నానిని మీడియా వెనక్కి లాగిందా ?

నాని దసరా సినిమా వందకోట్ల క్లబ్బులో చేరిందని టీం ప్రకటించింది. నానికి గతంలో చాలా విజయాలు వున్నాయి. కానీ ఇదే తొలి వందకోట్ల సినిమా. ఆ రకంగా దసరా నానికి చాలా ప్రత్యేకం. దసరాని పాన్ ఇండియా సినిమాగా విడుదల చేశారు. హిందీ లో ఓ మోస్తారుగా ఆడింది. యూస్ మాత్రం మంచి నెంబర్స్ చేసింది.

అయితే దసరా సినిమాకి మీడియా నుంచి రావాల్సినంత సపోర్ట్ రాలేదనేది నాని అభిప్రాయం. కరీంనగర్ లో జరిగిన ఈవెంట్ లో నాని మాటలు వింటే .. దసరాపై మీడియా నెగిటివ్ ప్రచారం చేసిందని ఆయన నేరుగా చెప్పారు. ”నేను నాకు తోచింది మనసుకు నచ్చింది చేస్తూ వచ్చాను. ఈ క్రమంలో నిరాశ పరిచిన వారూ వున్నారు. మనం ముందుకు వెళ్తామంటే వెనక్కి లాగేవారే ఎక్కువ. కానీ బలంగా నమ్మి మనస్పూర్తిగా దిగుతాను. మీడియా, సోషల్ మీడియాలో ఒక కొత్త సినిమా రిలీజ్ అయితే పోవాలని కోరుకునే వారే ఎక్కువ. వాళ్ళందరిది తప్పు అని నిరూపించాలి. ఈ నెగిటివిటీ అనే చెడు మీద మంచి గెలవాలి. ఈ రోజు ‘దసరా’ అనే మంచి గెలిచింది” అని చెప్పుకొచ్చారు నాని.

దసరాలో నాని నటన బావుందని అందరూ మెచ్చుకున్నారు. దాదాపు అన్నీ రివ్యూలలో అదే రిపోర్ట్ వచ్చింది. కానీ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. గతంలో వచ్చిన చాలా సినిమాలతో పోలిక పెడుతూ అసలు దసరాలో ఒరిజినాలిటీ లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు చాలా మంది. అయితే అవన్నీ దాటుకొని దసరా వందకోట్లు సాధించడంతో నాని తన అభిప్రాయాన్ని ఎలాంటి దాపరికం లేకుండా బయటపెట్టాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close