టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏపీలో సన్మానాలు ఏర్పాటు చేసిన వైసీపీ నేత..!

తెలంగాణ పేరుతో తెలంగాణ ప్రజలు ఏకమయ్యారు కానీ.. ఏపీలో ప్రజలు మాత్రం కులం పేరుతో.. అత్యంత దారుణంగా విభజనకు గురవుతున్నారు. రాజకీయ పార్టీల స్వార్థం దీనికి కారణం అవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో టీఆర్ఎస్ నేతలను.. ఏపీకి తీసుకొచ్చి సన్మానాలు చేయాలని నిర్ణయించుకుంది. కులాల వారీగా..టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను ఏపీకి తీసుకొచ్చి.. సన్మానాలు చేసి.. వారిని గొప్ప కులనేతలుగా ప్రస్తావించి… వారి ద్వారా ఓట్లు పొందాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా.. మొదటి విడతగా.. తెలంగాణ నుంచి గెలిచిన ఐదుగురు యాదవ సామాజికవర్గం ఎమ్మెల్యేలను పల్నాడులోని గామాలపాడు అనే గ్రామానికి తీసుకు వచ్చి సన్మానం చేయాలని.. వైసీపీ నేతలు నిర్ణయించారు. గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ సన్మానం జరగబోతోంది.

నాలుగు రోజుల కిందట… టీఆర్ఎస్ నేత… తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఏపీకి వెళ్లి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని ప్రకటించారు. అది ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినట్లుగానే ప్రచారం జరుగుతోంది. వైసీపీ నేతలు.. టీఆర్ఎస్ నేతలు.. ఓ అండర్ స్టాండింగ్‌ కు వచ్చే.. ఇలాంటి కుల సన్మానాలు చేసి… టీడీపీకి మద్దతుగా సామాజికవర్గాలను దూరం చేయాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్.. కూడా.. మంత్రి పదవి కోసం.. నానా తంటాలు పడుతున్నారు. ఆయన తన దూకుడుని ఏపీలో కూడా చూపిస్తే.. కేసీఆర్‌ను మెప్పించవచ్చని భావిస్తున్నారు. అందుకే… మిగతా యాదవ సామాజికవర్గ ఎమ్మెల్యేలను కూడా ఏపీకి తీసుకొచ్చేందుకు చొరవ తీసుకున్నారని చెబుతున్నారు.

టీఆర్ఎస్ ప్రమేయాన్ని ఏపీలో ..ఓ పద్దతి ప్రకారం పెంచేందుకు సన్నాహాలు జరుగుతున్న ఈ విషయం ఈ సన్మానాల విషయంలో క్లారిటీ వస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు. కొసమెరుపేమిటంటే… సన్మానాలు ఏర్పాటు చేస్తున్న జంగా కృష్ణమూర్తి.. గత ఎన్నికల్లో గురజాల నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి జగన్ ఆయనకు టిక్కెట్ లేదని స్పష్టం చేశారు. గురజాల ఇన్చార్జ్ గా కాసు మహేష్ రెడ్డిని నియమించారు. ఆయనే పని చేసుకుంటున్నారు. ఇలాంటి సన్మానాలను సక్సెస్ చేసి … జగన్ పై సామాజికవర్గ స్థాయిలో ఒత్తిడి తెచ్చి టిక్కెట్ తెచ్చుకుదామన్న ప్రయత్నాల్లో జంగాకృష్ణమూర్తి ఉన్నట్లు తెలుస్తోంది. టిక్కెట్ ఆశలు పెట్టుకున్న వారికి.. జగన్ ఇలాంటి ఎసైన్‌మెంట్లు ఇస్తూంటారని… ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతూంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close