రెండో విడ‌త కేసీఆర్ పాల‌న‌లో సంబురాలు లేవా..?

సంబురం అంటే కేసీఆర్…. కేసీఆర్ అంటేనే సంబురం! ఇది ఇప్ప‌టి మాట కాదులెండి. గ‌తంలో అంటే… తెలంగాణ ఏర్ప‌డ్డాక, తొలిసారిగా ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత, తొలి ఐదేళ్ల‌పాటు ఆయ‌న పాల‌న నిత్య సంబురంగానే ఉండేది. ఆయ‌న ఏ నిర్ణ‌యం తీసుకున్నా పండుగ స్థాయి, ప్రారంభం ప్ర‌చారం. పాల‌న తొలి ఏడాది పూర్త‌యితే అదో పండుగ‌, మ‌లి ఏడాదికి మ‌రో సంద‌డి, ఇలా ప్ర‌తీయేటా… ఐదేళ్ల‌పాటు కేసీఆర్ పాల‌న వార్షికోత్స‌వాల్లా జ‌రుపుకుంటూ వ‌చ్చారు. ప్ర‌తీయేటా… ఆ ఏడాది కాలంలో సాధించిన అభివృద్ధి గురించి మాట్లాడేవారు. తెరాస నాయ‌కుల హ‌డావుడైతే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే… గ‌త సంబురాల ప్ర‌స్థావ‌న ఎందుకంటే… ఇప్పుడు కూడా అలాంటి సంద‌ర్భ‌మే క‌దా! కానీ, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎందుకు ముచ్చ‌ట‌గా మాట్లాడ‌టం లేదు? అధికార పార్టీ నాయ‌కులు ఎందుకు సంబురాలు చేసుకోవ‌ట్లేదు..?

కేసీఆర్ స‌ర్కారు రెండోసారి అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్త‌యింది. కానీ, ఏడాది పాల‌న మీద స‌మీక్ష నిర్వ‌హించాల‌నే ధ్యాస‌గానీ, ఊసుగానీ అధికార పార్టీ వ‌ర్గాల్లో క‌నిపించ‌డం లేదు. తొలిసారి అధికారంలో ఉండ‌గా ప్రతీయేటా వార్షికోత్స‌వాలు నిర్వ‌హించే ఆన‌వాయితీ ఉండేది. ఇప్పుడా సంప్ర‌దాయాన్ని ఎందుకు కొన‌సాగించ‌డం లేదు? మొద‌టి ట‌ర్మ్ లో వార్షికోత్స‌వం వ‌స్తే ప్ర‌భుత్వ ప‌థ‌కాల గురించి గొప్ప‌గా చెప్పుకునే నేతలు, రెండో ట‌ర్మ్ కి వ‌చ్చేస‌రికి వాటి ఊసెత్త‌డం లేదు? ఏడాది పాల‌న మీద‌ రివ్యూ నిర్వ‌హ‌ణ‌పై పార్టీ అధినాయ‌క‌త్వం స‌రే, క‌నీసం ఎమ్మెల్యేలుగానీ మంత్రులుగానీ ఆస‌క్తి చూప‌క‌పోవ‌డం విశేషం. అధినాయ‌క‌త్వ‌మే పెద్ద‌గా ఆస‌క్తి చూప‌క‌పోతున్న‌ప్పుడు.. ఎవ‌రు మాత్రం నోరు తెరిచి మాట్లాడ‌గ‌ల‌రు..?

వాస్త‌వం మాట్లాడుకుంటే, గ‌త ప్ర‌భుత్వం ప్రారంభించిన ప‌థ‌కాలు మిన‌హా, రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక కొత్త‌గా చేసిన‌వంటూ ఏవీ లేవు. అర్హుల‌కు డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఇంటి నిర్మాణానికి రూ. 5 ల‌క్ష‌ల సాయం, నిరుద్యోగ భృతి, ఖాళీల భ‌ర్తీ … ఇలాంటి వాటి ఊసే ప్ర‌భుత్వం ఎత్త‌డం లేదు. రైతు రుణ‌మాఫీ అన్నారు అదీ జ‌ర‌గ‌డం లేదు. రైతుబంధు చెక్కులు కూడా ఇంకా చాలామందికి అందాల్సి ఉంది. కేసీఆర్ గొప్ప‌గా చెబుతూ వ‌స్తున్న ప్రాజెక్టులు కూడా ఇంకా పూర్తిస్థాయిలో పూర్తికాని ప‌రిస్థితి. ఇలా ఎటు చూసుకున్నా… రెండో విడ‌త ఏడాది పాల‌న సాధించిన విజ‌యాలంటూ ప్ర‌త్యేకంగా చెప్పుకోద‌గ్గ‌వేవీ లేవు. వాస్త‌వ ప‌రిస్థితి ఇది కాబట్టి, సంబురాలు చేసుకోవ‌డం స‌రైంది కాద‌నే అభిప్రాయం వారికే కలిగి ఉండొచ్చు. ఏదేమైనా, కేసీఆర్ 2.0 స‌ర్కారుకు గ‌త జోష్ లేద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close