విజయశాంతిని తట్టుకోగలరా..?

విజ‌య‌శాంతి దాదాపు పుష్కర కాలం తరవాత కెమెరా ముందుకు వస్తోంది. `సరిలేరు నీకెవ్వరు` తో. ఈ సినిమా కోసం రాములమ్మ షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకుంది. అది ఎంత అనేది చిత్ర బృందం కూడా చెప్పడం లేదు. కాకపోతే.. రెమ్యున‌రేషన్ టెంప్ట్ చేయడం వల్లే విజయశాంతి ఈ ఆఫ‌ర్‌ ఒప్పుకుందని సమాచారం. దానికి తగ్గట్టుగానే విజయశాంతి పాత్రకు చాలా ప్రాధాన్యం ఇచ్చి, ఆ పాత్రని చాలా శ‌క్తిమంతంగా తీర్చిదిద్దుతున్నారు.

విజయశాంతి కూడా ఈ సినిమా పై చాలానే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ఫలితం చూశాకే.. నటన కొనసాగించాలా .? లేదంటే మళ్లీ రాజకీయాలతో నే సరిపెట్టుకోవాలా..? అనేవి నిర్ణయించుకోవాలని భావిస్తోంది. ఒకవేళ ఈ సినిమా హిట్ అయ్యి. .. తన పాత్రకి మంచి పేరు వస్తే… తప్పకుండా నటిగా మరిన్ని మంచి అవకాశాలు వస్తాయి. ఇప్పటికే కొంతమంది దర్శకులు విజయశాంతి కి తగిన పాత్రలు సిద్ధం చేస్తున్నారు కూడా. కాకపోతే విజయశాంతి పారితోషికం భరించడమే కష్టం. విజయశాంతి రేసులోకి వస్తే, రమ్యకృష్ణ, నదియా, టబు లాంటి వాళ్ళు కూడా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వుంటుంది. నదియా క్రేజ్ ఇప్పటికే బాగా తగ్గిపోయింది. బాహుబలి తరవాత రమ్యకృష్ణ కీ మంచి పాత్రలు దక్కలేదు. సరిలేరు హిట్ ఐనా ఆ క్రేజ్ ని కాపాడుకోవడం విజయశాంతి కి తలకుమించిన పనే అవుతుంది. మరి ఏం చేస్తుందో… తన కెరియర్ ఎలా మలచుకుంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close