షర్మిలది బెదిరింపా ? నిజంగానే ఏపీలో పార్టీ పెడతారా ?

ఏపీలో పార్టీ పెట్టకూడదని రూల్ ఉందా షర్మిల వ్యాఖ్యానించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనాత్మకమవుతోంది. దీనికి కారణం అన్న జగన్‌తో తేల్చుకోలేనంత విభేదాలు రావడమే. క్రిస్మస్ సందర్భంగా పులివెందులలో జరిగిన కుటుంబ సమావేశాలో అన్నతో తీవ్ర వాగ్వాదానికి దిగి ఆమె పండుగ చేసుకోకుండానే హైదరాబాద్ వెళ్లిపోయారు. అప్పట్నుంచి ఆమె ఎపీలో రాజకీయాలపై దృష్టి పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. షర్మిల ఎలాంటి అడుగులు వేయబోతున్నారన్న అంశంపై ముందుగానే సమాచారం ఇస్తున్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కూడా అన్నను దారిలోకి తెచ్చుకోవాలంటే ఏపీలో పార్టీ ఏర్పాటు చేయాలనే సలహాలను తన మీడియా ద్వారా పంపుతున్నారు. ఈ క్రమంలో షర్మిల చేసిన వ్యాఖ్యలు సహజంగానే ఆసక్తి రేపుతున్నాయి.

షర్మిల త్వరలో ఏపీలో పర్యటనలు కూడా ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేతలు ఏర్పాటుచేసిన వైఎస్ఆర్ విగ్రహాల ఆవిష్కరణకు ఆమెకు ఆహ్వానాలు వస్తున్నాయి. ఈ ఆహ్వానాలను మన్నిస్తే కొత్త మలుపులు ఖాయమే. అయితే తాను అన్ను కాదని జనంలోకి వెళ్తే వారి స్పందన ఎలా ఉంటుందన్నదానిపై ఇప్పటికే షర్మిల పరిశీలన జరుపుతున్నారు. కొన్ని సంస్థలతో నివేదికలు తెప్పించుకుంటున్నారు. వైఎస్ కుమార్తెగా ఆమెకు జగన్‌తో పాటు మద్దతు లభిస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో ముందడుగు వేస్తారని చెబుతున్నారు.

వైసీపీలో సీఎం జగన్ తర్వాత ఎవరు అనే చర్చ రాకూడదు. కానీ ఆయనపై ఉన్న అక్రమాస్తుల కేసు వల్ల ఆ ప్రశ్నవస్తోంది. దానికి సమాధానం వెదుక్కునే క్రమంలోనే ఎన్నో విభేదాలు ఆ కుటుంబంలో చోటు చేసుకుటున్నాయి. జగన్ చాయిస్ గా భారతీరెడ్డిని ఖరారు చేయగా.. కుటుంబం మొత్తం మాత్రం విజయలక్ష్మిని తెర ముందుకు తెస్తున్నారు. ఈ క్రమంలో గొడవలు పెరిగి పెద్దవైపోయాయి. అవి షర్మిల రాజకీయ పార్టీ పెట్టే దిశగా వెళ్తున్నాయి. ఈ గొడవల్ని జగన్ వ్యూహాత్మకంగా నిలుపుదల చేసుకుని.. రాజకీయంగా ఇబ్బంది లేకుండా చూసుకుంటారా లేక … అదే మొండిపట్టుదలతో వ్యవహరించి ఇబ్బంది పడతారా అన్నది ఇప్పుడు వైసీపీలోనూ వెలుగు చూస్తున్న ప్రశ్న.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close