చంద్ర‌బాబు చేసేది ఓట‌మి సాకులైతే వైకాపా ధీమాగా ఉండాలి క‌దా!

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న ఓట‌మికి సాకులు వెతుక్కుంటున్నారంటూ వైకాపా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి విమ‌ర్శించారు. ఆయ‌న ప్ర‌వేశ‌పెట్టిన ప‌సుపు కుంకం, ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాలను ప్ర‌జ‌ల‌ను న‌మ్మ‌లేద‌ని చంద్ర‌బాబుకి అర్థ‌మైపోయింద‌న్నారు. అందుకే, త‌న ఓట‌మికి కార‌ణాలు టీడీపీ ప‌రిపాల‌న కాద‌నీ, త‌న నిర్ణ‌యాలు కాద‌నీ, కేవ‌లం ఎన్నిక‌ల సంఘం నిర్వాక‌మే అని చెప్ప‌డం కోస‌మే ప్ర‌స్తుతం ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్నారు. ఈసీ నిర్వాకం వ‌ల్ల‌నే ఫ‌లితాలు ఇంత దారుణంగా వ‌చ్చాయ‌ని చంద్ర‌బాబు త‌రువాత చెప్పుకుంటార‌ని అన్నారు. ఈవీఎంల‌పై పోరాటం అని చంద్ర‌బాబు ఎంత హ‌డావుడి చేస్తున్న ఇత‌ర పార్టీల నుంచి పెద్ద‌గా మ‌ద్ద‌తు రావ‌డం లేద‌న్నారు.

వీవీప్యాట్ల ఏర్పాటుతో ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో మ‌రో ముంద‌డ‌గు ప‌డ్డ‌ట్టేన‌నీ, ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో మ‌రింత పాద‌ర్శ‌క‌త పెరిగిన‌ట్టే అని సజ్జ‌ల చెప్పుకొచ్చారు. ఏపీలో ఈవీఎంల ట్యాంప‌రింగ్ జ‌రిగింది అంటూనే తెలుగుదేశం పార్టీకి పెద్ద సంఖ్య‌లో సీట్లు వ‌స్తాయ‌ని చంద్ర‌బాబు నాయుడు ఎలా చెబుతార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌న గెలుపుకి కార‌ణ‌మైన ప్ర‌జ‌ల‌కు ఆయ‌న ఫ‌లితాల రాక‌ముందే కృత‌జ్ఞ‌త‌లు తెలిప‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌న్నారు. చంద్ర‌బాబు తీరుని విశ్లేషిస్తే వైకాపా విజ‌యం క‌నిపిస్తుంద‌న్నారు. గెలుపు విష‌యమై తాము చాలా ధీమాగా ఉన్నామ‌న్నారు.

స‌రే, వైకాపా నేత‌ల ధీమా ఏంటి… ప్ర‌స్తుతం చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌న్నీ ఓట‌మికి వెతుక్కుంటున్న సాకులే అని క‌దా! అలాంట‌ప్పుడు, వైకాపా నేత‌లు ఎందుకు ఇంత‌గా స్పందించేస్తుంటారు? ఎన్నిక‌ల త‌రువాత చంద్ర‌బాబు ఏం చేస్తే వారికేం..? ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ఎవ్వ‌రూ మార్చ‌లేరు క‌దా? అయినాస‌రే, ఎన్నిక‌ల సంఘానికి ఏదో ఒక అంశాన్ని అడ్డం పెట్టుకుని ఫిర్యాదులు ఎందుకు చేయ‌డం? ముఖ్య‌మంత్రి నిర్వ‌హించే సమావేశాల‌పైనా, సాధార‌ణ ప‌రిపాల‌న వ్య‌వ‌హారాలపై జ‌రిపే స‌మీక్ష‌ల‌పైనా ఎందుకంత విమ‌ర్శ‌లు చేయ‌డం..? ఎన్నిక‌ల ముందు కొంత‌మంది అధికారుల‌ బ‌దిలీల కోసం ఆరాట‌ప‌డ్డారు. ఎన్నిక‌ల త‌రువాత కూడా అదే త‌ర‌హాలో ఒక ర‌క‌మైన ఆందోళ‌న‌కు గురౌతున్నారు. గెలుపు వారి ప‌క్షాన ఉన్న‌ప్పుడు ధీమాగా ఉండొచ్చు క‌దా! ఇలా రోజుకో నాయ‌కుడు ప్రెస్ మీట్ పెట్టి కొత్త‌గా ఏమైనా చెప్తున్నారా లేదే? పోనీ, వారు చెప్తున్న ఒకే విష‌యం వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ప్రాక్టిక‌ల్ గా ఏదైనా ఉప‌యోగం ఉందా..? అదీ లేదు క‌దా. మ‌రెందుకీ ఊక‌దండ‌పు ఉప‌న్యాసాలు?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close