ఎక్కడా లేనంత ఉష్ణోగ్రత తెలుగు రాష్ట్రాలకే ఎందుకు?

రోహిణిలో రోళ్ళు పగులుతాయన్నది భారతీయ వాతావరణ స్వభావాన్ని సూచించే సామెత. ఇది ఆశ్వనికార్తె. భరణి, కృత్తిక కార్తులు గడచిన తరువాత రోహిణి కార్తె వస్తుంది. దేశమంతా ఎండలు పెరిగిపోతూంటే, తెలుగు రాష్ట్రాల్లో ఇది మరీ దారుణంగా వుంది. దేశవ్యాప్తంగా వడగాలులకు చనిపోతున్న వారిలో 20 శాతం మంది ఈ ప్రాంతాల వారేనంటే పరిస్ధితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.

వేసవి కాలం వేసవి కాలంలాగే వుంది…వేడిని తట్టు కోడానికి నెత్తిమీద గొడుగే లేకుండా పోయింది. వడగాలిని అడ్డుకోడానికి చెట్టే లేకుండా పోయింది. ఇదంతా ఇంకిపోయి ఎప్పుడు పేలిపోతుందా అన్నంత ఆందోళన కరంగా భూమి సలసలా కాగిపోతోంది. ఇవాళ ”ఎర్త్ డే” ఇది భూతాపానికి మూలాలమీద ఒక విశ్లేషణ…తెలుగురాష్ట్రాల్లోనే తాపం తీవ్రతపై ఒక పరిశీలన

ఎండకు గొడుగు పచ్చదనమే! అడవులు ఎంత ఎక్కువగా వుంటే చల్లదనం అంత ఎక్కువగా వుంటుంది. 400 ఏళ్ళక్రతం భారతదేశపు విస్తీర్ణంలో దాదాపు సగం వరకూ అడవులే వుండేవి. బ్రటీష్ వారు అడవుల్ని నరికించి కలపను నౌకల్లో తరలించుకుపోయారు. వాళ్ళు దేశం వదిలే సరికి 28 శాతం అడవులు మిగిలి ఈ అరవై ఏళ్ళలో 23 – 21 శాతానికి తగ్గిపోయాయి. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరీ దారుణంగా 19 శాతానికి తగ్గిపోయాయి. ”ఇదే ఎక్కడా లేనంత వేడి తెలుగురాష్ట్రాల్లోనే వుండటానికి మూల”మని రిటైర్ట్ ఫారెస్ట్స్ రీజనల్ కన్సర్వేటర్ సోమశేఖరరావు చెప్పారు.

వేసవిలో కూడా చలిపుట్టే లోతట్టు అటవీ ప్రాంతమైన వై రామవరం ఏరియాలో పగటి పూట ఉష్ణోగ్రత 40 సెంటిగ్రేడ్ డిగ్రీలకు చేరుకుంటుందని ఎపుడైనా ఊహించారా అని ఆయన ప్రశ్నించారు!

దేశం ప్రతిరోజూ నూటముప్పయి అయిదు హెక్టార్ల అడవులను నష్టపోతున్నదని మూడేళ్ల క్రితం అధికారికంగా గణాంకాలు వెలువడ్డాయి. అడవులు పెంచుతున్నామని, సామాజిక అడవుల పథకాల కింద వేలు,లక్షల మొక్కలు నాటుతున్నామని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. అందువల్ల నరికివేతకు గురి అవుతున్న అడవుల విస్తీర్ణం కంటె కొత్తగా ఏర్పడుతున్న అడవుల విస్తీర్ణం పెరిగి ఉండాలి. కానీ పెరగలేదు. ప్రతి దేశంలోను కనీసం ముప్పయి మూడు శాతం భూభాగంలో అడవులు ఉండాలన్నది అంతర్జాతీయ గ్రీన్ పాలసీ.

మనదేశంలో ప్రస్తుతం ఉన్న ఇరవై రెండు శాతం అడవులు ముప్పయి మూడు శాతానికి పెరిగేది ఎప్పుడు? అలా పెరిగినప్పుడు మాత్రమే ఉష్ణోగ్రతను అదుపు చేయడం ప్రకృతికి సాధ్యమౌతుంది. ప్రపంచీకరణ మొదలైన తరువాత పోస్కో అన్న విదేశీయ సంస్థ – ప్రత్యేక ఆర్థిక సెజ్-ఒరిస్సాలోలక్షా డెబ్బయి వేల మహా వృక్షాలను రెండేళ్లలో నరికేసింది. పత్యేక ఆర్థికమండలాలను ఏర్పాటు చేస్తున్నట్టే ప్రత్యేక హరిత మండలాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవడం లేదు. మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం రెండేళ్లలో దాదాపు రెండున్నర లక్షల హెక్టారుల అటవీ భూమిని సెజ్‌ల కోసం అప్పగించింది. ఇందువల్లే ఎండలు మండిపోతున్నాయని తెలిసినప్పటికీ ప్రభుత్వాలు అడవులను ధ్వంసం చేశాయి. దేశమంతటా మొక్కలు పెరిగినప్పుడు మాత్రమే ఎండల తీవ్రతను ఎదుర్కోగలం..అవి ఎప్పటికి పెరుగుతాయి? ఎప్పటికి చెట్లవుతాయి??

బాటసారులకు నీడనిచ్చుటకు, ఉష్టతాపములనుండి ప్రజలను ఉపశమన పరచుటకు దాదాపు 2400 ఏళ్ళక్రితమే మొక్కలు నాటించిన అశోక చక్రవర్తి స్ఫూర్తినైనా కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు అందిపుచ్చుకోలేవా??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close