మోడీకి అప్పుడు జేజేలు పలికిన ప్రజలే ఇప్పుడు…

బిహార్ ఎన్నికలలలో బీజేపి ఓడిపోతే పాకిస్తాన్ లో మిటాయిలు పంచుకొంటారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. పాకిస్తాన్ లో మిటాయిలు పంచుకొన్నారో లేదో కానీ భారతదేశంలోనే చాలా చోట్ల మిటాయిలు పంచుకొన్నారు. బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు అనేక ఇతర పార్టీలు బీజేపీ ఓటమిని తమ విజయంగా భావించి పండగ చేసుకోవడం పెద్ద ఆశ్చర్యకరమయిన విషయమేమీ కాదు. కానీ సరిగ్గా ఏడాదిన్నర క్రితం మోడీకి జేజేలు పలికిన భారత్ ప్రజలే బిహార్ ఎన్నికలలలో బీజేపి ఓడిపోవడంతో ఏదో ఇదని చెప్పలేని సంతృప్తి పొందుతున్నారెందుకు? అనే సందేహం కలుగకమానదు.

దేశప్రజలలో మోడీ పాలన పట్ల వ్యతిరేకత పెరిగిందా? అంటే లేదనే చెప్పవచ్చును. దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం చేస్తున్న కృషి పట్ల ప్రజలు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మోడీ ప్రభుత్వం చేపట్టిన అనేక సంస్కరణల వలన ఈ ఏడాదిన్నర కాలంలోనే దేశ ఆర్ధిక, పారిశ్రామిక అభివృద్ధి జోరందుకొంది. కనుక మోడీ నేతృత్వంలో దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రజలు దృడంగా విశ్వసిస్తున్నారు. మరయితే బిహార్ లో బీజేపీ ఓడిపోతే సంతోషపడుతున్నారెందుకు? అనే ప్రశ్నకు అనేక కారణాలు కనబడుతున్నాయి.

దేశాన్ని సమర్ధంగా పరిపాలించడం, దేశ రాజకీయాలు రెండు వేర్వేరు అంశాలు. మోడీ దేశాన్ని సమర్ధంగానే పరిపాలిస్తున్నారు కానీ ఆయన తన పార్టీపై ఏవిధంగా పూర్తి పట్టు సాధించారో అదేవిధంగా దేశ రాజకీయాలపై కూడా పూర్తి పట్టు సాధించడంలో విఫలమయ్యారు. విఫలమయ్యారని చెప్పుకోవడం కంటే దానిపట్ల అశ్రద్ద చూపించడం వలననే పార్టీపై ఆ దుష్ప్రభావం పడిందని చెప్పవచ్చును. ఆయన పరిపాలనలో లోపాలను వెతికి పట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ శతవిధాలుగా ప్రయత్నించినప్పటికీ మోడీ ఆ అవకాశం ఇవ్వలేదు. అందుకే రాహుల్ గాంధీ ఎంతసేపు మోడీ సూటును పట్టుకొని వ్రేలాడుతుంటారు తప్ప ఆయన పరిపాలనలో ప్రభుత్వానికి సంబంధించి నిర్దిష్టమయిన లోపాలు ఎత్తి చూపి మాట్లాడలేకపోతున్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో ఆర్.ఎస్.ఎస్.,శివసేన, బీజేపీకి సన్నిహితంగా ఉండే కొందరు సాధువులు దేశంలో ముస్లింలకు, ఇతర మైనార్టీ వర్గాలకు ఆందోళన రేకెత్తించి విధంగా చేస్తున్న వివాదాస్పద వ్యాక్యలు, చేస్తున్న దాడులు దిక్కుతోచని స్థితిలో ఉన్న కాంగ్రెస్ మరియు దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులకు మోడీని ఎదుర్కొనేందుకు బలమయిన ఆయుధాన్ని అందించాయని చెప్పవచ్చును. ఆర్.ఎస్.ఎస్.,శివసేన, తదితరులు అందించిన ఆ అపూర్వ అవకాశాన్ని అందిపుచ్చుకొన్న కాంగ్రెస్ మరియు దేశంలోని బీజేపీ వ్యతిరేక శక్తులు దేశంలో మత అసహనం పెరిగిపోతోందని, భావ స్వేచ్చ నశించిపోతోందని చాలా ఉదృతంగా ప్రచారం చేసాయి.

ఆ ప్రభావానికి అనేకమంది రచయితలు, కళాకారులు, ప్రముఖులు కూడా లోనవడం చాలా విచిత్రంగా ఉంది. కమల్ హాసన్ వంటి ప్రముఖ నటుడు, తన జాతీయ అవార్డును వెనక్కి తిరిగి ఇచ్చేయమని కొందరు తనపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని చెప్పడం చూస్తే, బీజేపీ వ్యతిరేక శక్తులు తెర వెనుక ఎంత గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చును. తెర వెనుక కారణాలు ఎవయితేనేమి చాలా మంది ఏదో పూనకం (మాస్ హిస్టీరియా) వచ్చినట్లుగా తమ అవార్డులను వెనక్కి తిరిగి ఇచ్చేయడం మొదలుపెట్టారు.

అది సామాన్య ప్రజలను కూడా ఆలోచింపజేసింది. ఆర్.ఎస్.ఎస్. తదితర నేతల వివాదాస్పద వ్యాఖ్యలు, దేశంలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలతో కలిపి ముడిపెట్టి చూస్తూ మోడీ ప్రభుత్వ హయాంలో దేశంలో మళ్ళీ మత విద్వేషాలు పెరిగిపోయాయని విశ్వసించడం మొదలుపెట్టారు. ప్రజలలో ఈ అనుమాన బీజాలను నాటిన కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు, బీజేపీ వ్యతిరేక శక్తులు, మోడీ హయాంలో మత అసహనం పెరిగిపోతోందంటూ చేస్తున్న ప్రచారంతో, హడావుడితో ప్రజలను కూడా నమ్మించగలిగాయి. కానీ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ విషప్రచారాన్ని సమర్ధంగా అడ్డుకోవడంలో మోడీ చాలా అశ్రద్ద చూపించారు. బీజేపీ నేతలు కూడా ఆ విష ప్రచారాన్ని అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఆ కారణంగానే ప్రజలలో బీజేపీ పట్ల వ్యతిరేకత పెరిగింది. అదే ఇప్పుడు బిహార్ ఎన్నికలలో బీజేపీ ఓడిపోయినప్పుడు వారి ముఖాల్లో ప్రతిఫలిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close