రవిప్రకాష్‌పై విజయసాయి పిటిషనే వేయవచ్చుగా… చీఫ్ జస్టిస్‌కు లేఖ ఎందుకు..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి టీవీ9 మాజీ సీఈవో అక్రమాలకు పాల్పడ్డారంటూ.. నేరుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. రవిప్రకాష్ ఆస్తులపై ఈడీ, సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఫెమా, ఆర్‌బీఐ రెగ్యులేషన్స్‌, మనీలాండరింగ్‌తో పాటు ఇన్‌కంటాక్స్ ఎగ్గొట్టడం ద్వారా అక్రమాస్తులు కూడబెట్టారంటూ లేఖలో ఫిర్యాదు చేశారు. మొయిన్‌ ఖురేషి, సానా సతీష్‌తో కలిసి చాలా మందిని మోసం చేశారని ఆరోపించారు. నగల వ్యాపారి సుఖేష్ గుప్తాను బెదిరించి హవాలాకు పాల్పడ్డారని విజయసాయి ఆరోపణలు చేశారు. హవాలా సొమ్మును కెన్యా, ఉగాండాల్లో సిటీ కేబుల్‌లో రవిప్రకాష్‌ పెట్టుబడులు పెట్టారని ఆ లేఖలో ఆరోపించారు.

జగన్‌పై శంకర్రావు వేసినట్లుగా రవిప్రకాష్‌పై విజయసాయి పిటిషన్ వేయవచ్చుగా..?

విజయసాయిరెడ్డి .. లేఖ రాజకీయ, మీడియా వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే.. కెన్యా, ఉగాండాల్లో రవిప్రకాష్ పెట్టుబడులు పెట్టారని… ఆయన సన్నిహితులందరికీ తెలుసు. పదేళ్ల కిందటనే ఆఫ్రికాలో ఆయన వ్యాపార అవకాశాలు వెదుక్కున్నారని చెబుతున్నారు. అయితే.. ఇప్పుడు.. ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టడమే నేరంగా.. అవన్నీ.. ఫెరా, ఫెమా నిబంధనలు ఉల్లంఘించి పెట్టిన పెట్టుబడులుగా… విజయసాయిరెడ్డి .. ఫిర్యాదు చేయడమే.. ఆశ్చర్యకరంగా మారింది. అన్ని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశానంటూ… విజయసాయిరెడ్డి తన టీం ద్వారా మీడియాలో చాటింపేసుకుంటున్నారు కానీ.. అన్ని ఆధారాలుంటే.. చీఫ్ జస్టిస్‌కు లేఖ ఎందుకు రాస్తారు.. నేరుగా పిటిషనే వేయవచ్చు కదా.. అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జగన్ పై గతంలో శంకర్రావు అలాంటి పిటిషనే వేశారు. ఆయన ఆధారాలు బయటపెట్టడంతో కోర్టు కూడా.. విచారణకు ఆదేశించింది. ఫలితంగా.. అంతా బయటకువచ్చింది.

చీఫ్ జస్టిస్‌కు లేఖ రాయడంలో మతలబు ఏమిటి..?

విజయసాయిరెడ్డి తన పిటిషన్‌లో ఆదాయపు పన్ను ఎగ్గొట్టడం దగ్గర్నుంచి సీబీఐ, ఈడీల ప్రస్తవన కూడా తీసుకువచ్చారు. ముందుగా.. వీటన్నింటికీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. వారికి ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. అలా చేయకుండా.. నేరుగా చీఫ్ జస్టిస్‌కు లేఖ రాయడంలో.. అసలు మతలబు వేరే ఉందని చెబుతున్నారు. మీడియా ప్రచారం కోసం.. సుప్రీంకోర్టును ఉపయోగించుకుంటున్నారా.. అనే సందేహాలు సహజంగానే వస్తున్నాయి. దేశంలో.. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే.. వారిపై ఫిర్యాదు చేయాడనికి అందరికీ హక్కు ఉంటుంది. దానికి ఆధారాలు ఉండాలి. అలా ఉంటే ముందుగా దర్యాప్తు సంస్థలను ఆశ్రయించాలి. వారి వద్ద నుంచి స్పందన లేకపోతే.. కోర్టులో పిటిషన్ వేయాలి. అంతే కానీ.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాయడం మాత్రం… భిన్నమైన కోణం.

కేంద్రంలో పలుకుబడి అంతా కరిగిపోయిందా…?

విజయసాయిరెడ్డికి కేంద్రంలో కావాల్సినంత పలుకుబడి ఉంది. ఆయనకు పీఎంవో తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకుంటారు. ఇక ఆయనపై.. లెక్కలేనన్ని మనీలాండరింగ్, ఫెరా, ఫెమా కేసులు ఉన్నాయి. వాటన్నింటిపై ఇప్పుడు విచారణ స్లో అయింది. దానికి కూడా ఆయన లాబీయింగ్ కారణమని చెబుతూంటారు. పైగా ఆయన వైసీపీ రాజ్యసభ సభ్యుడు. అంతకు మించి ఆడిటర్. ఆయనకు చట్టాల గురించి పూర్తి అవగాహన ఉంటుంది. అన్నీ తెలిసి.. జగన్ పై.. శంకర్రావు వేసినట్లుగా… రవిప్రకాష్‌పై తను కోర్టులో పిటిషన్ వేయకుండా.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఎందుకు లేఖ రాశారనేది ఇప్పుడు.. ఆసక్తికర అంశం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close