మోడీ ఆలోచిస్తారు..కేటీఆర్ పాటిస్తారు..! మరీ ఇంత ఫాస్టా..?

తెలంగాణలో ” ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” పేరిట వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల పన్నెండు నుంచే… ప్రారంభించాలని ఆదేశించారు. ఆగస్టు పదిహేను వరకు సాగుతాయి. ఉత్సవాలకు రూ.25 కోట్లు తక్షణం విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. దేశంలో స్వాతంత్ర్య సంగ్రామంలో తెలంగాణ కీలక పాత్ర పోషించిందని ..ఆ మేరకు 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ అంశం కేసీఆర్ సొంతంగా ఇనిషియేట్ చేసుకున్నదేమీ కాదు. కేంద్ర ప్రభుత్వం ఆలోచన. ఇటీవల నరేంద్రమోడీ నేతృత్వంలో… 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల నిర్వహణపై ఓ కమిటీ వేశారు. ఆ కమిటీలో ముఖ్యమంత్రులు.. గవర్నర్లతో పాటు ఇతర రంగాల ప్రముఖులు ఉన్నారు. వీరితో మోడీ వర్చువల్ సమావేశం అయ్యారు.

ఈ సమావేశంలో కేసీఆర్ పాల్గొన్న తర్వాత… ఫటాఫట్ నిర్ణయాలు ప్రకటించేశారు. వెంటనే పాతిక కోట్లు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించి… ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారికి బాధ్యతలు ఇచ్చేశారు. ఇతర కమిటీ సభ్యులను కూడా నియమించారు. ఇందులో భాగంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 75 వారాల పాటు దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలను నిర్వహిస్తారు. పన్నెండోతేదీన ప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొననున్నారు.

75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాలను ఘనంగా నిర్వహించడం వెనుక జాతీయ వాదాన్ని మరింత బ లంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచనలో కేంద్రం ఉంది. అయితే ఆ జాతీయ వాదం … బీజేపీ వాదమని.. కేంద్రాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే వారిపై దేశ వ్యతిరేకుల ముద్ర వేసే ప్రయత్నాలు చేస్తున్నారని కొంత కాలంగా విమర్శలు వస్తున్నాయి. రాజకీయంగా బీజేపీ వ్యూహం అదే. వ్యతిరేకించలేని స్థితికి ఇతర పార్టీలు వెళ్లిపోతున్నాయి. ఈ క్రమంలో… తెలంగాణలో.. బీజేపీ వ్యూహానికి చెక్ పెట్టేలా… బీజేపీ కన్నా.. తమకే ఎక్కువ జాతీయ వాదం ఉందని నిరూపించుకునేలా.. కేసీఆర్.. ఘనంగా వేడుకలు నిర్వహించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే.. మోడీ సమీక్ష ముగియగానే రంగంలోకి దిగారని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close