సండ్ర గులాబీ : రేవంత్‌ ఒక్కడే పోరాడాల్సిందేనా?

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించి… శాసనసభలో వారి కౌంట్‌ మరింత పడిపోతున్నదా? ప్రస్తుతం ఆపార్టీకి మిగిలిన ముగ్గురిలో సండ్ర వెంకట వీరయ్య కూడా గులాబీ పార్టీలోకి జంప్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అనుమానాలు రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి. తెదేపాకు ప్రస్తుతానికి సభలో మిగిలింది ముగ్గురే. వారిలోనూ ఆర్‌.కృష్ణయ్య.. తనకు తెలుగుదేశం పార్టీతో ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి తెదేపాకు ఉన్నది ఇద్దరే అనుకున్నా ఆశ్చర్యం లేదు. వారిలో ఒకరు ఇప్పుడు ఫిరాయించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి రాబోయే మూడేళ్ల పాటూ సింగిల్‌ మెంబర్‌గా శాసనసభలో అధికార తెరాసను ఎదుర్కొనే ఓపిక రేవంత్‌రెడ్డికి ఉన్నదా? అనేదే ఇప్పుడు అందరి సందేహం.

తెదేపా ఎమ్మెల్యేలు ఇద్దరిలో , ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి ఏ1 అయితే, సండ్ర వెంకట వీరయ్య ఏ2 గా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ కేసు స్తబ్ధుగానే ఉన్నది గానీ.. ప్రభుత్వం ఏ క్షణాన తలచుకుంటే అప్పుడు తిరగతోడడానికి వీలుగానే కేసు ఉన్నదనే వాదనలు వినిపిస్తుంటాయి. అలాంటి నేపథ్యంలో అధికార పార్టీలోకి జంప్‌ చేసి.. ఈ కేసుకు సంబంధించిన బురదను సాంతం వదిలించుకోవాలని సండ్ర వెంకటవీరయ్య అనుకుంటూ ఉండవచ్చు. అందుకే ఆయన తెరాసలోకి ఫిరాయిస్తున్నారనే పుకార్లు కూడా ఉన్నాయి.

ఇక పోతే పార్టీలో రేవంత్‌రెడ్డి ఒక్కరే మిగులుతారు. పార్టీకి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కూడా అయిన రేవంత్‌రెడ్డి అంతో ఇంతో తన శక్తి వంచన లేకుండా ప్రతిసందర్భంలోనూ ప్రభుత్వ పార్టీ మీద పోరాడుతూనే ఉన్నారు. కానీ ఆయనకు పరిస్థితులు కలిసి రావడం లేదు. కొన్నాళ్లుగా సండ్ర వెంకట వీరయ్య పార్టీ కార్యక్రమాలకు దూరంగానే మెలగుతున్నారనేది కూడా గమనార్హం. అంటే రేవంత్‌కు ఇన్నాళ్లుగా సాగించిన ఒంటరి పోరాటమే ఇక మీదట కూడా తప్పకపోవచ్చు. అయితే మూడేళ్ల పాటూ ఒక్కడే అధికార పార్టీని తట్టుకుని ఉండగలడా.. లేదా, తాను కూడా మరో మార్గాన్ని వెతుక్కుంటాడా? అని కూడా పలువురు అనుమానిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close