ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని అలీ మ‌రింత ఇరిటేట్ చేయ‌బోతున్నాడా?

ఇది వ‌ర‌కు అలీని ‘మ‌నోడే’ అనుకునేవారు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌. 2019 ఎన్నిక‌ల పుణ్య‌మా అని… అలీకీ, ప‌వ‌న్‌కీ మ‌ధ్య దూరం పెరిగిపోయింది. దాంతో… ప‌వ‌న్ ఫ్యాన్స్ కూడా అలీని దూరం పెట్టేశారు. అలీ కూడా ప‌వ‌న్‌పై ఓ వీడియో బ‌య‌ట‌కు వ‌ద‌ల‌డం, ‘నేను మీ వ‌ల్ల హ‌ర్ట‌య్యాను’ అని నేరుగా చెప్ప‌డంతో ఈ గ్యాప్ మ‌రింత పెరిగింది. ఇప్పుడు అలీ… ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని మ‌రింత హ‌ర్ట్ అయ్యే ప‌ని చేయ‌బోతున్నాడ‌ని టాలీవుడ్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

పోసాని కృష్ణ ముర‌ళి ద‌ర్శ‌క‌త్వంలో ‘ముఖ్య‌మంత్రిగారూ మీరు మాటిచ్చారు’ అనే చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏర్ప‌డిన ప‌రిణామాల నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. చంద్ర‌బాబు నాయుడుపై సెటైరిక‌ల్‌గా ఈ సినిమా ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ చంద్ర‌బాబుకి మ‌ద్ద‌తు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ప‌వ‌న్‌ని పోలిన పాత్ర ఒక‌టుంద‌ని, అది అలీ చేయ‌బోతున్నాడ‌ని టాక్‌. చంద్ర‌బాబుతో పాటు ఈ సినిమాలో ప‌వ‌న్‌పైనా సెటైర్లు పేల‌బోతున్నాయ‌ని తెలుస్తోంది. మ‌రి అలాంటి పాత్ర చేయ‌డానికి అలీ ఎలా ఒప్పుకున్నాడో. మొత్తానికి ఈ సినిమా బ‌య‌ట‌కు వ‌స్తే.. చంద్ర‌బాబు నాయుడు ఫ్యాన్స్ తో పాటు ప‌వ‌న్ ఫ్యాన్స్ కూడా హ‌ర్ట‌వ్వ‌డం గ్యారెంటీ. మ‌రి అలీ ఏం చేస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close