పాకిస్తాన్‌‌తో పాటు వీళ్ళ పని కూడా పడితే విజయం పరిపూర్ణం అవుతుంది

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…..ఇప్పుడు మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఉగ్రవాద దాడి ఘటన మరుక్షణం నుంచి కూడా మోడీ వ్యూహాలు అద్భుతం. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా భారతదేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడం, అంతర్జాతీయ సమాజం మన వెంట నిలబడేలా చేయడంలో విజయవంతం అవుతూ వస్తున్నాడు మోడీ. మనోహర్ పరీకర్‌ లాంటి నిజాయితీ పరుడైన నాయకుడిని రక్షణశాఖ మంత్రిగా ఎంపిక చేసినప్పుడే మోడీ సీరియస్‌నెస్ ఏంటో చాలా మందికి అర్థమైంది. మన సైన్యం సరిహద్దులు దాటి ఆక్రమిత కాశ్మీర్‌లోకి వెళ్ళి మరీ ఉగ్రవాదులపైన దాడులు చేసిన తర్వాత… నరేంద్రమోడీ అండ్ టీం ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించబోతోందో అందరికీ అర్థమైంది. గత ప్రభుత్వాలలాగా ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ఖండ ఖండాలుగా కండించడం….ఆ తర్వాత మర్చిపోెవడం లాంటి కార్యక్రమాలు కాకుండా పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలన్న విషయంలో మోడీ అండ్ టీం చిత్తశుద్ధితో ఉందని భారతీయులందరికీ అర్థమైంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ని ఒంటరిని చేయడం, ఓడించడం కూడా మోడీ అండ్ టీం చేయగలరన్న నమ్మకం కలుగుతోంది.

అయితే అంతకంటే ముందు మనదేశంలో ఉన్న జాతి వ్యతిరేక శక్తులపైన విజయం సాధించడం చాలా ముఖ్యం. అసలు విజయం కూడా అందులోనే ఉంటుంది. ఉగ్రదాడుల విషయంలో భారతీయ సమాజం మొత్తం ఆగ్రహంగా ఉంది కాబట్టి మన కుహానా లౌకికవాదులు…ఇప్పుడు విమర్శలు చేయడానికి భయపడుతున్నారు. అంతమాత్రాన వాళ్ళు సైలెంట్‌గా ఉన్నట్టు కాదు. అవకాశం చూసి ప్రజల్లో లేని సందేహాలను విజయవంతంగా రేకెత్తించగలరు. అలాగే పాకిస్తాన్ సైనికులు మరణించారని కాశ్మీర్‌లో ఉన్న కొంతమంది జాతి విద్రోహులు సంతాపసభలు ఏర్పాటు చేశారు. దేశంలో అసహనం ఉంది అని రెచ్చిపోయిన మన బాలీవుడ్ బడా హీరోలకు కూడా ఇప్పుడు కనీసం సోషల్ మీడియాలో స్పందించడానికి కూడా టైం లేనట్టుగా ఉంది. మేధావులం అని చెప్పుకుంటూ తిరిగే కట్జూ లాంటి వాళ్ళు కూడా విషం చిమ్మే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇండియాలో ఉన్న యువతరాన్ని ఉగ్రమూకలో చేరవేయడానికి ఇక్కడున్న చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు అన్నది కంటికి కనిపిస్తున్న వాస్తవం. అలాంటి వాళ్ళలో లెక్చరర్స్, ప్రొఫెసర్స్ స్థాయి వారు ఉండడాన్ని చూస్తూ ఉంటే ఇంటి దొంగలతోనే ప్రమాదం ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తోంది. పాకిస్తాన్‌పైన పోరాడటంలో తన చిత్తశుద్ధి ఏ స్థాయిలో ఉంటుందో, వ్యూహాలు ఎంత సమర్ధవంతంగా ఉంటాయో భారతీయులందరికీ తెలిసేలా చేసిన నరేంద్రమోడీ ఇలాంటి ఇంటి దొంగల పని కూడా పడితే భారతదేశ చరిత్రలోనే గొప్ప ప్రధానిగా కీర్తిప్రతిష్టలు అందుకుంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]