‘పెద్ది’ తో సక్సెస్ కొట్టిన ఆనందం జాన్వీ కపూర్ లో అణుమాత్రం కూడా లేదు. పైగా విమర్శల జడివానని ఎదుర్కోవాల్సివచ్చింది. ‘పెద్ది’ లోని జాన్వీ కపూర్ పాత్రపై పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. చాలామంది కథానాయికలు జాన్వీని సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే.. ఇలాంటి డిబేట్ ని ఏ కథానాయికా కోరుకోదు.
‘పెద్ది’ ప్రమోషన్లలో జాన్వీ విరివిగా పాల్గొంది. విడుదలకు ముందు ఎక్కడ ప్రెస్ మీట్ జరిగినా జాన్వీ హాజరు తప్పని సరి. అయితే.. విడుదల తరవాత తాను పూర్తిగా కనిపించడం మానేసింది. సోమవారం హైదరాబాద్ లో థ్యాంక్యూ మీట్ జరిగింది. అక్కడ జాన్వీ కనిపించలేదు. ఈవారంలో `పెద్ది` సక్సెస్ మీట్ జరగబోతోంది. మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రానున్నారు. పవన్ కల్యాణ్ నీ పిలవాలన్నది టీమ్ ఆలోచన. అది కుదురుతుందో లేదో? సక్సెస్ మీట్ తో ప్రమోషన్లకు కూడా పుల్ స్టాప్ పెట్టేయనున్నారు. మరి ఈ చిట్ట చివరి ఈవెంట్ లో జాన్వీ మెరుస్తుందా? లేదా? అనేది ఆసక్తిని రేపుతోంది. వస్తే ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడితే ఎలాంటి రియాక్షన్ వస్తుందో అనేది జాన్వీకి కూడా తెలియకపోవొచ్చు. టీమ్ కూడా జాన్వీపై ఒత్తిడి తెచ్చే పని ఏం పెట్టుకోలేదు. ఫార్మాలిటీగా ఆమెని పిలిచి… రావాలా, వద్దా అనేది తన నిర్ణయానికి వదిలేద్దాం అనుకొంటున్నట్టు సమాచారం. వచ్చినా, రాకపోయినా జాన్వీ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వడం ఖాయం.
దేవర, పెద్ది దెబ్బలతో జాన్వీ తదుపరి చేయబోయే తెలుగు సినిమా పట్ల మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఏర్పడింది. జాన్వీకి అవకాశాల కొరతేం లేదు. ఇప్పట్లో రాదు కూడా. కానీ తన ఛాయిస్ పెర్పెక్ట్ గా ఉండాలి. హీరో చూసో, బ్యానర్ చూసో.. సినిమాల్ని ఒప్పుకోకుండా.. తన పాత్ర బలాబలాలు బేరీజు వేసుకొని, కథలు ఒప్పుకొంటే జాన్వీ తెలుగులోనూ మెరిసే అవకాశం ఉంది.
