పూర్తిగా గొలుసులు తెంచేసుకున్న వైసీపీ నేతలు !

కుక్కలు కూడా తమ జోలికి రానంత వరకూ ఎవరి జోలికి వెళ్లవు. కానీ పిచ్చి పట్టిన కుక్కలు మాత్రం రోడ్డున పోయే ప్రతి ఒక్కరిని కరుస్తాయి. ఘాటుగా చెప్పుకోవాలంటే ఏపీలో కొంత మంది రాజకీయ నాయకుల పరిస్థితి ఇంతే ఉంది. ముఖ్యంగా వైసీపీ నాయకులు .. తమ నోటికి పని చెబుతున్నారు. మనుషులు.. స్థాయి … గౌరవం అనేది లేకుండా ఇష్టారాజ్యంగా అందర్నీ తిట్టేస్తున్నారు. తాజాగా రజనీకాంత్ ఉదంతంతో అదే స్పష్టమయింది.

వైసీపీ గురించి రజనీకాంత్ ఏమీ అనలేదే ?

రజనీకాంత్ ఎక్కడా వివాదాస్పద అంశాల జోలికి వెళ్లలేదు. ముఖ్యంగా ఏపీ రాజకీయాల జోలికి అసలు రాలేదు. అధికార పార్టీ విధానాలపై కానీ .. ఏపీలో ఉన్న రాజకీయాలపై కానీ స్పందించారు. తన మిత్రుడ్ని పొగిడారు. దానికే వైఎస్ఆర్‌సీపీ నేతలు విరుచుకుపడ్డారు. కానీ వైఎస్ఆర్‌సీపీ నేతలు మాత్రం రజనీకాంత్‌ను అన్నీ మాటలన్నారు. చివరికి రజనీ ఆరోగ్యపరమైన అంశాలను కూడా ఎగతాళి చేశారు. వ్యక్తిగతంగా తిట్టి పోశారు. రజనీకాంత్ సూపర్ స్టార్. కొన్ని కోట్ల మందికి ఆరాధ్యుడు. ఆయన చంద్రబాబును పొగడటమే తప్పన్నట్లుగా వైఎస్ఆర్‌సీపీ నేతలు విరుచుకుపడిన వైనం అందర్నీ ఆశ్చర్య పరిచింది. తమిళనాడులోనూ ఈ అంశం వైరల్ అవుతోంది.

చంద్రబాబును పొగిడినా తప్పేనా ? సైకో రాజకీయం !

మన మిత్రులు మనల్ని పొగుడుతారు. అది సహజం. అలా కూడా పొగడకూడదని.. రాజారెడ్డి రాజ్యాంగంలో ఉందేమో కానీ వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. రాజకీయంగా విమర్శిస్తే ఎదురుదాడి చేయడం సహజం కానీ… ప్రత్యర్థిని పొగిడినా సహించలేని అధికార పక్షం వ్యక్తిగత విమర్శలకు దిగడం.. వ్యక్తిత్వ హననం చేయడం ఖచ్చితంగా సైకో రాజకీయమం. పొగిడినా భరించలేనంత మానసిక స్థితికి వెళ్లిపోయారు. ఈ ఫ్రస్ట్రేషన్‌లో వాళ్లకు కళ్లు మూసుకుపోయాయి.. ఏం చేస్తున్నామో తెలియని స్థాయికి దిగజారిపోయారు.

ఎవరు పొడిగినా అదే బూతుల దాడి !

ఏమైనప్పటికీ ఇప్పుడు ఎవరైనా ఏపీకి వచ్చి చంద్రబాబును పొగడాలంటే ఒకరిటికి రెండు సార్లు ఆలోచించుకవాల్సిందే. రాజకీయాలకు సంబంధం లేని.. చంద్రబాబును అభిమానించే అనేక మంది… ఆయనను పొగడటానికి .. ఆయన విజన్ ను అభినందించే అవకాశం ఉంది. సమాజంలో ఎంతో మంిది ప్రముఖులు చంద్రబాబును అభిమానిస్తారని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అలాంటి వారంతా చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతారని.. అలా మాట్లాడితే సహించబోమని.. వ్యక్తిగత విమర్శలతో ఎదురుదాడి చేస్తామన్న సంకేతాలను రజనీకాంత్ పై విరుచుకుపడటంమ ద్వారా పంపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close