చిరు.. బిగ్‌బీని వాడుకొంటాడా?

రాజ‌కీయాలు చిరంజీవి ఇమేజ్‌ని డామేజ్ చేసిన మాట మెగా ఫ్యాన్సే ఒప్పుకొంటారు. అచ్చిరాని పోలిటిక్స్‌కి కాస్త బ్రేక్ ఇచ్చి.. చిరు ఇప్పుడు సినిమాల‌తో బిజీ అవుదామ‌నుకొంటున్నాడు. అందులో భాగంగానే 150వ సినిమా ప‌ట్టాలెక్కింది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. దానికి తోడు చిరు రీ ఎంట్రీ సినిమా. రాజ‌కీయాల్లో ఓట‌మిని సినిమాల్లో ఓ భారీ హిట్ కొట్టి బాకీ తీర్చుకోవాల‌ని చూస్తున్నాడు చిరు. అందుకోసం చిరు 150లో వీలైన‌న్ని అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌లు జోడించాల‌న్న‌ది చిరు తాపత్ర‌యం. అందులో భాగంగానే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని రంగంలోకి దింపే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. బుడ్డా బ‌న్‌గ‌యా తేరా బాప్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా బిగ్ బి హైద‌రాబాద్‌లో వ‌చ్చారు. చిరు కూడా ఆ వేడుక‌కు హాజ‌రయ్యారు. ఆ స‌మ‌యంలో చిరు 150వ సినిమా ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. కానీ అప్ప‌టికి చిరు రాజ‌యాల్లోబిజీగా ఉండి సినిమాల‌పై ధ్యాస పెట్ట‌లేదు. కానీ ఆ వేదిక‌పై బిగ్‌బీ, పూరి, వ‌ర్మ‌లు క‌ల‌సి చిరు రీ ఎంట్రీకి ఒప్పుకొనేలా చేశారు. ఒక వేళ చిరు సినిమాలు చేయ‌డానికి ఓకే అంటే నేను అతిథి పాత్ర‌లో న‌టించ‌డానికి సిద్ధ‌మ‌ని బిగ్‌బి ప్ర‌క‌టించారు.

ఇప్పుడు దాన్ని క్యాష్ చేసుకొనే ప‌నిలో ఉన్నారు అండ్ కో. ఈ విష‌యంలో బిగ్‌బిని కూడా చిత్ర‌బృందం సంప్ర‌దించే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. అయితే క‌త్తి రీమేక్‌లో బిగ్ బి న‌టించేంత‌టి పాత్ర లేదు. ఏదో బిగ్ బీ ఉన్నాడ‌ని చెప్పుకోవ‌డానికి అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోయే పాత్ర చేయించ‌డం క‌రెక్ట్ కాద‌న్న‌ది చిరు ఉద్దేశం. వీలుంటే 151వ సినిమాలో బిగ్‌ని ని వాడుకొంటే బాగుంటుంద‌ని భావిస్తున్నాడ‌ట‌. ఈలోగా వినాయ‌క్ అమితాబ్ గురించి ఓ మంచి పాత్ర సృష్టి స్తే త‌ప్ప‌… అమితాబ్ ఎంట్రీ లేన‌ట్టే. కాక‌పోతే 151వ సినిమా కోస‌మైనా చిరు అమితాబ్ ఆఫ‌ర్‌ని వాడుకొనే అవ‌కాశాలున్నాయ‌ని మెగా కాంపౌండ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ అన్న కొడుకు క‌న్నారావుపై మ‌రో కేసు…

కేసీఆర్ అన్న కొడుకు క‌న్నారావుపై మ‌రో కేసు న‌మోదైంది. ఇప్ప‌టికే ల్యాండ్ క‌బ్జా కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న కాన్నారావు దౌర్జ‌న్యాలు ఒక్కోటిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. పోలీసు అధికారుల‌తో క‌లిసి...

బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్…! త్వ‌ర‌లోనే మార్పు

తెలంగాణ కోసం పుట్టిన పార్టీ... తెలంగాణ రాష్ట్రం కోస‌మే ఎగిరిన గులాబీ జెండా.. తెలంగాణ బాగు కోస‌మే తండ్లాట‌... ఇలా త‌మ పార్టీ గురించి కేసీఆర్ ఎంతో గొప్ప‌గా చెప్పుకుంటారు. నిజానికి తెలంగాణ...

ఈసారి మోడీ కష్టమే… బీజేపీకి ఝలక్ ఇచ్చిన ఎంపీ అభ్యర్థి..!!

లోక్ సభ ఎన్నికల్లో 400సీట్లు సాధిస్తామని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. బీజేపీ మెజార్టీ సీట్ల గెలుపునకు మోడీ ఛరిష్మా దోహదం చేస్తుందని ప్రకటిస్తున్నారు. దేశమంతా మోడీ వేవ్ ఉందని బలంగా...

బీఆర్ఎస్ లో టెన్షన్ .. బినామీ ఆస్తుల అమ్మకానికి నిర్ణయం..?

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చోటు చేసుకున్న అక్రమాల గుట్టు బయటపడుతుందని బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన నెలకొందా..? భూకబ్జాలకు పాల్పడిన నేతలు ఎలాంటి చిక్కులు రాకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారా..? అంటే అవుననే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close