వంచించిన భార్య – సాఫ్ట్ వేర్ భర్త సూసైడ్..!

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట మధ్య పొరపొచ్చాలు వస్తే… ఎవరూ తగ్గడానికి సిద్ధం కాకపోతే.. కచ్చితంగా ఆ పరిస్థితి అంతిమంగా… విషాదానికే దారి తీస్తుంది. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ అదే జరుగుతుంది. దానికి హైదరాబాద్‌కు చెందిన ఓ యువజంట ప్రశాంత్ – పావనిల వ్యవహారమే నిదర్శనం. సాఫ్ట్ వేర్ ఉద్యోగులైన ఈ జంట.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ.. బంధాన్ని అదే ప్రేమతో కొనసాగించలేకపోయారు. చివరికి మధ్యలో మూడో వ్యక్తి ప్రవేశించడంతో … మొత్తానికే జీవితాలను విచ్చిన్నం చేసింది. ప్రశాంత్ ఆత్మహత్య చేసుకోగా… పావని జైలుకెళ్లాల్సి వచ్చింది.

హైదరాబాద్‌లో తిరునగరి ప్రశాంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ మల్టినేషనల్ కంపెనీలో… మంచి ఉద్యోగంలో ఉన్న ప్రశాంత్ కు ఆత్మహత్య చేసుకునేంత సమస్యలు ఉన్నాయని ఎవరూ అనుకోలేదు. కానీ ప్రశాంత్ రాసిన సూసైడ్ నోట్‌లో ఉన్న రెండు పదాలు… పోలీసులకు మొత్తం సీన్ అర్థమయ్యేలా చేశాయి. ” నా భార్య ప్రణయ్ వేములతో కలసి ఉంటోంది. ఆమె నన్ను మోసం చేసింది..” అని సూసైడ్‌నోట్‌లోని వాక్యాలు చూసిన తర్వాత పోలీసులకు క్లారిటీ వచ్చింది. కానీ ప్రశాంత్ భార్య పావని మాత్రం… పోలీసులకు.. విభిన్నంగా కథ చెప్పింది. ప్రశాంత్ అనుమానపు పిశాచి అని.. ఆ కారణంగానే… తనను వేధించి.. చివరికి అదే అనుమానంతో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పుకొచ్చింది. దీంతో పోలీసులు కూడా అదే అనుకున్నారు. కానీ… ఆ తర్వాత గంటల్లోనే అసలు క్లారిటీ వచ్చింది. వెంటే పావని అరెస్ట్ చేయాల్సి వచ్చింది.

కామారెడ్డికి చెందిన తిరునగరి ప్రశాంత్ ఐఐటీలో చదువుకున్నారు. మంచి ఉద్యోగం తెచ్చుకున్నారు. వరంగల్‌కు చెందిన పావనిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లయింది. కానీ పావని.. ఈ లోపు తన ఆఫీసులో పని చేసే… ప్రణయ్ వేముల అనే వ్యక్తికి దగ్గరయింది. అతనికి బెంగళూరులో ఉద్యోగం వస్తే తనూ అక్కడికే వెళ్లింది. అక్కడే ఇద్దరూ కలసి ఉండటం ప్రారంభించారు. బెంగళూరు నుంచి వారాంతాల్లో వస్తూండటంతో.. ప్రశాంత్‌కు అనుమానం రాలేదు. కానీ విషయం తెలిసిన తర్వాత.. ప్రశ్నించడంతో… ఇద్దరి మధ్య… గొడవ పెద్దదైపోయింది. నువ్వు నన్ను సుఖ పెట్టలేదని… అందులో ప్రణయ్‌తో ఉంటున్నానని.. పావని నేరుగా చెప్పడంతో.. ప్రశాంత్ ఆత్మహత్య చేసేసుకున్నారు. వారి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు బయటకు వచ్చాయి. దాంతో ప్రశాంత్ కుటుంబసభ్యులు పావని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్ష్యాలు ఉండటంతో పావనిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కొత్త తరం సాఫ్ట్ జనరేషన్‌లో కుటుంబ బంధాలకు ఉన్న విలువ తెలియకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయన్న అభిప్రాయం ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లోనే ఎక్కువగా ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ప్రేమించుకునేటప్పుడు… ఎంతో ప్రేమను ఎక్స్ పెక్ట్ చేసి.. ఆ తర్వాత తమను జీవిత భాగస్వామి నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావనకు రావడం కుటుంబాల్లో చిచ్చుకు కారణం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close