ఏపీ బీజేపీ నేతలు ఇప్పటికైనా నేల మీదకు వస్తారా..? సొంత రాష్ట్రం కోసం పోరాడుతారా..?

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించడానికి జాతీయ బీజేపీ నేతలే కాదు.. తెలంగాణ, ఏపీ బీజేపీ నేతలకూ నోరు రావడం లేదు. జాతీయ స్థాయి సంగతి పక్కన పెడితే… నిన్నామొన్నటి వరకు.. తెలుగు రాష్ట్రాల భారతీయ జనతాపార్టీ నేతలను ఆపగలిగేవారెవరూ లేరు. కేంద్రంలో మాదే ప్రభుత్వం.. మోడీ బాహుబలి అన్న మాయలో చెలరేగిపోయేవారు. తెలంగాణలో తమతో అద్వితీయ శక్తి అని ఊహించుకుని ఎప్పుడో.. బుడగలో గాలి ఊదుకున్న బీజేపీకి.. ఎన్నికల్లో టప్ మని పేలిపోయింది. దాంతో.. పాతాళంలోకి పడిపోయారు. పేరు గొప్ప లీడర్లు కిషన్ రెడ్డి, లక్ష్మణ్… ఇంటికెళ్లిపోయారు. బీజేపీకి తెలంగాణలో ఒక్క సీటు వచ్చిందంటే.. అది రాజాసింగ్ తనకు తాను తెచ్చుకున్న హిందూత్వ నినాదం వల్ల.. తప్ప బీజేపీ వల్ల కాదు. వారి కంటే పెద్ద స్థాయిలో రెచ్చిపోయిన ఏపీ బీజేపీ నేతలు.. ఇప్పుడు ఏం చేయబోతున్నారు..?

తాను తెలుగువాడినని చెప్పుకుని.. ఏపీపై దాదాపుగా దండయాత్ర చేసిన జీవీఎల్ నరసింహారావు దగ్గర్నుంచి సోము వీర్రాజు అనే మహా మహా బడా నేత వరకూ… చాలా మంది ఇప్పటి వరకూ సైజుకు మించి మాటలు చెప్పారు. మోడీ ఉన్నాడన్న కారణంగా చెలరేగిపోయారు. మోడీని ప్రజలు నెత్తి మీద ఎక్కించుకుంటారని… ఆ ఊపులో తమకూ.. గ్యారంటీ అని చెలరేగిపోయారు. ఎన్నడూ… సొంతంగా కానీ.. బీజేపీ గుర్తుపై కానీ పోటీ చేసి డిపాజిట్లు తెచ్చుకోలేని.. నేతలే వీళ్లంతా. అయినా సరే.. ఎప్పుడూ… టీడీపీ, చంద్రబాబుపై వ్యక్తిగతగా విమర్శల దాడి చేయడమే తప్ప… నిర్మాణాత్మకంగా ఏపీ కోసం ఇది చేశామని చెప్పుకోలేకపోయారు. తమ పార్టీకి చెందిన మోడీ అధికారంలో ఉందని విర్రవీగారు కానీ.. ఏపీకి అన్యాయం చేస్తున్నా.. నోరు మెదపలేకపోయారు. హామీలు అమలు చేయమన్నా ప్రభుత్వంపై ఎదురు దాడి చేశారు కానీ… ఒక్కటంటే.. ఒక్క రూపాయి ప్రయోజనాన్ని కేంద్రం నుంచి సాధించలేకపోయారు.

ఎంతో కొంత ఓటు బ్యాంక్… బేస్ ఉందని భావించిన తెలంగాణలో ..ఆ పార్టీ పరిస్థితి ఐదు శాతం ఓట్లకే పరిమితం అయింది. కానీ ఏపీలో.. తీవ్ర వ్యతిరేకత ఉంది. బీజేపీ అంటే.. జనం నవ్వుకునే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో వారికి ఒక్క శాతం ఓట్లైనా వస్తాయా..? అన్నది అసలైన సందేహం. పోటీ చేస్తే పరువు పోవడమే తప్ప… బావుకునేది ఏమీ ఉండదు. ఇప్పటికే.. కామినేని, హరిబాబు లాంటి నేతలు తాము పోటీ చేయబోవడం లేదని ప్రకటించారు. కనీసం ఉన్న వారైనా సొంత రాష్ట్రం కోసం పోరాడితే… ఎంతో కొంత గౌరవం ఆ నేతలకు అయినా దక్కుతుంది. లేకపోతే… !?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close