటాయించి.. ప్రశాంతంగా పని చేసుకుంటూ వెళ్తున్నారు.

నిజానికి ఏపీ ముఖ్యమంత్రితో పోలిస్తే.. కేసీఆర్‌కు ఎన్నో అడ్వాంటేజ్‌లు ఉన్నాయి. కానీ కేసీఆర్ మాత్రం.. రాజకీయంగా.. అధికార గడువును పెంచుకోడానికి తొందర పడుతున్నారు. అంత త్వరగా.. తనకు అనుకూలంగా ఉన్న పరిస్థితి మారిపోతుందని ఎందుకు అనుకుంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. బీజేపీతో ఇంత కాలం నడిపిన సంబంధాలే దెబ్బతీస్తాయనుకుంటే… ఆ చట్రం నుంచి బయటకు రావడానికి కేసీఆర్‌కు పెద్ద పని కాదు. కానీ ఆయన మరింతగా.. మరింతగా.. బీజేపీకి దగ్గరవుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో హడావుడి చేశారు. ఇప్పుడు ముందస్తు ఎన్నికల పేరుతో.. టెన్షన్ పడుతున్నారు. అసలు ఎన్నికలకు వెళ్లాలా వద్దా అని మధన పడుతున్నారు.

నిజానికి కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్‌కు పట్టం కట్టడానికి తాను జాతీయ రాజకీయల్లో చక్రం తిప్పడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. దాని కోసమే ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. వాస్తవంగా చూస్తే.. ఏపీ సీఎం ప్లాన్లు కూడా ఇవే కావొచ్చు. అందుకే ఆయన జాతీయ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించారనుకోవచ్చు. అయినా సరే చంద్రబాబు ప్రశాంతంగానే తన పనులు తాను చేసుకెళ్తున్నారు. ఉన్న పళంగ కుమారుడ్ని ఎదిగిపోయేలా చేయాలనుకోవడం లేదు. కానీ కేసీఆర్ రేపన్నదే ఉండదేమో అన్నట్లుగా.. కేటీఆర్‌ కోసం టెన్షన్ పడుతున్నారు. రాజకీయా పరిస్థితుల్లో కొద్దిగా మార్పులు ఉన్నా… అటు ఏపీ.. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరూ సేమ్ టు సేమ్ సిట్యూయేషన్. కానీ దీన్ని డీల్ చేయడంలో మాత్రం కేసీఆర్ టెన్షన్ పడుతున్నారు. ప్రజల్లో రకరకాల ఊహాగానాలు వచ్చేలా చేసుకుంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం.. ఎప్పుడు ఏం చేయాలో అన్నీ రెడీ చేసుకుని.. దాని ప్రకారం వెళ్లిపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close