అవార్డులకు రాజ‌మౌళి ఎందుకు దూరం?

దేశం మొత్త‌మ్మీద పేరెన్న‌ద‌గిన న‌లుగురైదుగురు ద‌ర్శ‌కుల్లో రాజ‌మౌళి త‌ప్ప‌కుండా ఉంటారు. బాహుబ‌లితో ఆయ‌న‌కు అంత‌ర్జాతీయ ఖ్యాతి ద‌క్కింది. తీసిన ప‌ది సినిమాలూ.. ప‌ది మైలు రాళ్ల‌గా నిలిచిపోతే… బాహుబ‌లి శిఖ‌ర స‌మాన‌మైంది. బాహుబ‌లికి వ‌చ్చిన‌, వ‌స్తున్న అవార్డులు అన్నీ ఇన్నీ కావు. రాజ‌మౌళికి ముందు నుంచీ అవార్డులు కొత్త‌కాదు. దాదాపుగా ప్ర‌తీ సినిమాకీ ఏదో రూపంలో అవార్డు వ‌స్తూనే ఉంది. బాహుబ‌లికి ఆ జోరు మ‌రింత పెరిగింది. అయితే ముందు నుంచీ రాజ‌మౌళికి అవార్డులు తీసుకోవ‌డం ఇష్టం ఉండ‌వు. ప‌ద్మ‌శ్రీ మిన‌హా ఏ అవార్డునీ ఆయ‌న తీసుకోలేదు. సినిమా అవార్డుల‌కు, అవార్డు ఫంక్ష‌న్ల‌కూ ఆయ‌న దూరం. తాజాగా `సైమా`తో ఇది మ‌రోసారి నిరూపిత‌మైంది. దుబాయ్‌లో `సైమా` అవార్డు వేడుక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళికి అవార్డు వ‌రించింది. కానీ.. రాజ‌మౌళి దాన్ని తీసుకోలేదు.

రాజ‌మౌళి అవార్డు తీసుకోక‌పోవ‌డం కొత్త కాదు. కానీ.. ఈసారి ఆయ‌న దుబాయ్ వ‌చ్చారు. అవార్డు ప్ర‌దానం చేస్తున్న వేదిక‌కు అతి స‌మీపంలో ఉన్నారు. కానీ అవార్డు మాత్రం తీసుకోలేదు. త‌న కుటుంబంతో జాలీగా గ‌డ‌ప‌డానికి `సైమా` కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన రాజ‌మౌళి.. అవార్డు తీసుకోవ‌డానికి రాక‌పోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. రాజ‌మౌళి ఫ్యామిలీలో అవార్డు వేడుక‌లో క‌నిపించింది ఒక్క కీర‌వాణి మాత్ర‌మే. ఆయ‌న ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా (బాహుబ‌లి) అవార్డు అందుకున్నారు. అయితే `నేను దుబాయ్ వ‌స్తాను గానీ అవార్డు తీసుకోను` అని నిర్వాహ‌కుల‌కు రాజ‌మౌళి ముందే స‌మాచారం అందించార్ట‌. అవార్డులు అనేవి ప్ర‌తిభ‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నాలు. క‌ష్టానికి గుర్తింపు. అవార్డులు అందుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడేవాళ్లెంతోమంది. కానీ రాజ‌మౌళి మాత్రం `నాకు అవార్డు వ‌ద్దు బాబోయ్‌` అన‌డం ఆశ్చ‌ర్య‌మే. ఈ అవార్డుల‌పై ఆయ‌న‌కు న‌మ్మ‌కం లేదా? లేదంటే అవార్డు అందుకునే స్థాయిని ఎప్పుడో దాటేశాం అనుకుంటున్నాడా?? కార‌ణం ఆయ‌న‌కే తెలియాలి. ఏది ఏమైనా అవార్డుల‌పై నిర్లిప్త‌త ప్ర‌ద‌ర్శించే అతికొద్ది మందిలో రాజమౌళి కూడా ఒక‌డిగా చేరిపోయాడ‌న్న‌ది మాత్రం వాస్తవం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close