సుప్రీంకోర్టుపైనా కేంద్రం పెత్తనం..! ఏ తీరాలకీ పతనం..!!

సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన జడ్జి నియామకాన్ని కేంద్రం అడ్డుకుంది. ఆమోదించకుండా తిప్పి పంపింది. భారత దేశ న్యాయచరిత్రలో ఇదో అరుదైన ఘటన. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంపై.. నేరుగా కేంద్రం ప్రభావం చూపిస్తూ …కారణాలేమిటో ఇతమిత్థంగా చెప్పకుండా.. గతంలో ఎంతో మందిని నియమించినట్లే .. నియమిస్తున్నా.. కేంద్రం జస్టిస్ కె.ఎం.జోసెఫ్ పేరును తిప్పిపంపింది. ఇప్పుడిది దేశంలో సంచలనం.

నిజానికి భారతీయ జనతాపార్టీ అధికారంలోకి రాగానే… న్యాయవ్యవస్థను.. గుప్పిట పట్టాలనే ప్రయత్నం చేసిందన్న ఆరోపణలున్నాయి. న్యాయమూర్తుల నియామకాలను చేపట్టే కొలీజియం వ్యవస్థ స్థానంలో జాతీయ న్యాయనియామకాల కమిషన్‌ను తీసుకురావాలని భావించారు. దాన్ని సుప్రీంకోర్టే కొట్టి వేయడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. కానీ న్యాయమూర్తుల నియామకం విషయంలో ఇప్పటికీ… జోక్యం చేసుకుంటూనే ఉంది.

జస్టిస్ కె.ఎం.జోసెఫ్. ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి. కేరళకు చెందినవారు. తన విధి నిర్వహణలో ఆయనకు ఎలాంటి రిమార్కులు లేవు. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జోసెఫ్.. రాష్ట్రపతి పాలన విధింపును కొట్టివేశారు. దాంతో బీజేపీ ఆయనపై అకారణమైన ఆగ్రహాన్ని పెంచుకుంది. దాని ఫలితమే ఇప్పుడు.. జస్టిస్ జోసెఫ్‌ను కొలీజియం సిఫార్సు చేసినా… సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి మోకాలడ్డటం. జస్టిస్‌ జోసెఫ్‌ కన్నా అనేక మంది హైకోర్టు సిజే లు, సీనియర్‌ జడ్జిలు సీనియారిటీలో ముందున్నారనికేంద్రం చెప్పుకొస్తోంది. విచిత్రం ఏమిటంటే.. కొలీజియంలో భాగమైన చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా.. కేంద్రానికే మద్దతుగా నిలుస్తున్నారు. నిజానికి చీఫ్ జస్టిస్‌ కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చాలా రోజులుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొలీజియంలోని మిగిలిన నలుగురు సభ్యులు జస్టిస్ మిశ్రా తీరుపై ఓ సారి తిరుగుబాటు చేసిన ఘటన సంచలనాత్మకమయింది. స్వయంగా చీఫ్ జస్టిస్ పై ఆరోపణలున్న కేసు విచారణలను ఆయనే విచారించుకుని.. ముగింపునిచ్చేశారు. అదే కాదు జస్టిస్ లోయా మృతి కేసు సహా.. అనేక వివాదాస్పద కేసుల్లో ఏకపక్ష తీర్పులొచ్చాయి. అందుకే ప్రధాన న్యాయమూర్తిపై ప్రతిపక్షానికి నమ్మకం లేదు. అందుకే అభిశంసన తీర్మానం కూడా ఇచ్చింది. అది కూడా ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది.

భారత న్యాయవ్యవస్థ ప్రమాదంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం న్యాయవ్యవస్థకు అతీతంగా ప్రవర్తిస్తోంది. కొలీజియం సిఫార్సు మేరకే న్యాయమూర్తులను నియమించడానికి కేంద్రం అంగీకరిచడం లేదు. జస్టిస్ మిశ్రా తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గోగోయ్ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కానీ ఈయన కూడా… చీఫ్ జస్టిస్‌పై తిరుగుబాటు చేసిన వారిలో ఉన్నారు. కేంద్రం చీఫ్ జస్టిస్‌గా గోగోయ్ నియామకానికి ఆమోదం తెలుపడం కూడా కష్టమన్న అంచనాలు ఇప్పటి నుంచే వస్తున్నాయి. మొత్తానికి న్యాయవ్యవస్థ అస్థిత్వాన్ని కేంద్రం ఫ్రశ్నిస్తున్నట్లుగానే ఉంది. ఈ పతనం ఈ తీరానికి చేరుతుందో… ఊహించడం కష్టమన్నది నిపుణుల అభిప్రాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close