పుష్కరాలు ఏర్పాట్లు అదుర్స్ కానీ…

నేటి నుండి 12రోజులు పాటే కృష్ణా పుష్కరాల హడావుడి రెండు తెలుగు రాష్ట్రాలలో మొదలయ్యింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో దుర్ఘాఘాట్ వద్ద, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మహబూబ్ నగర్ జిల్లాలో గొందిమళ్ళ ఘాట్ వద్ద తమ కుటుంబ సభ్యులు, మంత్రులతో కలిసి పుష్కర స్నానాలు ఆచరించారు.
కృష్ణా పుష్కరాలకి రెండు రాష్ట్రాలు చాలా బారీ ఏర్పాట్లే చేశాయి. ప్రత్యేక బస్సులు, రైళ్ళు నడిపిస్తున్నాయి. భక్తుల కోసం వైద్య, భోజన ఇతర సదుపాయాలన్నీ కలిపిస్తున్నాయి. ప్రధాన ఘాట్లలో రద్దీ నివారించేందుకు నది పొడుగునా పలు ప్రాంతాలలో అనేక ఘట్లు ఏర్పాటు చేసాయి. ఆ వివరాలని భక్తులకి తెలిపేందుకు ప్రత్యేకంగా పుష్కర వెబ్ సైట్లు, మొబైల్ యాప్స్ కూడా ఏర్పాటు చేశాయి. రెండు రాష్ట్రాలలో పుష్కర ప్రాంతాలలో వందలాది పోలీసులని, సిసి కేమేరాలని, ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ తో అనుసంధానం చేసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. ప్రధాన ఘాట్లన్నిటినీ విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించాయి.

పుష్కరాలు సజావుగా సాగేందుకు రెండు ప్రభుత్వాలు తాము చేయగలిగినంతా ఏర్పాట్లు చేసి పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి. గోదావరి పుష్కరాలలో ఎదురైనా చేదు అనుభవాల నుంచి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పాఠాలు నేర్చుకొని మళ్ళీ అటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొన్నాయి. కనుక ఇక పుష్కరాలకి బయలుదేరుతున్న భక్తులే తమ తరపు నుంచి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది.

అయితే ఆంధ్రప్రదేశ్ చేస్తున్న పుష్కర ఏర్పాట్లలో ఒక చిన్న లోపం కనిపిస్తోంది. ఆధ్యాత్మికత వెల్లివిరిసే విధంగా నిర్వహించాల్సిన పుష్కరాలని చాలా అట్టహాసంగా చేస్తోంది. పుష్కరాలలో ప్రధానంగా కనబడవలసిన భక్తి, ఆద్యాత్మికత స్థానంలో ఆర్భాటమే ఎక్కువ కనిపిస్తోంది. దేశప్రజలందరి దృష్టిని ఆకర్షించడానికే ప్రభుత్వం ఆవిధంగా చేస్తున్నప్పటికీ, అది పుష్కరాల ముఖ్యోదేశాన్ని దెబ్బ తీసేంతగా ఉండకూడదు. పుష్కరాలలో భక్తులకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం ఎంత అవసరమో వారిలో అధాత్య్మిక భావనలు కలిగే వాతావరణం కూడా కల్పించడం అంతే అవసరం. అప్పుడే పుష్కరాలకి ఇంకా ప్రాధాన్యత పెరుగుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close