సాక్షి ప్రచారం చూసి, వైసీపీ ఎమ్మెల్యేలు టెంప్ట్‌ అవుతారేమో?

సాక్షి చేసే ప్రచారం సాధారణంగా వైఎస్‌ జగన్మోహనరెడ్డికి మేలు చేసే ఉద్దేశంతో సాగుతుంది. తమ అధినేతకు మేలు జరగకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు మీద బురద పడితే చాలు అనుకునే సందర్భాల్లో కూడా సాక్షి ఉత్సాహంగా కథనాల్ని అందిస్తుంది. అయితే తాజాగా ఎమ్మెల్యేలతో చంద్రబాబునాయుడు సమీక్ష సమావేశం పెట్టుకుంటే దాన్ని గురించి అందించిన కథనం మాత్రం.. ఇండైరక్టుగా వైకాపాకే చేటు చేస్తుందా అనిపించేలా ఉన్నదని రాజకీయ వర్గాల్లో సెటైర్లు నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఎప్పటికీ తెలుగుదేశం మాత్రమే గెలిచేలా, ప్రజల్లో తమ పార్టీకి స్థిరమైన ఆదరణ ఉండేలా ఎమ్మెల్యేలు అందరూ పనిచేయాలని, పార్టీకి ఆదరణ పెరిగి ఇతరత్రా వేరే పార్టీలనుంచి ఎవ్వరు వచ్చినా చేర్చుకోవాలని చంద్రబాబునాయుడు ఈ సమావేశంలో చెప్పినట్లుగా వార్తలు అనేకం వచ్చాయి.
అయితే సాక్షిలో భిన్న కోణాల్లో ఈ వార్తను ఆవిష్కరించారు. ఈసారి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగే అభ్యర్థులు అందరికీ ఖర్చు తానే (బహుశా పార్టీనే) భరిస్తుందని, అందరినీ గెలిపించే బాధ్యతను తానే తీసుకుంటానని చంద్రబాబునాయుడు చెప్పినట్లుగా, హామీ ఇచ్చినట్లుగా వారు ఒక కథనాన్ని అందించారు.

ఇలాంటి శీర్షిక మరియు ఇలాంటి కోణంలోంచి కథనం అంటే.. చంద్రబాబునాయుడు వద్ద అందరూ ఎమ్మెల్యేలకు ఖర్చు భరించేంత అవినీతి సొమ్ము ఉన్నదని ప్రజలు భావిస్తారు అని వారు అనుకున్నారేమో గానీ.. నిజానికి ఆ వార్త నిజమైతే గనుక.. వైకాపా ఎమ్మెల్యేలు మరికొందరు తెలుగుదేశం వైపు ఎట్రాక్ట్‌ అయ్యే అవకాశం ఉన్నదని రాజకీయ వర్గాల్లో పుకార్లు నడుస్తున్నాయి.

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు పార్టీలే ఎన్నికల ఖర్చులు భరించడం అనేది ఒక శుభపరిణామం. మొన్నటికి మొన్న వరంగల్‌లో జరిగిన ఉప ఎన్నికలో కేసీఆర్‌, తమ పార్టీ అభ్యర్థికి ఎన్నికల సంఘం అనుమతించే లిమిట్‌ వరకు ఖర్చు మొత్తాన్ని పార్టీ తరఫున సింగిల్‌ చెక్‌గా ఇచ్చి.. బరిలో నిలబెట్టారు. ఇలా అభ్యర్థుల ఖర్చును భరించడానికి పార్టీ సిద్ధపడడం వలన.. నిజాయితీగల అభ్యర్థులను రంగంలోకి తేవడానికి వీలుంటుంది. అభ్యర్థుల ఎంపికలో డబ్బు అనేది ప్రాతిపదిక కాకుండా.. ఇతర అర్హతలు ప్రామాణికం అవుతాయి. అన్నిటినీ మించి.. రాజకీయ అవినీతి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది.

పైగా వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ తన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు పార్టీ తరఫున కొందరికి కూడా ఎలాంటి ఆర్థిక తోడ్పాటు అందించరనే ఒక అపకీర్తి ఉంది. మొన్నటికి మొన్న రోజాకు కోర్టు ఖర్చులు భరించినప్పుడు కూడా.. ”ఎన్నికల్లో మా నేత పైసా విదిలించడు గానీ.. రోజాకు డబ్బు ఇవ్వడానికి ఎలా ఒప్పుకున్నాడో” ఆ పార్టీ ఎమ్మెల్యేలే విస్తుపోయినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. చివరికి పేద అభ్యర్థులను ఎంపిక చేసిన చోట్ల కూడా.. వారి ఖర్చు భరించాల్సిందిగా ఆ ఏరియా ఎంపీ అభ్యర్థులకు పురమాయించడం తప్ప.. జగన్‌ పార్టీ తరఫున ఒక్కరికి కూడా దన్నుగా నిలవడు అనే పేరుంది. ఈ వాదన నిజమైతే గనుక, ఇప్పుడు చంద్రబాబు పార్టీ తరఫున ఖర్చులు భరిస్తాం అంటూ కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుట్టదలచుకుంటే వైకాపా నుంచి దానికి ఆశపడి వెళ్లే ఎమ్మెల్యేలు కూడా కొందరు ఉంటారేమో? ఆ రకంగా సాక్షి తమ కథనంలో తీసుకున్న కోణం.. సొంత పార్టీకే చేటు చేస్తుందేమో అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

అప్పుల క‌న్నా ప‌న్నులే ఎక్కువ‌… ప‌వ‌న్ ఆస్తుల లిస్ట్ ఇదే!

సినిమాల్లో మాస్ ఇమేజ్ ఉండి, కాల్ షీట్ల కోసం ఏండ్ల త‌ర‌బ‌డి వెయిట్ చేసినా దొర‌క‌నంత స్టార్ డ‌మ్ ఉన్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్. పిఠాపురం నుండి పోటీ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్...

పదేళ్ల తర్వాత పండగొచ్చిందా…ఇదేనా ప్రజాస్వామ్యపంథా..!?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ - టీవీ9 రజినీకాంత్ ఇంటర్వ్యూ తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ ఇంటర్వ్యూకు బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం...

జగన్ పరువు తీసిన వైసీపీ సోషల్ మీడియా మీట్ !

వైసీపీ కోసం పని చేసిన , చేస్తున్న సోషల్ మీడియా వారియర్లు తమ పరిస్థితేమిటని గగ్గోలు పెడుతున్నారు. ఐదేళ్లలో ఎవరూ పట్టించుకోలేదని ఫీలవుతున్నారు. ఈ క్రమంలో వారందరికీ భరోసా ఇప్పిస్తానంటూ సజ్జల పుత్రరత్నం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close